IPL 2021-Qualifier 1: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై.. ఫైనల్ బెర్త్ కోసం గురుశిష్యుల పోరాటం

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్.. తుది జట్లు ఇవే (PC: IPL)

IPL 2021: ఐపీఎల్ తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఫీల్డింగ్ చేయడానికి నిర్ణయించుకున్నది. చెన్నై అదే జట్టుతో బరిలోకి దిగుతుండగా.. ఢిల్లీ జట్టులో మాత్రం ఒక మార్పు జరిగింది.

 • Share this:
  ఐపీఎల్ 2021 ప్లే ఆఫ్స్‌లో తొలి క్వాలిఫయర్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ - చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతున్నది. టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని బౌలింగ్ చేయడానికి నిర్ణయించుకున్నడు. గతంలో ఇక్కడ ఆడిన అనుభవాల దృష్ట్యా ఫీల్డింగ్ చేయడానికి నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. ఇది మొదట్లో సీమర్లకు కలసి వచ్చే వికెట్. చూడటానికి చాలా టఫ్‌గా కనిపిస్తున్నది. అయితే ఆట జరుగుతున్న కొద్దీ వికెట్ బ్యాటర్లకు అనుకూలంగా మారిపోవడం చూశాము. అందుకే ముందు బౌలింగ్ చేయలని నిర్ణయించుకున్నాము. గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నామని కెప్టెన్ ఎంఎస్ ధోని అన్నాడు.

  ఇక రిషబ్ పంత్ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్ కాస్త భయంగా ఉన్నది. కానీ ఇది ఆటలో భాగమే. మేం చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాము. తప్పకుండా మ్యాచ్ గెలుస్తామని అనుకుంటున్నాము. గత మ్యాచ్ ఓటమి నుంచి తేరుకున్నాము. మా దృష్టంతా ఫైనల్స్ చేరడంపైనే ఉన్నదని అన్నాడు. గత మ్యాచ్‌లో ఆడిన రిపల్ పటేల్ స్థానంలో టామ్ కర్రన్ జట్టలోకి వచ్చాడని పంత్ చెప్పాడు.  తొలి క్వాలిఫయర్ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకమైనది. ఈ మ్యాచ్ గెలవడం ద్వారా నేరుగా ఫైనల్స్ చేరే అవకాశం ఉంటుంది. లేకపోతే మరో క్వాలిఫయర్ ఆడాల్సి వస్తుంది. అయితే ఈ సీజన్‌లో ఢిల్లీ రెండు సార్లు చెన్నై జట్టును ఓడించింది. అంతే కాకుండా చెన్నై సూపర్ కింగ్స్ గత మూడు మ్యాచ్‌లు ఓడిపోవడం గమనార్హం.
  Published by:John Naveen Kora
  First published: