RCB vs CSK: ధోనీ సేన దంచి కొట్టారు.. ఆర్సీబీపై చెన్నై విజయం.. కోహ్లీ సేనకు కొనసాగుతున్న ఓటములు

విజయాలతో దూసుకొని పోతున్న చెన్నై.. ఆర్సీబీపై గెలుపుతో అగ్రస్థానం (PC: IPL)

  • Share this:
    రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru)) జట్టు రెండో దశ ఐపీఎల్‌లో దురదృష్టాన్ని వెంటేసుకొని తిరుగుతున్నట్లు ఉన్నారు. కోహ్లీ (Virat Kohli) సేన యూఏఈలో రెండో మ్యాచ్ కూడా ఓడిపోయింది. బ్యాటింగ్ చేసే సమయంలో తొలి వికెట్‌కు సెంచరీకి పైగా భాగస్వామ్యం నెలకొల్పినా.. చివరకు 156 పరుగులకే పరిమితం అయ్యారు. ఇక బౌలింగ్‌లో అయినా రాణిస్తారనుకుంటే అందరూ చేతులెత్తేశారు. ఆర్సీబీ ఇచ్చిన 157 పరుగల టార్గెట్‌ను కేవలం 4 వికెట్లు కోల్పోయి 18.1 ఓవర్లలో ఛేజ్ చేసింది. సీఎస్కే (Chennai Super Kings) ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (38), ఫాఫ్ డుప్లెసిస్ (31) కలిసి శుభారంభాన్ని అందించారు. ఆర్సీబీ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని వేగంగా పరుగులు రాబట్టారు. ఏ సమయంలోనూ తడబాటు లేకుండా పర్‌ఫెక్ట్ షాట్లు కొడుతూ బౌండరీలు, సిక్సులు రాబట్టారు. వీరిద్దరూ కలసి తొలి వికెట్‌కు 71 పరుగులు జోడించిన తర్వాత అదే పరుగుల వద్ద ఓపెనర్లు ఇద్దరూ ఔటయ్యారు. ఆ తర్వాత వచ్చిన మొయిన్ అలీ (23), అంబటి రాయుడు (32) కలసి మొమెంటమ్ కొనసాగించారు.

    సీఎస్కే బ్యాట్స్‌మెన్ క్రమం తప్పకుండా బౌండరీలు సాధిస్తూ ఒత్తిడి లేకుండా చూసుకున్నారు. మొయిన్ అలీ, రాయుడు ఔటైన తర్వాత సురేశ్ రైనా (17), ఎంఎస్ ధోనీ (11) మ్యాచ్‌ను ముగించేశారు. హర్షల్ పటేల్ 2 వికెట్లు, చాహల్, మ్యాక్స్‌వెల్ చెరో వికెట్ తీశారు. ఈ విజయంతో సీఎస్కే జట్టు 14 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకున్నది.









    అద్బుతంగా బౌలింగ్ చేసి ఆర్సీబీని కట్టడి చేసిన డ్వేన్ బ్రావోకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక వరుస ఓటములతో ఆర్సీబీ ప్లేఆఫ్ అవకాశాలను క్లిష్టతరం చేసుకుంటున్నది. పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానంలోనే కొనసాగుతున్నా.. మిగిలిన మ్యాచ్‌లలో తప్పకుండా విజయం సాధించాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటికే కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ దూసుకొని వస్తున్న సమయంలో వరుస ఓటములు ఆర్సీబీని ఇబ్బందుల్లో పడేస్తున్నాయి.
    Published by:John Naveen Kora
    First published: