హోమ్ /వార్తలు /క్రీడలు /

T20 World Cup: ఇదెక్కడి తుఫాన్‌రా దేవుడా? ఆ మ్యాచ్‌లు జరగడం డౌటే.. టిక్కెట్లు కూడా ఆమ్మడం లేదు

T20 World Cup: ఇదెక్కడి తుఫాన్‌రా దేవుడా? ఆ మ్యాచ్‌లు జరగడం డౌటే.. టిక్కెట్లు కూడా ఆమ్మడం లేదు

టీ20 వరల్డ్ కప్‌కు తుఫాను దెబ్బ.. టికెట్ల అమ్మకం నిలిపివేత (PC: Twitter)

టీ20 వరల్డ్ కప్‌కు తుఫాను దెబ్బ.. టికెట్ల అమ్మకం నిలిపివేత (PC: Twitter)

T20 World Cup: టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లకు తుఫాను గండం పొంచి ఉన్నది. ఒమన్‌లో తుఫాను కారణంగా భారీ వర్షాలు, వరదలు వస్తున్నాయి. దీంతో ఐసీసీ టికెట్లు అమ్మాకాలను తాత్కాలికంగా నిలిపేసింది.

పురుషుల టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) యూఏఈ, ఒమన్ వేదికల్లో నిర్వహించడానికి ఐసీసీ (ICC) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మరో 10 రోజుల్లో ఒమన్ క్రికెట్ అకాడమీ (Oman Cricket Academy)  స్టేడియంలో రౌండ్ 1 మ్యాచ్‌లు ప్రారంభం కావల్సి ఉన్నది. సూపర్ 12కు ఇప్పటికే ర్యాంకింగ్స్ ఆధారంగా 8 జట్లు అర్హత సాధించగా.. మిగిలిన నాలుగు జట్లు రౌండ్ 1 క్వాలిఫయర్స్ ద్వారా అర్హత సాధించనున్నాయి. రౌండ్1 మ్యాచ్‌లకు అక్టోబర్ 17 నుంచి శ్రీలంక (Srilanka) - ఐర్లాండ్ (Ireland) మ్యాచ్‌తో ప్రారంభం కానున్నది. ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ టికెట్ అమ్మకాలను ప్రారంభించిన ఐసీసీ.. రౌండ్ 1 టికెట్ల అమ్మకాలను నిలిపివేసింది. యూఏఈలోని దుబాయ్, షార్జా, అబుదాబి స్టేడియంలకు సంబంధించిన టికెట్లు యధావధిగా కొనసాగుతుండగా.. ఒమన్ స్టేడియం టికెట్ల అమ్మకాలు మాత్రం నిలిపేసింది. దీనికి ముఖ్య కారణం ఒమన్‌లో భారీ తుఫాను రావడమే. ఒమన్ రాజధాన మస్కట్ సహా చుట్టు పక్కల చాలా ప్రాంతాలు తుఫాను కారణంగా వరదల్లో మునిగిపోయాయి. ఆ ప్రభావం ఒమన్ స్టేడియంపై కూడా పడింది.

ఒమన్‌లో మొత్తం 12 రౌండ్ 1 మ్యాచ్‌లు జరుగాల్సి ఉండగా.. తాత్కాలికంగా టికెట్ల అమ్మకం నిలిపేశారు. ఒమన్ ప్రభుత్వం 70 శాతం మంది ప్రేక్షకులకు అనుమతి ఇచ్చింది. అయితే తప్పకుండా రెండు డోస్‌ల వ్యాక్సిన్ తప్పని సరిగా వేసుకోవాల్సి ఉన్నది. ఒమన్, యూఏఈలో మ్యాచ్‌లు చూడాలంటే తప్పనిసరిగా వ్యాక్సినేషన్ చేసుకున్నట్లు ధృవీకరణ పత్రం చూపించాల్సి ఉన్నది. అందుకే కేవలం వ్యాక్సినేషన్ అయిన వాళ్లు మాత్రమే టికెట్లు కొనుగోలు చేయాలని ఐసీసీ కోరింది. టికెట్‌తో పాటు ధృవీకరణ పత్రం ఉంటేనే స్టేడియంలోకి అనుమతిస్తామని పేర్కొన్నది. ఒమన్‌లో జరిగే మ్యాచ్‌లకు 10 ఒమన్ రియల్స్ (రూ. 2 వేలు) టికెట్ ధరగా నిర్ణయించింది. ఇక యూఏఈలో జరిగే మ్యాచ్‌లకు కనీస టికెట్ ధర 30 దిర్హామ్ (రూ. 700)గా నిర్ణయించింది. ఐసీసీ అధికారిక వెబ్‌సైట్ నుంచి ఈ టికెట్లను కొనుగోలు చేయవచ్చని సూచించింది. ప్రస్తుతానికి యూఏఈ స్టేడియంల టికెట్లు మాత్రమే అమ్ముతున్నారు.

T20 World Cup: టీమ్ ఇండియాకు భారీ షాక్.. టీ20 వరల్డ్ కప్‌కు రోహిత్ శర్మ దూరం? కారణం అదే



ఒమన్ వేదికగా జరిగే మ్యాచ్‌లు

మ్యాచ్ నెంబర్జట్టుజట్టుతేదీ
1శ్రీలంకఐర్లాండ్17-10-21
2పపువా న్యూగినియాఒమన్18-10-21
3బంగ్లాదేశ్నమీబియా19-10-21
4నెదర్లాండ్స్స్కాట్లాండ్19-10-21
5ఐర్లాండ్ఒమన్20-10-21
6శ్రీలంకపపువా న్యూగినియా20-10-21
7నమీబియాస్కాట్లాండ్21-10-21
8బంగ్లాదేశ్నెదర్లాండ్స్21-10-21
9పపువా న్యూగినియాఐర్లాండ్22-10-21
10శ్రీలంకఒమన్22-10-21
11నెదర్లాండ్స్నమీబియా23-10-21
12బంగ్లాదేశ్స్కాట్లాండ్23-10-21

First published:

Tags: ICC, T20 World Cup 2021