Home /News /sports /

CWG 2022 IND VS AUS FINAL AUSTRALIA WOMEN PUT 161 RUNS AS TARGET FOR TEAM INDIA IN GOLD MEDAL MATCH SJN

IND W vs AUS W Final : గోల్డ్ మెడల్ మ్యాచ్ లో మెరిసిన భారత ఫీల్డర్లు.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?

Team India (BCCI Twitter)

Team India (BCCI Twitter)

IND W vs AUS W Final : కామన్వెల్త్ గేమ్స్ (CommonWealth Games)లో భాగంగా ఆస్ట్రేలియా (Australia) మహిళల జట్టుతో జరుగుతోన్న ఫైనల్ పోరులో టీమిండియా (Team india) ఫీల్డర్లు మెరిశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 161 పరుగులు చేసింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
IND W vs AUS W Final : కామన్వెల్త్ గేమ్స్ (CommonWealth Games)లో భాగంగా ఆస్ట్రేలియా (Australia) మహిళల జట్టుతో జరుగుతోన్న ఫైనల్ పోరులో టీమిండియా (Team india) ఫీల్డర్లు మెరిశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 161 పరుగులు చేసింది. ఆసీస్ ఓపెనర్ బెత్ మూనీ (41 బంతుల్లో 61; 8 ఫోర్లు) అర్థ శతకంతో జట్టును అదుకుంది. ఆమెతో పాటు కెప్టెన్ మెగ్ ల్యానింగ్ (26 బంతుల్లో 36; 5 ఫోర్లు, 1 సిక్స్) కూడా రాణించింది. దాంతో భారత్ ముందు ఫైటింగ్ టోటల్ ను ఉంచగలిగింది. భారత బౌలర్లలో రేణుకా సింగ్, స్నేహ్ రాణాలు చెరో రెండు వికెట్లు తీశారు. దీప్తి శర్మ, రాధా యాదవ్ లు చెరో వికెట్ సాధించారు.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియాను రేణుక సింగ్ ఠాకూర్ దెబ్బ తీసింది. ఈ టోర్నీలో ఫామ్ లో లేని అలీసా హీలీ (7)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుంది. అయితే క్రీజులోకి వచ్చిన మెగ్ ల్యానింగ్... బెత్ మూనీతో కలిసి ఆసీస్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపింది. ముఖ్యంగా ల్యానింగ్ భారీ షాట్లతో విరుచుకుపడింది. వీరిద్దరూ వేగంగా రెండో వికెట్ కు 74 పరుగులు జోడించారు. అయితే రాధా యాదవ్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో మెగ్ ల్యానింగ్ రనౌట్ అయ్యింది. మరికాసేపటికే తాహిలా మెక్ గ్రాత్ (2)ను రాధా యాదవ్ కళ్లు చెదిరే క్యాచ్ తో పెవిలియన్ కు పంపింది.



అయితే మరో ఎండ్ లో ఉన్న బెత్ మూనీ మాత్రం తనదైన శైలిలో రెచ్చిపోయింది. దూకుడుగా ఆడుతూ అర్ధ సెంచరీ పూర్తి చేసింది. మరో ఎండ్ లో యాష్ గార్డ్ నర్ (25) ఉన్నంతసేపు మెరుపులు మెరిపించింది. అయితే గార్డ్ నర్ స్టంపౌట్ కాగా.. దీప్తి శర్మ ఒంటి చేత్తో పట్టిన క్యాచ్ కు బెత్ మూనీ పెవిలియన్ కు చేరారు. చివర్లో రేచల్ హైన్స్ (18) అడపాదడపా బౌండరీలు బాదడంతో ఆస్ట్రేలియా 160 పరుగుల మార్కును దాటగలిగింది.



తుది జట్లు

టీమిండియా

హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, యస్తిక భాటియా, పూజా వస్త్రాకర్, స్నేహ్ రాణా, రాధా యాదవ్, మేఘ్నా సింగ్, రేణుక సింగ్ ఠాకూర్

ఆస్ట్రేలియా

అలీసా హీలీ, బెత్ మూనీ, మెగ్ ల్యానింగ్ (కెప్టెన్), తాహిలా మెక్ గ్రాత్, రాచెల్ హైన్స్, యాష్లే గార్డ్ నర్, గ్రేస్ హ్యారీస్, జెస్ జొనాసెన్, అలానా కింగ్, మేగాన్ ష్కట్, డార్సీ బ్రౌన్
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Commonwealth Game 2022, India vs australia, India Vs Westindies, Pv sindhu, Smriti Mandhana, Team India

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు