Home /News /sports /

CWG 2022 IND VS AUS FINAL IND W VS AUS W MATCH PREVIEW HEAD TO HEAD PREDICTED PLAYING XI PITCH REPORT WEATHER CONDITIONS SJN

CWG 2022 IND vs AUS Final: నక్కి నక్కి గాదే తొక్కుకుంటూ పోవాలే.. ఆసీస్ తో బిగ్ ఫైట్ కు భారత్ రెడీ.. తుది జట్టు ఇదే

PC : TWITTER

PC : TWITTER

CWG 2022 IND vs AUS Final: కామన్వెల్త్ గేమ్స్ (CommonWealth Games) 2022లో మహిళల క్రికెట్ తొలిసారిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ లో 8 జట్లు బరిలోకి దిగగా.. భారత్ (India), ఆస్ట్రేలియా (Australia) మహిళల జట్లే ఫైనల్ కు చేరాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
CWG 2022 IND vs AUS Final: కామన్వెల్త్ గేమ్స్ (CommonWealth Games) 2022లో మహిళల క్రికెట్ తొలిసారిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ లో 8 జట్లు బరిలోకి దిగగా.. భారత్ (India), ఆస్ట్రేలియా (Australia) మహిళల జట్లే ఫైనల్ కు చేరాయి. పసిడి పతకం కోసం ఆదివారం రాత్రి జరిగే పోరులో ఈ రెండు జట్లు చావో రేవో తేల్చుకోవడానికి సిద్ధమయ్యాయి. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ఆదివారం రాత్రి గం. 9.30లకు ఆరంభం కానుంది. లీగ్ దశలో ఈ రెండు జట్లు తలపడగా అందులో ఆస్ట్రేలియా విజయం సాధించింది. అయితే ఈ పరాజయంతో పాటు 2020 టి20 ప్రపంచకప్ సందర్భంగా ఆసీస్ చేతిలో ఎదురైన ఫైనల్ ఓటమికి కూడా భారత్ బదులు తీర్చుకునేందుకు సిద్ధంగా ఉంది.

భారత్ కు గాయాల బెడద

పసిడి పతకంపై కన్నేసిన టీమిండియాను కీలక ప్లేయర్ల గాయాలు కలవరపెడుతున్నాయి. సూపర్ ఫామ్ లో ఉన్న స్మృతి మంధానతో పాటు జెమీమా రోడ్రిగ్స్ గాయాలాతో ఇబ్బంది పడుతున్నారు. శనివారం ఇంగ్లండ్ తో జరిగిన సెమీఫైనల్ పోరులో బ్యాటింగ్ చేస్తూ జెమీమా తన కుడి చేతి మణికట్టుకు గాయం చేసుకుంది. దాంతో ఆమె ఫీల్డింగ్ కు రాలేదు. ఇక ఫీల్డింగ్ చేసే సమయంలో స్మృతి మంధాన కుంటుతూ కనిపించింది. అయితే ఆమె 20 ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేసింది. వీరిద్దరి ఫిట్ నెస్ పై సందేహాలు తలెత్తుతున్నాయి. వీరి గాయాలు తీవ్రం కాకుండా ఉంటే మంచిదని భారత అభిమానులు పార్థిస్తున్నారు. ఇక ఈ టోర్నీలో రాణిస్తూ వస్తోన్న రేణుక సింగ్ ఠాకూర్ సెమీస్ పోరులో మాత్రం ధారాళంగా పరుగులు సమర్పించుకుంది. అయితే ఆసీస్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లోరేణుక నాలుగు వికెట్లు తీయడం విశేషం. దాంతో ఆమె మరోసారి కీలకం కానుంది. హర్మన్ ప్రీత్ కౌర్, షఫాలీ వర్మ కూడా పరుగులు చేస్తే భారత్ కు తిరుగుండదు. ఇక బౌలింగ్ లో భారత్ మరోసారి స్పిన్ నే నమ్ముకునే అవకాశం ఉంది. స్నేహ్ రాణా, దీప్తి శర్మ, రాాధా యాదవ్, షఫాలీ వర్మలు చక్కగా బౌలింగ్ చేస్తున్నారు. ఇక పేస్ విభాగాన్ని రేణుక, పూజా వస్త్రాకర్ చూసుకుంటారు.



తక్కువ అంచనా వేయకూడదు

భారత్ తో జరిగిన గ్రూప్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ను చూసిన వారు ఆ జట్టు గెలుస్తుందని ఊహించి ఉండరు. కానీ, గార్డ్ నర్ పోరాటపటిమ చూపడంతో ఆసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగింది. దాంతో ఆసీస్ ను తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ఈ మ్యాచ్ లో ఇండియా గెలిస్తే..  చరిత్ర లిఖించే అవకాశం ఉంది.

టీమిండియా తుది జట్టు (అంచనా)

హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, యస్తిక భాటియా, పూజా వస్త్రాకర్, స్నేహ్ రాణా, రాధా యాదవ్, మేఘ్నా సింగ్, రేణుక సింగ్ ఠాకూర్
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Commonwealth Game 2022, India vs australia, India Vs Westindies, Pv sindhu, Smriti Mandhana, Team India

తదుపరి వార్తలు