• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • CSK VS DC LIVE SCORE IPL 2021 ALL EYES ON RISHABH PANT VS MS DHONI WHO WILL WIN SA

IPL 2021: CSK vs DC; గురు vs శిష్య మధ్య పోరు.. ఇప్పటివరకు ఎవరెన్ని సార్లు గెలిచారంటే!

IPL 2021: CSK vs DC;  గురు vs శిష్య మధ్య పోరు.. ఇప్పటివరకు ఎవరెన్ని సార్లు గెలిచారంటే!

rabada faf duplessis

ఇరు జట్ల కెప్టెన్స్ ఎంఎస్ ధోనీ, రిషబ్ పంత్ ఇద్దరూ వికెట్‌ కీపర్లే.. ఈ గురుశిష్యులలో ఎవరిది పైచేయో చూడాలి. ధోనీ టీమిండియాను సమర్ధవంతగా నడిపించిన నాయకుడు.

  • Share this:
    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2021) మరో కీలక మ్యాచ్‌కి రంగం సిద్దమైంది. ఈ టోర్నీలో రెండో మ్యాచ్‌ శనివారం (ఏప్రిల్ 10) వాంఖడే స్టేడియంలో మూడుసార్లు ఛాంపియన్స్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. పెపర్‌‌పై ఢిల్లీ క్యాపిటల్స్ లైనప్ చాలా బలంగా కనిపిస్తోంది.
    .
    ఢిల్లీ టీంలో శిఖర్ ధావన్, పృథ్వీ షా, మార్కస్ స్టోయినిస్, కెప్టెన్ రిషబ్ పంత్, ఆర్ అశ్విన్, కాగ్సియో రబాడా, అన్రిచ్ నార్ట్జే లతో స్ట్రాంగ్ లైన్‌ఫ్‌తో ఉంది. ఇక చెన్నై సూపర్ కింగ్ ఐపిఎల్ 2021లోనైనా విజయవంతమైన ఆరంభం ఇవ్వాలని ఆశిస్తోంది. ఆ జట్టు సారథి ఎంఎస్ ధోని ఇప్పటికే టీంపై వర్క్ చేశాడు. భుజం గాయంతో ఐపిఎల్ 2021 నుంచి తప్పుకున్న కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బాధ్యతలను యువ ఆటగాడు రిషబ్ పంత్‌కు అప్పగించారు. అతను తన బాధ్యతను ఎంత సమర్ధవంతంగా నిర్వహిస్తాడో చూడాలి.

    ఇరు జట్ల కెప్టెన్స్ ఎంఎస్ ధోనీ, రిషబ్ పంత్ ఇద్దరూ వికెట్‌ కీపర్లే.. ఈ గురుశిష్యులలో ఎవరిది పైచేయో చూడాలి. ధోనీ టీమిండియాను సమర్ధవంతగా నడిపించిన నాయకుడు. భారత్‌కు 3 ఐపీఎల్‌ ట్రోఫీలు అదించాడు. ఇక పంత్ ఇప్పుడిప్పుడే నాయకత్వ మేళుకువాలు నేర్చుకుంటున్నాడు. ఈ గురు vs శిష్యుల మధ్య జరిగే పోరు కోసం అభిమానులు అసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఐపీఎల్ ఇప్పటివరకు ఢిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్ ‌కింగ్స్‌ 23 సార్లు తలపడ్డాయి. వీటిలో సీఎస్‌కే 15 విజయం సాధించగా ఢిల్లీ 8 సార్లు గెలిచింది. ఒక మ్యాచ్లో‌ మాత్రం ఫలితం తేలలేదు. ఐపీఎల్ 2020లో ఇరు జట్లు రెండు సార్లు తలపడగా వాటిలో ఢిల్లీయే విజయ దుందుభి మోగించింది. 2019లో మాత్రం చెన్నై పూర్తి అధిపత్యం కోనసాగించింది. రెండు లీగు మ్యాచుల్లో, రెండో క్వాలిఫయర్‌ల్లో ఢిల్లీని చిత్తుగా ఓడిచింది.

    తుది జట్లు (అంచనా) :

    చెన్నై: రుతురాజ్‌ గైక్వాడ్‌, ఫాఫ్ డుప్లెసిస్‌, సురేశ్‌ రైనా, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ, డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా, మొయిన్‌ అలీ, సామ్‌ కరన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చహర్.

    ‌ఢిల్లీ: శిఖర్ ధావన్, పృథ్వీ షా, స్టీవ్‌ స్మిత్‌, రిషబ్ పంత్‌ (కెప్టెన్‌), మార్కస్ స్టొయినిస్‌, శిమ్రాన్ హెట్‌మైయిర్‌, టామ్‌ కరన్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, అమిత్‌ మిశ్రా, ఉమేశ్‌ యాదవ్‌, ఇషాంత్‌ శర్మ.
    Published by:Rekulapally Saichand
    First published:

    అగ్ర కథనాలు