CSK vs GT Live Scores : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన క్షణం రానే వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 (IPL 2023) సీజన్ కు తెర లేచింది. అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ 16వ సీజన్ ఘనంగా ఆరంభమైంది. తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super kings)తో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) తలపడనుంది. తొలి మ్యాచ్ లో విజయం సాధించి టోర్నీలో శుభారంభం చేయాలని అటు ధోని.. ఇటు హార్దిక్ పాండ్యా పట్టుదలగా ఉన్నారు. ఇక ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన హార్దిక్ పాండ్యా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ ఫారెన్ ప్లేయర్స్ గా డెవోన్ కాన్వే, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్, సాంట్నెర్ లను తీసుకుంది. ఇక గుజరాత్ టైటాన్స్ విషయానికి వస్తే విదేశీ ప్లేయర్ల జాబితాలో కేన్ విలియమ్సన్, రషీద్ ఖాన్, జాష్ లిటిల్, అల్జారీ జోసెఫ్ లను తీసుకుంది. ఇంపాక్ట్ ప్లేయర్స్ గా రెండు జట్లలోనూ తెలుగు ప్లేయర్స్ ఉండటం విశేషం. గుజరాత్ టైటాన్స్ శ్రీకర్ భరత్ ను తీసుకుంటే.. చెన్నై సూపర్ కింగ్స్ షేక్ రషీద్ ను తీసుకుంది.
అంబరాన్ని అంటిన ఓపెనింగ్ సంబరాలు
ఐపీఎల్ 16వ సీజన్ ఆరంభ వేడుకలు అంబరాన్ని తాకాయి. బాలీవుడ్ స్టార్ సింగర్ అరిజిత్ సింగ్.. టాలీవుడ్ భామలు తమన్నా భాటియా, రష్మిక మంధానలు తమ ఆట పాటలతో అలరించారు. 45 నిమిషాల పాటు సాగిన ఆరంభ వేడుకులు అరిజిత్ సింగ్ పాటలతో మొదలు కాగా.. ఆ తర్వాత తమన్నా తన డ్యాన్స్ లతో హోరెత్తించింది. చివర్లో తెలుగు పాటలకు రష్మిక సూపర్ స్టెప్పులతో గ్రౌండ్ లో ఊపు తెచ్చింది. తమన్నా, రష్మికలు పుష్ప సాంగ్స్ తో పాటు ఆస్కార్ సాధించిన నాటు నాటు సాంగ్ కు కాళ్లు కదపడం విశేషం.
తుది జట్లు
చెన్నై సూపర్ కింగ్స్
ధోని (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, డెవోన్ కాన్వే, బెన్ స్టోక్స్, అంబటి రాయుడు, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, దీపక్ చహర్, సాంట్నెర్, రాజవర్ధన్
ఇంపాక్ట్ ప్లేయర్స్ : సిమ్రన్ జిత్ సింగ్, తుషార్ పాండే, సేనాపతి, షేక్ రషీద్
గుజరాత్ టైటాన్స్
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), శుబ్ మన్ గిల్, సాహా, కేన్ విలియమ్సన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, విజయ్ శంకర్, జాష్ లిటిల్, యశ్ దయాల్, జోసెఫ్, షమీ
ఇంపాక్ట్ ప్లేయర్స్ : సాయి సుదర్శన్, జయంత్ యాదవ్, మోహిత్ శర్మ, మనోహర్, శ్రీకర్ భరత్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chennai Super Kings, Gujarat Titans, Hardik Pandya, IPL, IPL 2023, MS Dhoni, Rashid Khan, Shubman Gill