Home /News /sports /

CWG 2022 INDIAN HOCKEY TEAM SETTLED FOR SILVER AFTER LOST BY AUSTRALIA MENS HOCKEY TEAM IN FINALS SJN

IND vs AUS : మళ్లీ ఆస్ట్రేలియా చేతిలోనే.. మరోసారి చిత్తు చిత్తుగా ఓడిన భారత్.. ఈసారి ఏ గేమ్ లో అంటే?

PC : TWITTER

PC : TWITTER

IND vs AUS : కామన్వెల్త్ గేమ్స్ (Commonwealth Games) 2022లో మరోసారి ఫైనల్ లో భారత్ (India) చతికిల పడింది. మహిళల క్రికెట్ లో ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో టీమిండియా (Team India) 9 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా (Australia)లో ఓడిన సంగతి తెలిసిందే

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
IND vs AUS : కామన్వెల్త్ గేమ్స్ (Commonwealth Games) 2022లో మరోసారి ఫైనల్ లో భారత్ (India) చతికిల పడింది. మహిళల క్రికెట్ లో ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో టీమిండియా (Team India) 9 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా (Australia)లో ఓడిన సంగతి తెలిసిందే. తాజాగా పురుషుల హాకీలో కూడా ఆస్ట్రేలియా చేతిలోనే భారత్ ఖంగుతింది. సోమవారం జరిగిన ఫైనల్లో భారత్ 0-7 గోల్స్ తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఫలితంగా రన్నరప్ గా నిలిచిన భారత్ రజత పతకంతో సరిపెట్టుకుంది. ఈ మ్యాచ్ లో ఆరంభం నుంచే ఆసీస్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శంచింది. ఎక్కువ సేపు బంతిని తన ఆధినంలోనే ఉంచుకుంటూ గోల్ ల వర్షం కురిపించింది. భారత్ కనీసం ఒక్క గోల్ కూడా చేయలేకపోవడం విశేషం.

లక్ష్యసేన్ సూపర్

బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ లో సోమవారం జరిగిన ఫైనల్లో బరిలోకి దిగిన లక్ష్యసేన్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఫైనల్లో 19-21,  21-9, 21-16తో మలేషియా షట్లర్‌ ఎన్‌జీ జీ యోంగ్‌ పై పోరాడి విజయం సాధించాడు. తొలి గేమ్ లో పోరాడి ఓడిన లక్ష్యసేన్ అనంతరం జరిగిన రెండు గేముల్లోనూ విజయం సాధించి స్వర్ణాన్ని సొంతం చేసుకున్నాడు. వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌లో కాంస్యం సాధించిన 20 ఏళ్ల లక్ష్య సేన్‌కు కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో ఇదే మొదటి టైటిల్‌. ఈ విజయంతో కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో పతకం గెలిచిన బ్యాడ్మింటన్‌ స్టార్లు ప్రకాశ్‌ పదుకొణె(1978), సయ్యద్‌ మోదీ(1982), పారుపల్లి కశ్యప్‌(2014) తదితరుల సరసన నిలిచాడు.

డబుల్స్ లో సాత్విక్-చిరాగ్ జోరు

పురుషుల డబుల్స్ లోనూ భారత్ కు బంగారు పతకం లభించింది. సోమవారం జరిగిన తుది పోరులో  సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జంట 21-15, 21-13తో బెన్ లేన్-సీన్ వెండీ (ఇంగ్లండ్) జోడీపై ఘనవిజయం సాధించింది. తద్వారా సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జంట  కామన్వెల్త్ గేమ్స్ లో పురుషుల డబుల్స్ విభాగంలో భారత్ కు తొలి బంగారు పతకం నెగ్గిన వారిగా నిలిచారు.



టీటీలో శరత్ కమాల్

టేబుల్ టెన్నిస్ (టీటీ) పురుషుల సింగిల్స్ విభాగంలో భారత వెటరన్ ప్లేయర్ ఆచంట శరత్ కమల్ అదరగొట్టాడు. సోమవారం జరిగిన ఫైనల్లో అతడు 3-1తో ఇంగ్లండ్ కు చెందిన లియామ్ పిచ్ ఫోర్డ్ పై ఘనవిజయం సాధించాడు. తద్వారా16 ఏళ్ల తర్వాత టీటీ పురుషుల సింగిల్స్ లో మరోసారి శరత్ కమల్ గోల్డ్ మెడల్ ను అందుకున్నాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Commonwealth Game 2022, India vs australia, Pv sindhu, Smriti Mandhana, Team India

తదుపరి వార్తలు