Home /News /sports /

CWG 2022 SUDHIR WINS 1ST EVER GOLD MEDAL IN PARA POWERLIFTING AT COMMONWEALTHGAMES WITH A GAMES RECORD TO HIS NAME SRD

CWG 2022: వైక్యలం అడ్డురాలేదు.. పారా పవర్‌లిఫ్టింగ్‌లో చరిత్ర సృష్టించిన సుధీర్.. భారత్ ఖాతాలో ఆరో స్వర్ణం..

Photo Credit : SAI Twitter

Photo Credit : SAI Twitter

CWG 2022: పవర్ లిఫ్టింగ్‌లో వెయిట్ లిఫ్టింగ్ శరీర బరువు మరియు సాంకేతికత ప్రకారం పాయింట్లను ఇస్తుంది. అదే బరువును ఎత్తడం కోసం, శారీరకంగా తక్కువ బరువు ఉన్న ఆటగాడు మరొకరి కంటే ఎక్కువ పాయింట్లను పొందుతాడు. 87 కేజీల సుధీర్ తన తొలి ప్రయత్నంలోనే 208 కేజీలు ఎత్తి 132 పాయింట్లకు పైగా సాధించి మొదటి స్థానంలో నిలిచాడు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    కామన్వెల్త్ గేమ్స్ (Commonwealth Games 2022) లో భారత్ ఆటగాళ్లు దుమ్మురేపుతున్నారు. పారా పవర్ లిఫ్టింగ్ ఈవెంట్ పురుషుల హెవీవెయిట్ ఫైనల్‌లో భారత ఆటగాడు సుధీర్ (Para Power Lifter Sudhir) సరికొత్త రికార్డుతో బంగారు పతకాన్ని( Gold Medal) సాధించి చరిత్ర సృష్టించాడు. కామన్వెల్త్ గేమ్స్‌లో పారా పవర్‌లిఫ్టింగ్ ఈవెంట్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ ఆటగాడు సుధీర్. కాగా.. ఈ గేమ్స్ లో భారత్ కి ఇది ఆరో గోల్డ్ మెడల్. సుధీర్ తన రెండవ ప్రయత్నంలో 212 కిలోల బరువును ఎత్తి 134.5 రికార్డు స్కోరుతో బంగారు పతకాన్ని సాధించాడు. అయితే సుధీర్ తన చివరి ప్రయత్నంలో 217 కిలోలు ఎత్తడంలో విఫలమయ్యాడు. నైజీరియాకు చెందిన ఇకెచుక్వు, క్రిస్టియన్ ఉబిచుక్వు 133.6 స్కోరుతో రజతం గెలుచుకోగా, స్కాట్లాండ్‌కు చెందిన మిక్కీ యూల్ 130.9 స్కోరుతో కాంస్యం గెలుచుకున్నాడు. క్రిస్టియన్ 197 కిలోలు ఎత్తగా, యూల్ 192 కిలోలు ఎత్తాడు.

    పవర్ లిఫ్టింగ్‌లో వెయిట్ లిఫ్టింగ్ శరీర బరువు మరియు సాంకేతికత ప్రకారం పాయింట్లను ఇస్తుంది. అదే బరువును ఎత్తడం కోసం, శారీరకంగా తక్కువ బరువు ఉన్న ఆటగాడు మరొకరి కంటే ఎక్కువ పాయింట్లను పొందుతాడు. 87 కేజీల సుధీర్ తన తొలి ప్రయత్నంలోనే 208 కేజీలు ఎత్తి 132 పాయింట్లకు పైగా సాధించి మొదటి స్థానంలో నిలిచాడు.



    అదే సమయంలో అతను నైజీరియన్ పవర్‌లిఫ్టర్ నుంచి కఠిన సవాల్‌ను ఎదుర్కొన్నాడు. దీంతో రెండవ ప్రయత్నంతో సుధీర్‌ రెండోస్థానానికి పడిపోయాడు. అయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోని భారత అథ్లెట్‌ రెండవ ప్రయత్నంలో 212 కిలోల బరువును ఎత్తి 134.5 పాయింట్లు సాధించి రికార్డు సృష్టించాడు.


    ఇదే సమయంలో నైజీరియాకు చెందిన ఇకెచుక్వు క్రిస్టియన్ ఉబిచుక్వు తన చివరి ప్రయత్నంలో 203 కిలోలు ఎత్తడంలో విఫలమయ్యాడు. ఇది సుధీర్ బంగారు పతకం అవకాశాలను మెరుగుపరచింది. ఇదే ఈవెంట్‌లో నైజీరియాకు చెందిన ఇకెచుక్వు, క్రిస్టియన్ ఉబిచుక్వు 133.6 స్కోరుతో రజతం గెలుచుకోగా, స్కాట్లాండ్‌కు చెందిన మిక్కీ యూల్ 130.9 స్కోరుతో కాంస్యం గెలుచుకున్నాడు.

    క్రిస్టియన్ 197 కిలోలు ఎత్తగా, యూల్ 192 కిలోలు ఎత్తాడు. హర్యానాలోని సోనిపట్ లో ఓ రైతు కుటుంబంలో సుధీర్ జన్మించారు. తీవ్ర జ్వరం కారణంగా నాలుగేళ్ల వయసులో పోలియో బారిన పడ్డాడు. కానీ అతనికి వైకల్యం అడ్డురాలేదు. క్రీడలపై జీవితాంతం ఆసక్తిని కనబర్చాడు.

    అంతకుముందు, మహిళల లైట్‌వెయిట్ ఫైనల్‌లో మన్‌ప్రీత్ కౌర్ మరియు సకీనా ఖాటూన్ వరుసగా నాలుగు మరియు ఐదవ స్థానాల్లో నిలిచి పతకాన్ని కోల్పోయారు. పురుషుల లైట్ వెయిట్ ఫైనల్‌లో, పరమజిత్ కుమార్ మూడు ప్రయత్నాలలో విఫలమై చివరి స్థానంలో నిలిచారు. మన్‌ప్రీత్ తన తొలి ప్రయత్నంలో 87 కిలోలు, రెండో ప్రయత్నంలో 88 కిలోలు ఎత్తినప్పటికీ మూడో ప్రయత్నంలో 90 కిలోలు ఎత్తడంలో విఫలమైంది. మన్‌ప్రీత్‌కు 89.6 మార్కులు వచ్చాయి.ఇక, గేమ్స్‌లో ఇప్పటివరకు భారత్ ఆరు స్వర్ణాలు, ఏడు రజతాలు, ఏడు కాంస్యాలతో మొత్తం 20పతకాలు సాధించింది. ప్రస్తుతం పతకాల పట్టికలో ఏడవ ర్యాంకులో భారత్ కొనసాగుతోంది.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Commonwealth Game 2022, Sports

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు