Home /News /sports /

CWG 2022 IND W VS BAR W SUPER VICTROY FOR TEAM INDIA WON BY 100 RUNS AND ADVANCE INTO SEMIS SRD

CWG 2022- IND W : కీలక మ్యాచులో అమ్మాయిలు అదుర్స్.. 100 పరుగుల భారీ విజయంతో సెమీస్ కు టీమిండియా..

Team India (BCCI Twitter)

Team India (BCCI Twitter)

CWG 2022- IND W : మొదట బ్యాటింగ్ లో ఫైటింగ్ టోటల్ సెట్ చేసిన భారత అమ్మాయిలు.. ఆ తర్వాత బౌలింగ్ లో అదరగొట్టారు. దీంతో.. భారత్ 100 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.

    కామన్వెల్త్‌ క్రీడల్లో (Commonwealth Games 2022) భారత అమ్మాయిలు (Indian Women's Team) దుమ్మురేపుతున్నారు. పతకం దిశగా అడుగులేస్తున్నారు. మహిళా క్రికెట్ కీలక మ్యాచులో ఆల్ రౌండ్ షోతో బార్బడోస్ ను చిత్తుగా ఓడించి గ్రూప్-A నుంచి సెమీస్ కు దూసుకెళ్లింది. మొదట బ్యాటింగ్ లో ఫైటింగ్ టోటల్ సెట్ చేసిన అమ్మాయిలు.. ఆ తర్వాత బౌలింగ్ లో అదరగొట్టారు. దీంతో.. భారత్ 100 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. 163 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన బార్బడోస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 62 పరుగులు మాత్రమే చేసింది. బార్బడోస్ జట్టులో కైషోనా నైట్ చేసిన 16 పరుగులే అత్యధికం. తొమ్మిది బ్యాటర్ల రెండంకెల స్కోరు కూడా చేయలేదంటే.. మన బౌలర్లు ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారో అర్ధం చేసుకోవచ్చు. టీమిండియా బౌలర్లలో రేణుకా సింగ్‌(Renuka Singh) 4 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేయగా, మేఘ్నా సింగ్‌, స్నేహ రాణా, రాధా యాదవ్, హర్మన్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

    163 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన బార్బడోస్‌ బ్యాటర్లు ఆది నుంచే చతికిలపడ్డారు. భారత బౌలర్లు వరుసగా వికెట్లు తీస్తూ ఆ జట్టును కోలుకోలేని దెబ్బతీశారు. డాటిన్ వంటి డేంజరస్ బ్యాటర్ డకౌట్ అవ్వగా.. బార్బడోస్ కెప్టెన్ హెలీ మాథ్యూస్ కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే చేసింది. రేణుకా సింగ్ నాలుగు ఓవర్లలో కేవలం పది పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీసి.. బార్బడోస్ జట్టును కోలుకోలేని దెబ్బ తీసింది.



    అంతకుముందు.. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టుకు ఆరంభంలో షాక్‌ తగిలింది. సూపర్ ఫామ్ లో ఉన్న స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన తక్కువ స్కోరుకే పెవిలియన్ బాట పట్టింది. షకెరా సెల్మాన్ వేసిన రెండో ఓవర్లో ఓపెనర్‌ స్మృతీ మంధాన (5) ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌ చేరింది. ఆ తర్వాత జెమీమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ ఇద్దరూ కలిసి టీమిండియా ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. షెఫాలీ దూకుడుగా ఆడగా.. రోడ్రిగ్స్ ఆచి తూచి ఆడుతూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదింది.


    వీరిద్దరూ కలిసి రెండో వికెట్ కి 71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే.. హాఫ్ సెంచరీ దిశగా సాగుతున్న షెఫాలీ వర్మ(43) అనవసరపు రన్ కు ప్రయత్నించి 9 ఓవర్లో రనౌట్ అయింది. ఆ వెంటనే వచ్చిన కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ డకౌట్‌ అయింది.

    ఆ తర్వాత తానియా (6) కూడా నిరాశపరచగా, రోడ్రిగ్స్‌తో కలిసి దీప్తి శర్మ (31* నాటౌట్‌) స్కోర్‌ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. దీంతో భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. జెమీమా (46 బంతుల్లో 56 పరుగులు నాటౌట్) గా నిలిచి టీమిండియాకు మంచి స్కోరు అందించింది. ఇక, ఇంగ్లండ్, న్యూజిలాండ్ ల మధ్య జరిగే గ్రూప్ మ్యాచ్ విజేతతో టీమిండియా సెమీస్ లో తలపడనుంది.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Commonwealth Game 2022, Smriti Mandhana, Team India, Women's Cricket

    తదుపరి వార్తలు