IPLకు ముందు ధోనీ విశ్వరూపం.. ఒకే ఓవర్లో 5 సిక్స్‌లు

మార్చి 29 నుంచి ఐపీఎల్-13 ప్రారంభం కానుంది. ముంబైలోని వాఖండే స్టేడియంలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.

news18-telugu
Updated: March 6, 2020, 11:02 PM IST
IPLకు ముందు ధోనీ విశ్వరూపం.. ఒకే ఓవర్లో 5 సిక్స్‌లు
ఎంఎస్ ధోనీ (Image:IPL)
  • Share this:
మరికొన్ని వారాల్లో ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభం కాబోతోంది. ఈ క్రమంలో ధోనీ రాక కోసం అభిమానులు ఆతురతగా ఎదురుచూస్తున్నారు. ప్రపంచ కప్ సెమీఫైనల్‌లో భారత్ ఓటమి తర్వాత టీమిండియాకు దూరమైన ధోనీ.. మళ్లీ ఎప్పుడెప్పుడు బ్యాట్ పడతాడా అని వేయికళ్లతో వేచిచూస్తున్నారు. ఐతే ఐపీఎల్ కోసం ఇప్పటికే చెన్నైలో వాలిపోయిన ధోనీ ప్రాక్టీస్‌లో అదరగొడుతున్నాడు. వరుసగా ఐదు సిక్స్‌లు కొట్టి.. తన సత్తాను క్రికెట్ ప్రపంచానికి మరోసారి చాటాడు. ఆ వీడియోను స్టార్ స్పోర్స్ట్ తమిళ్ తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
ఐతే ఎవరైనా బౌలర్ బౌలింగ్‌లో ధోనీ ఆ సిక్స్‌లు కొట్టాడా? లేదంటే బాల్ మెషీన్‌తో వేసిన బాల్స్‌ని సిక్స్‌లుగా మలిచాడా? అన్న దానిపై క్లారిటీ లేదు.కానీ మొత్తానికి ఐదు వరుస బంతులన్నీ గాల్లోకి పంపి బౌండరీ లైన్‌ను దాటించేశాడు. ఆ సమయలో ధోనీ వెనక సురేష్ రైనా, పీయుష్ చావ్లా ఉన్నారు. ఆ వీడియోను చూసిన ధోనీ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. మనోడి పవర్ ఏ మాత్రం తగ్గలేదని.. ఈసారి ఐపీఎల్‌లో సిక్స్‌ల మోత మోగడం ఖాయమని మురిసిపోతున్నారు.

కాగా, మార్చి 29 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. ముంబైలోని వాఖండే స్టేడియంలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. మార్చి 29న (ఆదివారం) సాయంత్రం 8 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.

2019 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచే ఎంఎస్ ధోనీకి చివరి మ్యాచ్. ఆ తర్వాత ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌లోనూ ధోనీ ఆడలేదు. ప్రపంచకప్ తర్వాత రెండు నెలల పాటు ఇండియన్ ఆర్మీకి సేవలు అందించాడు. ఆ తర్వాత జట్టులోకి వస్తాడని అందరూ భావించారు. కానీ అది జరగలేదు. తన పూర్తి సమయాన్ని కుటుంబానికే కేటాయించాడు. ఇక జనవరిలో టీమిండియా కాంట్రాక్ట్‌ నుంచి ధోనీని తప్పించడం చర్చనీయాంశమైంది. భారత జట్టులో మిస్టర్ కూల్ ప్రస్థానం ముగిసినట్టేనని ప్రచారం జరుగుతోంది. ఐతే ఐపీఎల్‌లో మాత్రం యథావిథిగా ఆడనున్నాడు ధోనీ. ఆ టోర్నీ కోసం ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.


First published: March 6, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading