Home /News /sports /

CSK VS KKR LIVE IPL UPDATES CHENNAI SUPER KINGS BATTER MS DHONI MADE HALF CENTURY AGAINST KKR IN IPL 2022 SEASON SJN

CSK vs KKR: ఆఖర్లో కేకేఆర్ బౌలర్లను రఫ్పాడించిన ధోని... పోరాడే టార్గెట్ ను ప్రత్యర్థి ముందు ఉంచిన చెన్నై

ధోని (PC: IPL TWITTER)

ధోని (PC: IPL TWITTER)

CSK vs KKR : చెన్నై ఇన్నింగ్స్ కు ధోని ఇన్నింగ్స్ హైలైట్ గా నిలిచింది. 61/5తో కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన ధోని 17 ఓవర్ల వరకు కూడా ఇబ్బంది పడుతూనే బ్యాటింగ్ చేశాడు. అయితే 18వ ఓవర్ నుంచి తనలోని పాత ధోనిని కేకేఆర్ కు పరిచయం చేశాడు.

ఇంకా చదవండి ...
CSK vs KKR: కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) తో జరుగుతోన్న మ్యాచ్ లో నాలుగు సార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (Chennai super kings) తడబడింది.  డిఫెండింగ్ చాంపియన్ హోదాతో టోర్నీలో అడుగు పెట్టిన చెన్నై... తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమవుతోంది. ఐపీఎల్ ఆరంభానికి కొన్ని రోజుల ముందు చెన్నై కెప్టెన్సీ నుంచి మహేంద్ర సింగ్ ధోని (MS DHONI) తప్పుకోవడంతో... కొత్త కెప్టెన్ గా రవీంద్ర జడేజా (Ravindra Jadeja) అతని స్థానంలో సారథ్య బాధ్యతలను తీసుకున్నాడు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న తమ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నిర్ణయం కరెక్టే అని కేకేఆర్ బౌలర్లు నిరూపించారు. అయితే చివర్లో ధోని ధనాధన్ షాట్లతో విరుచుకుపడటంతో చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం 20 ఓవర్లలో 5 వికెట్లకు 131 పరుగులు చేసింది.

శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్ లో తన బ్యాటింగ్ తో చెలరేగిన రవీంద్ర జడేజా ఈ మ్యాచ్ లో మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. కెప్టెన్సీ అతడి బ్యాటింగ్ పై ప్రభావం చూపిందో ఏమో కానీ... కేకేఆర్ బౌలర్లను ఎదుర్కోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. అతడు 28 బంతుల్లో 26 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. జడేజా ఇన్నింగ్స్ లో కేవలం ఒకే ఒక సిక్సర్ ఉండటం గమనార్హం అది కూడా ఇన్నింగ్స్ ఆఖరి బంతిని అతడు సిక్సర్ గా మలిచాడు.

ధోని ఇన్నింగ్స్ హైలైట్

చెన్నై ఇన్నింగ్స్ కు ధోని ఇన్నింగ్స్ హైలైట్ గా నిలిచింది. 61/5తో కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన ధోని 17 ఓవర్ల వరకు కూడా ఇబ్బంది పడుతూనే బ్యాటింగ్ చేశాడు. అయితే 18వ ఓవర్ నుంచి తనలోని పాత ధోనిని కేకేఆర్ కు పరిచయం చేశాడు. 38 బంతుల్లో 7 ఫోర్లు 1 సిక్సర్ తో 50 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ధోని కారణంగా చెన్నై 130 పరుగుల మార్కును అందుకుంది. ధోని 2019 తర్వాత మళ్లీ అర్ధ సెంచరీ చేయడం ఇదే తొలిసారి. ధోని ధనాధన్ ఆట వల్ల కేకేఆర్ తమ చివరి మూడు ఓవర్లలో 47 పరుగలు సమర్పించుకుంది.

అంతకుముందు ఇన్నింగ్స్ ఆరంభం నుంచే చెన్నై సూపర్ కింగ్స్ తడబడింది. తొలి ఓవర్లో గతేడాది ఆరెంజ్ క్యాప్ హోల్డర్ రుతురాజ్ గైక్వాడ్ (0) పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ కు చేరుకున్నాడు. ఇక క్రీజులో ఉన్నంత సేపు ఇబ్బంది పడ్డ కాన్వే (3) కూడా పెవిలియన్ కు తొందరగానే చేరుకున్నాడు. అయితే ఈ దశలో జట్టు భారం అనుభవం ఉన్న రాబిన్ ఉతప్ప (28), అంబటి రాయుడు (15) మీద పడింది. ఉతప్ప ఫోర్, సిక్సర్ తో ఫామ్ లో ఉన్నట్లే కనిపించాడు. అయితే వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో పిచ్ ముందుకు వచ్చి స్టంపౌట్ అయ్యాడు. జడేజాతో సమన్వయ లోపంతో అంబటి రాయుడు కూడా రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన శివమ్ దూబే (3) కూడా క్రీజులో ఎంతో సేపు నిలువలేదు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Chennai Super Kings, IPL, IPL 2022, Kolkata Knight Riders, MS Dhoni, Ravindra Jadeja, Shreyas Iyer

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు