Home /News /sports /

CWG 2022 INDIA SECURE 4TH PLACE IN MEDAL TABLE OF BIRMINGHAM COMMONWEALTHGAMES 2022 SJN

CWG 2022 : ముగిసిన కామన్వెల్త్ గేమ్స్.. పతకాల పట్టికలో నాలుగో స్థానంలో భారత్.. మరి పాకిస్తాన్ ఎన్నో స్థానంలో నిలిచిందంటే?

Photo Credit : Twitter

Photo Credit : Twitter

Commonwealth Games 2022 Closing Ceremony : 11 రోజుల పాటు అలరించిన బర్మింగ్ హామ్ కామన్వెల్త్ గేమ్స్ (Birmingham Commonwealth Games) 2022కి శుభం కార్డ్ పడింది. 20 క్రీడాంశాల్లో పతకాల కోసం 72 దేశాలకు చెందిన అథ్లెట్లు పోటీ పడ్డారు. భారత్ (India) నుంచి 210 మంది అథ్లెట్లు ఈ మెగా ఈవెంట్ లో పోటీ పడ్డారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
Commonwealth Games 2022 Closing Ceremony : 11 రోజుల పాటు అలరించిన బర్మింగ్ హామ్ కామన్వెల్త్ గేమ్స్ (Birmingham Commonwealth Games) 2022కి శుభం కార్డ్ పడింది. 20 క్రీడాంశాల్లో పతకాల కోసం 72 దేశాలకు చెందిన అథ్లెట్లు పోటీ పడ్డారు. భారత్ (India) నుంచి 210 మంది అథ్లెట్లు ఈ మెగా ఈవెంట్ లో పోటీ పడ్డారు. ఇందులో 106 మంది పురుషుల, 104 మంది మహిళలు భారత్ తరఫున పోటీలో నిలిచారు. పోటీల చివరి రోజు భారత్ 4 స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్య పతకాలను నెగ్గడం విశేషం. తద్వారా 61 పతకాలు సాధించిన భారత్ పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఆఖరి రోజు పీవీ సింధు, లక్షసేన్, అచంట శరత్ కమల్ తో పాటు సాత్విక్ సాయి రాజ్, చిరాగ్ శెట్టి జంట స్వర్ణ పతకాలను నెగ్గింది. పురుషుల హాకీలో మాత్రం భారత్ రజత పతకంతో సరిపెట్టుకుంది.

ఈసారి జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో షూటింగ్, ఆర్చరీ పోటీలను తప్పించిన సంగతి తెలిసిందే. దాంతో ఇది భారత్ పతకాల సంఖ్యపై ప్రభావం చూపుతుందని అందరూ అనుకున్నారు. కానీ, భారత అథ్లెట్లు అద్భుతాన్ని చేసి చూపించారు. గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ 66 పతకాలతో మూడో స్థానంలో నిలిచింది. ఆ సమయంలో భారత్ షూటింగ్ నుంచే ఏకంగా 26 పతకాలను సొంతం చేసుకుంది. అయితే ఈసారి షూటింగ్ లేకపోయినా భారత్ 61 పతకాలు సాధించడం విశేషం. ఇందులో 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్య పతకాలను భారత్ సొంతం చేసుకుంది. పతకాల జాబితాలో ఆస్ట్రేలియా 178 పతకాలను సొంతం చేసుకుని తొలి స్థానంలో నిలిచింది. ఇంగ్లండ్ 176 పతకాలతో 2వ స్థానంలో, 92 పతకాలతో కెనడా మూడో స్థానంలో నిలిచాయి. ఈ జాబితాలో పాకిస్తాన్ 18వ స్థానంలో నిలిచింది. రెండు స్వర్ణాలు మూడు రజతాలు మరో మూడు కాంస్యాలు మొత్తం 8 పతకాలను సొంతం చేసుకున్న పాకిస్తాన్ 18వ స్థానంలో నిలవడం గమనార్హం.

పతకాల పట్టికలో టాప్ 10లో నిలిచిన దేశాలు



























































































ర్యాంక్దేశంస్వర్ణంరజతంకాంస్యంమొత్తం
1ఆస్ట్రేలియా675754178
2ఇంగ్లండ్576653176
3కెనడా26323492
4భారత్22162361
5న్యూజిలాండ్20121749
6స్కాట్లాండ్13112751
7నైజీరియా1291435
8వేల్స్861428
9సౌతాఫ్రికా791127
10మలేసియా78823

ఈ కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ అంచనాలకు మించి రాణించిందన్నది వాస్తవం. అథ్లెటిక్స్ లో మన అథ్లెట్లు ఈసారి అదరగొట్టారు. ట్రిపుల్ జంప్ లో స్వర్ణ, రజత పతకాలను సాధించారు. ఇక హై జంప్ లో కూడా రజత పతకాన్ని అందుకున్నారు. ఇదే దూకుడును కనబరిస్తే 2024 పారిస్ ఒలింపిక్స్ లో భారత్ పతకాల పంట పండించడం ఖాయం
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Commonwealth Game 2022, Neeraj chopra, Pv sindhu, Smriti Mandhana, Team India

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు