హోమ్ /వార్తలు /క్రీడలు /

Ganguly: ఎట్టకేలకు మౌనం వీడిన దాదా..బీసీసీఐ ప్రెసిడెంట్ పోటీకి దూరంపై గంగూలీ సంచలన కామెంట్స్

Ganguly: ఎట్టకేలకు మౌనం వీడిన దాదా..బీసీసీఐ ప్రెసిడెంట్ పోటీకి దూరంపై గంగూలీ సంచలన కామెంట్స్

గంగూలీ (ఫైల్ ఫోటో)

గంగూలీ (ఫైల్ ఫోటో)

ఎట్టకేలకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మౌనం వీడి మాట్లాడారు. రెండోసారి బీసీసీఐ అధ్యక్ష పదవి రేసులో ఉండకపోవడంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తన జీవితంలో టీమిండియాకు ఆడిన సమయమే అత్యుత్తమం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఎట్టకేలకు బీసీసీఐ (Bcci) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Ganguly) మౌనం వీడి మాట్లాడారు. రెండోసారి బీసీసీఐ అధ్యక్ష పదవి రేసులో ఉండకపోవడంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తన జీవితంలో టీమిండియాకు (India) ఆడిన సమయమే అత్యుత్తమం. ఆ 15 ఏళ్లు ఎన్నో ఇన్నింగ్స్ లు ఆడాను. బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నాను. మీరు జీవితంలో ఏదైనా చేయగలరు. కానీ నా జీవితంలో నేను మరింత ముందుకు సాగే ఉద్దేశ్యంలో ఉన్నానంటూ గంగూలీ వ్యాఖ్యానించారు. మరోసారి బీసీసీఐ ప్రెసిడెంట్ గా ఉండలేనంటూ దాదా అంగీకరించాడు. ఏదైనా పెద్ద పని చేయాలంటే అంతకుముందు చాలా ఇవ్వాల్సి ఉంటుంది.  బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ తాజా వ్యాఖ్యలతో మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ బీసీసీఐ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యే అవకాశం వుంది.

T20 World Cup 2022 : టీమిండియాను భయపెడుతోన్న ‘పంచ గండాలు’ అధిగమిస్తేనే కప్పు అందేది

దాదా వ్యాఖ్యలు చూస్తుంటే బీసీసీఐతో గంగూలీ ప్రయాణం ముగిసినట్లు తెలుస్తుంది. కాగా 15 ఏళ్ల పాటు ఇండియా తరపున ఆడిన గంగూలీ ఎన్నో మరిచిపోలేని విజయాలను తెచ్చి పెట్టాడు. అటు ఐపీఎల్ లో తన మార్క్ కెప్టెన్సీని చాటుకున్నాడు.  మరి ఈ నేపథ్యంలో గంగూలీ ఎలాంటి స్టెప్ తీసుకుంటారో చూడాలి.

అసలు విషయం ఏంటంటే..?

ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ ఉన్నారు. 2019 అక్టోబర్ 23న ఆయన ఈ పదవిని చేపట్టారు. బీసీసీఐ అధ్యక్షుడితో పాటు కార్యవర్గం కాల పరిమితి 3 ఏళ్లు. ఈ ఏడాది అక్టోబర్ తో గంగూలీ కార్యవర్గం పదవీ కాలం ముగుస్తుంది. ఈ క్రమంలో బీసీసీఐ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం కోసం ఎలక్షన్స్ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. అక్టోబర్ 18న బీసీసీఐ ఎన్నికలు జరగనున్నాయి. అయితే గంగూలీ మరోసారి బీసీసీఐ ప్రెసిడెంట్ గా ఉంటారని వార్తలొచ్చాయి. ఆ తరువాత ఐసీసీ చైర్మన్ గా దాదా ఉంటాడని, బీసీసీఐ అధ్యక్షుడిగా మరొకరిని నియమిస్తారని తెలిసింది.

కానీ అనూహ్యంగా దాదాకు బీసీసీఐ ప్రెసిడెంట్, ఐసీసీ చైర్మన్ కాక ఐపీఎల్ చైర్మన్ గా ఉండాలని బోర్డు సభ్యులు సూచించారట. దీనితో బీసీసీఐ పదవిని వదుకోవాలని చెప్పారట. బీసీసీఐ ప్రెసిడెంట్‌గా దాదా విఫలమయ్యాడని, బోర్డు కార్యకలపాల్లో చురుకుగా ఉండటం లేదని సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక గంగూలీని కావాలనే బీసీసీఐ ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పిస్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. గంగూలీని బీజేపీలో చేరాలని కోరగా దానికి దాదా ఒప్పుకోకపోవడంతో కుట్రపూరితంగానే ఇలా వ్యవహరిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. జై షా సెక్రటరీగా కొనసాగడానికి లేని ఇబ్బంది.. దాదా మాత్రం బీసీసీఐ అధ్యక్షుడిగా ఉంటే వచ్చిందా అని మాజీ క్రికెటర్లు ప్రశ్నిస్తున్నారు.

First published:

Tags: Cricket, Sports

ఉత్తమ కథలు