ఐపీఎల్ 2021లో (IPL 2021) అగ్రస్థానం కోసం టేబుల్ టాపర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) - చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఇవాళ దుబాయ్ స్టేడియంలో తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు ఢిల్లీ బౌలర్ల ధాటికి తక్కువ స్కోరుకే పరిమితం అయ్యింది. టాపార్డర్ విఫలమైన వేళ అంబటి రాయుడు (Ambati Rayudu) సమయోచితమైన అర్ద సెంచరీ చేసి జట్టును ఆదుకున్నాడు. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (13) (Ruturaj Gaikwad), ఫాఫ్ డు ప్లెసిస్ (10) విఫలమయ్యారు. తొలి ఓవర్‌లోనే రుతురాజ్ ఎల్బీడబ్ల్యూ నుంచి తప్పించుకున్నాడు. అయితే నెమ్మదిగా ఉన్న వికెట్‌పై ఇద్దరు కూడా పరుగులు రాబట్టడానికి చాలా శ్రమపడ్డారు. వీరిద్దరి వికెట్లు పడిన తర్వాత వచ్చిన మొయిన్ అలీ (5), రాబిన్ ఊతప్ప (19) కూడా నిరాశ పరిచారు.దీంతో కేవలం 62 పరుగులకే 4 కీలకమైన వికెట్లు కోల్పోయి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కష్టాల్లో పడింది.
ఆ తర్వాత వచ్చిన అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ ఆచితూచి ఆడారు. ఇద్దరూ క్రీజులో నిలబడినా పరుగులు మాత్రం వేగంగా రాబట్టలేక పోయారు. ఢిల్లీ బౌలర్లు ఇద్దరు బ్యాటర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. పవర్ ప్లే ముగిసిన తర్వాత 16వ ఓవర్ వరకు బౌండరీ లభించలేదంటే ఢిల్లీ బౌలర్లు ఎలా బంతులు విసిరారో అర్థం చేసుకోవచ్చు. ఇక డెత్ ఓవర్లలో అంబటి రాయుడు వేగం పెంచాడు. మొదట్లో చాలా నెమ్మదిగా ఆడిన రాయుడు క్రమంగా బౌండరీలు, సిక్సులతో పరుగులు రాబట్టాడు. అయితే మరో ఎండ్‌లో ఉన్న ఎంఎస్ ధోనీ పరుగులు చేయలేకపోయినా.. రాయుడికి సరైన సహకారం అందించారు. ఈ క్రమంలో అంబటి రాయుడు 43 బంతుల్లో 55 పరుగులు చేశాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింద. ఒకానొక సందర్భంలో110 పరుగులైనా దాటుతుందా అని ఫ్యాన్స్ ఆందోళన పడినా.. చివరకు రాయుడి హాఫ్ సెంచరీ సహాయంతో గౌరవ ప్రదమైన స్కోర్ సాధించింది.
INNINGS BREAK!
2⃣ wickets for @akshar2026
1⃣ wicket each for @ashwinravi99, @Avesh_6 & @AnrichNortje02
5⃣5⃣* for @RayuduAmbati
The @DelhiCapitals chase will begin shortly. #VIVOIPL #DCvCSK
Scorecard 👉 https://t.co/zT4bLrDCcl pic.twitter.com/6oSkFGW29n
— IndianPremierLeague (@IPL) October 4, 2021
5⃣5⃣* Runs
4⃣3⃣ Balls
5⃣ Fours
2⃣ Sixes@RayuduAmbati plays a fine knock to guide @ChennaiIPL to 136/5. 👏 👏 #VIVOIPL #DCvCSK
Scorecard 👉 https://t.co/zT4bLrDCcl pic.twitter.com/NpOtxPEAZk
— IndianPremierLeague (@IPL) October 4, 2021
ఈ మ్యాచ్ గెలవడం ఇరు జట్లకు అవసరం. టేబుల్ టాపర్‌గా ఉండాలని ఇరు జట్లు కోరుకుంటున్నాయి. ఒక క్వాలిఫయర్‌తో పాటు మరో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడే అవకాశం ఉండటంతో టేబుల్‌లో నెంబర్ 1 పొజిషన్ ఇరు జట్లకు ఎంతో అవసరం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ambati rayudu, Chennai Super Kings, Delhi Capitals, IPL 2021