ఐపీఎల్ 2021 (IPL 2021) సెకెండ్ ఫేజ్ తొలి మ్యాచే టీ20 క్రికెట్లోని అసలు మజాను చూపించింది. ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌ను చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) జట్టు తమ ఆల్‌రౌండ్ ప్రతిభతో గెలుచుకున్నది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టు 20 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌పై (Mumbai Indians) గెలిచింది. చెన్నై నిర్దేశించిన 157 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ముంబై జట్టు ఓటమి కొని తెచ్చుకున్నది. ముంబై బ్యాట్స్మాన్ సౌరభ్ తివారీ (50) చివరి వరకు పోరాడినా.. విజయం మాత్రం లభించలేదు. ముంబై జట్టు ఓపెనర్లు క్వింటన్ డికాక్ (17), అనుమోల్ ప్రీత్ సింగ్ (16) ధాటిగానే బ్యాటింగ్ ప్రారంభించారు. అయితే దీపక్ చాహర్ ఓపెనర్లను పెవీలియన్ పంపించడంతో పాటు.. మిగిలిన బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీశారు.
58 పరుగులకే కీలకమైన 4 వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్‌కు వచ్చిన సౌరభ్ తివారీ, కిరాన్ పొలార్డ్ కలసి ఇన్నింగ్స్ నిర్మించారు. అయితే పొలార్డ్, కృనాల్ పాండ్యా స్వల్ప వ్యవధిలో పెవీలియన్ చేరారు. ఆ తర్వాత వచ్చిన మిల్నేతో కలసి తివారీ ధాటిగా ఆడాడు. ఈ క్రమంలో సౌరభ్ తివారీ 40 బంతుల్లో అర్ద సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే మిల్నే అవుటైన తర్వాత తివారీకి బ్యాటింగ్ ఛాన్స్ రాకపోవడం.. మరో ఎండ్‌లో చాహర్ తొలి బంతికే డకౌట్ అవడంతో ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 138 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్రావో 3 వికెట్లు, దీపక్ చాహర్ 2 వికెట్లు తీయగా.. హాజెల్‌వుడ్, శార్దుల్ ఠాకూర్ చెరో వికెట్ తీశాడు.
Match 30. It's all over! Chennai Super Kings won by 20 runs https://t.co/HczPtOgErc #CSKvMI #VIVOIPL #IPL2021
— IndianPremierLeague (@IPL) September 19, 2021
FIFTY
A well-made half-century for Saurabh Tiwary off 40 balls. His 8th in #VIVOIPL
Follow the game - https://t.co/754wPUkCIF #CSKvMI pic.twitter.com/QiQbNAb5qI
— IndianPremierLeague (@IPL) September 19, 2021
చెన్నై జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఒంటరి పోరాటం చేసిన రుతురాజ్ గైక్వాడ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chennai Super Kings, IPL 2021, MS Dhoni, Mumbai Indians