Ruturaj Gaikwad: వీడు ఎక్కడున్నా రాజే రా.. అలంకరించి.. దిష్టితీసి.. తల్లి ప్రేమతో స్వాగతం!

ruturaj-gaikwad-returns-home

స్వంత రాష్ట్రమైన మహారాష్ట్రకు తిరిగి వచ్చిన వెంటనే, అతనికి సాంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం లభించింది. మీడియా అతన్ని చుట్టూముట్టింది.. అభిమానులు ఎగబడ్డారు. బ్యాండ్,చప్పట్లతో అతనికి ఘన స్వాగతం పలికారు

  • Share this:


    ఐపిఎల్ 2021లో రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన బ్యాటింగ్ విన్యాసాలను ఫ్యాన్స్ ఎంతగా అస్వాదించారో అందరికి తెలిసిందే. క్లాస్.. మాస్ బ్యాటింగ్‌తో చెన్నై సూపర్ కింగ్స్‌ను విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. అనుభవజ్ఞుడైన ఫాఫ్ డు ప్లెసిస్‌తో ఓపెనర్‌గా బరిలోకి దిగి లక్షాన్ని చేధించడంలో లేదా ప్రత్యర్థికి బలమైన టార్గెట్‌ను సెట్ చేయడంలో రుత్‌రాజ్ బ్యాటింగ్ కీలకంగా నిలిచింది . అక్టోబర్ 15, 2021 న CSK నాల్గవ టైటిల్‌కి నెగ్గిడంలో అతని పాత్ర అనిర్వచనీయమైనది. ఇక ఐపీఎల్ ముగింపు తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన గైక్వాడ్‌కు ఘన స్వాగతం లభించింది.






    తన స్వంత రాష్ట్రమైన మహారాష్ట్రకు తిరిగి వచ్చిన వెంటనే, అతనికి సాంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం లభించింది. మీడియా అతన్ని చుట్టూముట్టింది.. అభిమానులు ఎగబడ్డారు. బ్యాండ్,చప్పట్లతో అతనికి ఘన స్వాగతం పలికారు. మరి బయటివారే అతన్ని ఇంతగా అభిమానిస్తుంటే ఇక ఇంటివారి నుంచి ఎంతటి స్వాగతం లభించాలి.. దాదాపు రెండు నెలల తర్వాత ఇంటికి చేరుకున్న రుతురాజ్‌ను అతడి తల్లి ఎంతో ప్రేమతో స్వాగతం పలికింది. ఇంటిని పూలతో అలంకరించి.. అతనికి దిష్టితీసి ఇంట్లోకి ఆహ్వానించింది. దీనికి సంబంధించిన వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ అధికారిక ఇన్‌స్ట్రా హ్యాండిల్ షేర్ చేసింది.

    ఐపీఎల్ 2021లో రుతురాజ్ 45.35 సగటు పరుగులతో 136.26 స్ట్రైక్‌రెటుతో గైక్వాడ్ ఆకట్టుకున్నాడు. 7 అర్ధశతకాలు, ఒక శతకం బాది మెుత్తం 635 పరుగులు సాధించి పిన్న వయసులోనే ఆరెంజ్‌ క్యాప్‌ అందుకున్న ఆటగాడిగా నిలిచాడు.
    Published by:Rekulapally Saichand
    First published: