CSK vs RCB: జడ్డూ దెబ్బకు ఆర్సీబీ అబ్బా ... జడేజా ప్రతి జట్టులో నీలాంటి వాడు ఉండాలయ్యా!

jadeja (2)

ముంబై వేదికగా ఆర్‌సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే అల్‌రౌండర్ ప్రతిభతో అద్భుత విజయాన్ని సాధించింది.

  • Share this:


    ముంబై వేదికగా ఆర్‌సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే అల్‌రౌండర్ ప్రతిభతో అద్భుత విజయాన్ని సాధించింది. 69 పరుగుల తేడాతో బెంగళూర్‌పై ఘన విజయాన్ని సాధించింది. ఆర్సీబీ  ముఖ్యంగా ఈ మ్యాచ్ రవింద్ర జడేజా వర్సెస్ ఆర్సీబీ అన్నంటుగా సాగింది. 192 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బొక్క బోర్లా పడింది. ఓపెనర్స్ పడిక్కల్‌ పర్వాలేదనిపించిన కోహ్లి(8) విఫలమయ్యాడు.  చెన్నైకి మెుదటి వికెట్ కోహ్లి(8) రూపంలో లభించింది. సామ్‌ కరన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 4వ ఓవర్‌ తొలి బంతిని కోహ్లి ఆడే ప్రయత్నంలో కీపర్‌ ధోనికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

    తర్వాత 34 పరుగులతో మంచి టచ్‌లో కనిపించిన పడిక్కల్‌ శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో రైనాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఆర్‌సీబీ 6 ఓవర్లలో 2వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. ఆ తర్వాత బెంగళూర్ వరసగా వికెట్లు కోల్పోయింది. బ్యాటింగ్‌లో రాణించిన జడేజా బౌలర్‌గా,ఫీల్డర్‌గా కూడా అదరగొట్టాడు. జిడ్డూ బాల్‌తో కూడా మయా చేశాడు. వాషింగ్టన్‌ సుందర్‌(7)ను క్యా్చ్ ఔట్ రూపంలో అవుట్ చేయగా మ్యాక్స్‌వెల్‌(22),ఏబీ డివిలియర్స్‌(4) బౌల్డ్ చేశాడు. డానియల్‌ క్రిస్టయన్‌(1)ను సూపర్ త్రోతో రనౌట్‌ చేశాడు. దీంతో ఆర్సీబీ స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ మెుత్తం పెవిలియన్‌కు క్యూ కట్టింది.
    Published by:Rekulapally Saichand
    First published: