హోమ్ /వార్తలు /క్రీడలు /

CSK vs GT : చెన్నై చిన్నోడి ఊరమాస్ ఇన్నింగ్స్.. గుజరాత్ టైటాన్స్ ముందు భారీ టార్గెట్.. ఎంతంటే?

CSK vs GT : చెన్నై చిన్నోడి ఊరమాస్ ఇన్నింగ్స్.. గుజరాత్ టైటాన్స్ ముందు భారీ టార్గెట్.. ఎంతంటే?

PC : IPL

PC : IPL

CSK vs GT Live Scores : అహ్మదాబాద్ (Ahmedabad) వేదకగా జరుగుతున్న ఐపీఎల్ 2023 (IPL 2023) ఆరంభ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

CSK vs GT Live Scores : అహ్మదాబాద్ (Ahmedabad) వేదకగా జరుగుతున్న ఐపీఎల్ 2023 (IPL 2023) ఆరంభ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans)తో జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 178 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (50 బంతుల్లో 92; 4 ఫోర్లు, 9 సిక్సర్లు) ఊర మాస్ ఇన్నింగ్స్ తో అలరించాడు. అయితే త్రుటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. మొయిన్ అలీ (23) ఫర్వాలేదనిపించాడు. చివర్లో ధోని (7 బంతుల్లో 14; 1 ఫోర్, 1 సిక్స్) సూపర్ ఫినిష్ ఇచ్చాడు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, షమీలకు తలా రెండు వికెట్లు లభించాయి.

టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ చెన్నై జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించింది. తొలి ఓవర్ ను జాగ్రత్తగా ఆడిన రుతురాజ్ గైక్వాడ్.. హార్దిక్ పాండ్యా వేసిన రెండో ఓవర్ నుంచి రెచ్చిపోయాడు. ఆ ఓవర్ లో రెండు ఫోర్లు కొట్టి టచ్ లో కనిపించాడు. అయితే షమీ వేసిన మూడో ఓవర్ లో డెవోన్ కాన్వే (1) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన మొయిన్ అలీ కూడా ఉన్నంత సేపు వేగంగా ఆడాడు. అయితే బౌలింగ్ కు వచ్చిన రషీద్ ఖాన్ తన వరుస ఓవర్లలో మొయిన్ అలీతో పాటు బెన్ స్టోక్స్ (7)లను అవుట్ చేశాడు. అయితే మరో ఎండ్ లో ఉన్న రుతురాజ్ మాత్రం తన దూకుడైన బ్యాటింగ్ ను ప్రదర్శించాడు. ముఖ్యంగా సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 9 సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. అయితే సెంచరీకి చేరువగా వచ్చి అవుటైయ్యాడు. చివరి ఓవర్లో ధోని సిక్స్, ఫోర్ కొట్టి చెన్నై సూపర్ కింగ్స్ స్కోరు బోర్డును 178 పరుగులకు చేర్చాడు.

తుది జట్లు

చెన్నై సూపర్ కింగ్స్

ధోని (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, డెవోన్ కాన్వే, బెన్ స్టోక్స్, అంబటి రాయుడు, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, దీపక్ చహర్, సాంట్నెర్, రాజవర్ధన్

ఇంపాక్ట్ ప్లేయర్స్  : సిమ్రన్ జిత్ సింగ్, తుషార్ పాండే, సేనాపతి, షేక్ రషీద్

గుజరాత్ టైటాన్స్

హార్దిక్ పాండ్యా (కెప్టెన్), శుబ్ మన్ గిల్, సాహా, కేన్ విలియమ్సన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, విజయ్ శంకర్, జాష్ లిటిల్, యశ్ దయాల్, జోసెఫ్, షమీ

ఇంపాక్ట్ ప్లేయర్స్ : సాయి సుదర్శన్, జయంత్ యాదవ్, మోహిత్ శర్మ, మనోహర్, శ్రీకర్ భరత్

First published:

Tags: Chennai Super Kings, Gujarat Titans, Hardik Pandya, IPL, IPL 2023, Kane Williamson, Mohammed Shami, MS Dhoni, Ravindra Jadeja, Shubman Gill

ఉత్తమ కథలు