విరాట్‌‌‌తో ఫోటో దిగి సంబరపడిపోతోన్న వీరిద్దరూ ఎవరో తెలుసా...

ప్రాక్టీస్ సెషన్స్‌లో బిజీగా ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ...తనకు వీరాభిమానులైన డేన్ వాన్ నీకెర్క్, మరిజానే కాప్‌లతో కలిసి ఫోటో దిగాడు. తమకెంతగానో ఇష్టమైన విరాట్‌ను కలిసిన ఆనందంలో వీరిద్దరూ తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.

news18-telugu
Updated: January 10, 2019, 7:51 PM IST
విరాట్‌‌‌తో ఫోటో దిగి సంబరపడిపోతోన్న వీరిద్దరూ ఎవరో తెలుసా...
విరాట్ కొహ్లీతో డేన్ వాన్ నీకెర్క్, మరిజానే కాప్ ( Dane' van Niekerk/ Marizanne Kapp/Instagram)
news18-telugu
Updated: January 10, 2019, 7:51 PM IST
సౌతాఫ్రికా మహిళా క్రికెటర్లు డేన్ వాన్ నీకెర్క్, మరిజానే కాప్ భారత కెప్టెన్ విరాట్ కొహ్లీకి వీరాభిమానులు. గత ఏడాది జులైలో డేన్ వాన్ నీకెర్క్, మరిజాన్నే కాప్ పెళ్లి చేసుకున్నారు. అంతకుముందు సహజీవనం చేసిన ఈ ఇద్దరు మహిళా క్రికెటర్లు వివాహ బంధంతో ఒక్కటై అందరినీ ఆశ్చర్యపరచారు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న లెస్బియన్ జోడీగా వీరిద్దరూ అభిమానులకు సుపరిచితులే. డేన్ వాన్ దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్ జట్టుకు మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది. ఆల్‌రౌండర్ అయిన మరిజానే సౌతాఫ్రికా జట్టులో కీలక సభ్యురాలు. ప్రస్తుతం డేన్‌,మరిజానే మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్ తరఫున ఆడుతున్నారు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు సమాయత్తమవుతోన్న విరాట్ సైతం సిడ్నీలోనే ఉన్నాడు. సిడ్నీ క్రికెట్ స్టేడియం సిడ్నీ సికర్స్ జట్టుకు హోంగ్రౌండ్. భారత్-ఆస్ట్రేలియా తొలి వన్డే వేదిక కూడా అదే. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతున్న టీమిండియా ప్రాక్టీస్ సెషన్స్‌లో బిజీగా ఉన్న కొహ్లీ...ఈ ఇద్దరితో కలిసి ఫోటో దిగాడు. తమకెంతగానో ఇష్టమైన విరాట్‌ను కలిసిన ఆనందంలో వీరిద్దరూ తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.

" తన ఆరాధ్య క్రికెటర్ అయిన విరాట్‌ కొహ్లీని ప్రతీ రోజూ కలిసే అవకాశం దక్కదు..." అని డేన్ వాన్ నీకెర్క్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటో పోస్ట్ చేసింది. "సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో కొహ్లీతో కలిసి ఫోటో దిగే అవకాశం దక్కింది"...అని మరిజాన్నే కాప్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పోస్ చేసింది.


 

Loading...


View this post on Instagram
 

Not everyday you get to meet #kingkohli #fangirl


A post shared by Dane' van Niekerk (@danevanniekerk) on
 
View this post on Instagram
 

Managed to get a photo with the big man at the SCG today... 💪🏻#kingkohli👑


A post shared by Marizanne Kapp (@kappie777) on


టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీకి ఉన్న క్రేజ్,పాపులారిటీ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా రికార్డ్‌ల మోత మోగిస్తోన్న విరాట్‌కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్నారు. ప్రస్తుతం భారత జట్టులో ఉన్న ఆటగాళ్లందరూ కొహ్లీకి అభిమానులే. ఎంతోమంది ఇతర దేశాల క్రికెటర్లు సైతం విరాట్‌‌ను ఆదర్శంగా తీసుకుంటారు. ఇక ఈ స్టైలిష్ క్రికెటర్‌కు ఉన్న ఫిమేల్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..
First published: January 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...