Home /News /sports /

CSK VS DC TABLE TOPPERS DELHI AND CHENNAI BIG FIGHT DC WON THE TOSS AND ELECTED TO BOWL FIRST JNK

CSK vs DC: టేబుల్ టాపర్స్ పోరాటం.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. రైనాకు దక్కని చోటు

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. తుదిజట్టు నుంచి రైనా ఔట్ (PC: IPL)

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. తుదిజట్టు నుంచి రైనా ఔట్ (PC: IPL)

CSK vs DC: ఢిల్లీ క్యాపిటల్స్ - చెన్నై సూపర్ కింగ్స్ మధ్య కీలక పోరు జరుగుతున్నది. టేబుల్ టాప్ పొజిషన్ కోసం ఈ రెండు జట్లు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడబోతున్నాయి. ఫామ్‌లో లేని సురేశ్ రైనాకు సీఎస్కే తుది జట్టులో స్థానం లభించలేదు.

    ఐపీఎల్ 2021లో (IPL 2021) భాగంగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) - ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) మధ్య మ్యాచ్ జరుగుతున్నది. పాయింట్స్ టేబుల్‌లో తొలి రెండు స్థానాల్లో ఉన్న ఈ రెండు జట్లు అగ్రస్థానం కోసం పోటీ పడుతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ (Rishabh Pant) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ప్రస్తుతం చెన్నైతో కలిపి ఢిల్లీ కూడా 18 పాయింట్లతో సమానంగా ఉన్నా కేవలం నెట్ రన్ రేట్ తక్కువగా ఉండటంతో ఢిల్లీ రెండో స్థానానికి పరిమితం అయ్యింది. గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై స్వల్ప స్కోరును ఛేదించడానికి ఆపసోపాలు పడింది. ఓపెనర్ పృథ్వీషా తప్ప ఇతర క్రికెటర్లు అందరూ టాప్ ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో అవేశ్ ఖాన్, అక్షర్ పటేల్‌తో పాటు రబాడ, నోర్జే కూడా రాణిస్తుండటం ఢిల్లీ క్యాపిటల్స్‌కు కలిసి వచ్చే అంశం.

    చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వరుస విజయాలకు గత మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అడ్డుకట్ట వేసింది. ఆ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ సూపర్ సెంచరీ చేసి భారీ స్కోర్ సెట్ చేసినా.. బౌలర్లు విఫలమయ్యారు. దీంతో టార్గెట్ కాపాడుకోలేక పోయారు. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు అందరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో అందరూ బాగానే రాణిస్తున్నారు. కానీ డెత్ ఓవర్లలో బౌలింగ్ చేసే సరైన బౌలర్ కనపడటం లేదు. ఈ మ్యాచ్‌లో డ్వేన్ బ్రావో తిరిగి రావడంతో డెత్ బౌలర్ దొరికినట్లు అని విశ్లేషకులు బావిస్తున్నారు.

    IPL 2021: ఆ థర్డ్ అంపైర్‌ను పీకేయండి.. థర్డ్ అంపైర్ నాటౌట్ నిర్ణయం.. ఫీల్డ్ అంపైర్‌తో కేఎల్ రాహుల్ గొడవ













    తాము టాస్ గెలిస్తే బ్యాటింగ్ చేద్దామనే అనుకున్నాను. ఎందుకంటే ఈ పిచ్ కాస్త ట్రాకీగా ఉన్నది. ఇక జట్టులో సామ్ కర్రన్ బదులు డ్వేన్ బ్రావో తిరిగి వచ్చాడు. ఆసిఫ్ స్థానంలో దీపక్ చాహర్.. సురేశ్ రైనా స్థానంలో రాబిన్ ఊతప్పకు చోటు కల్పించామని ఎంఎస్ ధోనీ (MS Dhoni) చెప్పాడు. ఈ వికెట్ మొదట బౌలర్లు ఉపయోగపడుతుందని భావించడం వల్లే బౌలింగ్ ఎంచుకున్నట్లు రిషబ్ పంత్ చెప్పాడు. నేను ధోనీ నుంచి ఎంతో నేర్చుకున్నాను. కానీ ఈ రోజు మాత్రం ఆయన ప్రత్యర్థి మాత్రమే అని పంత్ అన్నాడు.
    Published by:John Naveen Kora
    First published:

    Tags: Chennai Super Kings, Delhi Capitals, IPL 2021, Ms dhoni, Rishabh Pant

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు