Home /News /sports /

CWG 2022 10 MEMBERS OF SRI LANKAS CONTINGENT MISSING FROM COMMONWEALTH GAMES 2022 SJN

CWG 2022 : కామన్వెల్త్ గేమ్స్ లో అథ్లెట్ల మిస్సింగ్ కలకలం.. తప్పిపోయిన 10 మంది శ్రీలంక అథ్లెట్స్.. కారణం ఇదేనా?

PC : TWITTER

PC : TWITTER

CWG 2022 : కామన్వెల్త్ గేమ్స్ (Commonwealth Games)లో మిస్సింగ్ కలకలం చోటు చేసుకుంది. ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్  బరిలోకి దిగిన శ్రీలంక‌ (Sri lanka)అథ్లెట్లు కనిపించకుండా పోవడం పెద్ద చర్చకు దారితీసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
CWG 2022 : కామన్వెల్త్ గేమ్స్ (Commonwealth Games)లో మిస్సింగ్ కలకలం చోటు చేసుకుంది. ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్  బరిలోకి దిగిన శ్రీలంక‌ (Sri lanka)అథ్లెట్లు కనిపించకుండా పోవడం పెద్ద చర్చకు దారితీసింది. మెగా ఈవెంట్ లో ఆడడానికి వచ్చిన శ్రీలంక ప్లేయర్లలో 10 మంది తమ ఈవెంట్స్ ముగిసిన తర్వాత కనిపించకుండా అదృశ్యమయ్యారని శ్రీలంక అధికారులు ప్రకటించారు. ఇందులో తొమ్మిది మంది అథ్లెట్లు ఉండగా.. ఒకరు మేనేజర్‌ అని తెలిపారు. వీరి గురించి బర్మింగ్ హామ్ (Birmingham) పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కూడా శ్రీలంక అధికారులు తెలిపారు. మొత్తం 160 మంది శ్రీలంక అథ్లెట్లు కామన్వెల్త్ గేమ్స్ లో పాల్గొనేందుకు బర్మింగ్ హామ్ కు వెళ్లారు.

ఇది కూడా చదవండి : ధోనిలా రనౌట్.. జాంటీ రోడ్స్ లా క్యాచెస్.. ఫైనల్లో భారత ఫీల్డింగ్ మెరుపులు చూస్తే మీరు వావ్ అనాల్సిందే (వీడియో)

తొలుత జూడో ప్లేయర్ చమిలా దిలాని, ఆమె మేనేజర్ అసెలా డిసిల్వా, రెజ్లర్ షానిత్ చతురంగ వారం రోజుల క్రితం కనిపించకుండా పోయారు. వీరు తమ మ్యాచ్ లు ముగిసిన అనంతరం కామన్వెల్త్ గేమ్స్ విలేజిని వదిలేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత మరో ఏడుగురు కనిపించకుండా పోయారు. ప్రస్తుతం శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఉండటంతో వీరు తిరిగి తమ దేశానికి వెళ్లేందుకు ఇష్టపడటం లేదని.. అందుకే ఇంగ్లండ్ లోనే ఉపాధిని వెతుక్కునే పనిలో ఉన్నట్లు సమాచారం. పోలీసులు కనిపించకుండా పోయిన 10 మంది అథ్లెట్లలో ముగ్గురిని పట్టుకున్నట్లు. .అయితే వారి వద్ద ఏడు నెలల వీసా ఉండటంతో వారిని వదిలేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ ముగ్గురు అథ్లెట్లు కూడా తాము ఎక్కడున్న విషయాన్ని శ్రీలంక అధికారులు చెప్పకూడదని బ్రిటన్ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. దీనిని బట్టి వీరంతా బ్రిటన్‌లోనే ఉండేందుకు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్థం అవుతుంది.



ఇదిలా ఉంటే శ్రీలంక ఇప్పటి వరకు మొత్తం 4 పతకాలను మాత్రమే సాధించింది. ఇందులో ఒక రజతం ఉండగా.. మరో మూడు కాంస్య పతకాలు ఉన్నాయి. ప్రస్తుతం శ్రీలంక పతకాల పట్టికలో 31వ స్థానంలో కొనసాగుతుంది. సోమవారంతో బర్మింగ్ హామ్ కామన్వెల్త్ గేమ్స్ కు తెరపడునుంది. చివరి రోజు భారత అథ్లెట్లు పలు ఈవెంట్లలో పసిడి పతకాల కోసం పోటీ పడుతున్నారు. బ్యాడ్మింటన్ లో సింధు (మహిళల సింగిల్స్), లక్ష్య సేన్ (పురుషుల సింగిల్స్), చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్ (పురుషుల డబుల్స్), పురుషుల హాకీ లో ఆస్ట్రేలియాతో భారత్ గోల్డ్ మెడల్ మ్యాచ్ లో తలపడనుంది. ఈ క్రమంలో భారత్ మరిన్ని పతకాలు సాధించే అవకాశం ఉంది. గత కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ 66 పతకాలను సాధించింది. ఈసారి ఇప్పటి వరకు 55 పతకాలను సాధించి పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. షూటింగ్, ఆర్చరీ లేకపోయినా భారత్ ఇన్ని పతకాలు సాధించడం గొప్ప విషయం.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Commonwealth Game 2022, India vs australia, India Vs Westindies, Missing cases, Missing person, Pv sindhu, Sri Lanka

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు