Home /News /sports /

CRISTIANO RONALDOS ACT IS WRONG UEFA REMINDS TEAMS OF SPONSORSHIP OBLIGATIONS JNK

Ronaldo - Coke Issue : రొనాల్డో చేసింది తప్పే.. అలా చేయడం కాంట్రాక్టు నిబంధనలు ఉల్లంఘించడమే..!

రొనాల్డోకు యూఈఎఫ్ఏ వార్నింగ్.. కోక్ బాటిల్స్ జరపొద్దు

రొనాల్డోకు యూఈఎఫ్ఏ వార్నింగ్.. కోక్ బాటిల్స్ జరపొద్దు

యూరో కప్ 2020లో ఒక ప్రెస్ మీట్ సందర్భంగా క్రిస్టియానో రొనాల్డో కోక్ బాటిల్స్ పక్కకు పెట్టడంపై యూఈఎఫ్ఏ స్పందించింది. ఈ విషయంలో క్రిస్టియానో రొనాల్డోపై చర్యలు తీసుకుంటారో లేదో స్పష్టం చేసింది.

    పోర్చుగల స్టార్ ప్లేయర్, కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo) యూరో కప్ 2020 (Euro Cup 2020) మీడియా కాన్ఫరెన్సులో కోకాకోలా (Coca Cola) బాటిల్ తీసి పక్కన పెట్టిన విషయం తెలిసిందే. హంగేరీతో మ్యాచ్‌కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో టేబుల్‌పైన ఉన్న రెండు బాటిల్స్ తీసి పక్కు పెట్టాడు. అంతటితో ఆగకుండా 'వాటర్' అంటూ గట్టిగా నినాదాలు చేశాడు. ఆ మరుసటి రోజే కోకాకోలా మార్కెట్ వాల్యూ రూ. 29 వేల కోట్ల మేర పతనం అయ్యింది. కాగా, యూఈఎఫ్‌ఏ యూరో కప్ 2020 స్పాన్సర్లలో ఒకటైన కోక్ ఈ విషయంపై ఆచి తూచి స్పందించింది. 'ప్రతీ ఒక్కరికి తమ డ్రింక్‌ను ఎంచుకునే హక్కు ఉంది' అంటూ ప్రకటన జారీ చేసింది. ఆ తర్వాత ఫ్రాన్స్ మిడ్ ఫీల్డర్ పాల్ పోబా ప్రెస్ మీట్ సందర్భంగా టేబుల్‌ పైన ఉన్న హెనికెన్ బీర్ బాటిల్‌ను పక్కన పెట్టాడు. కాగా ఈ రెండు ఘటనలపై యూఈఎఫ్ఏ (UEFA) స్పందించింది. యూరో కప్ 2020ని స్పాన్సర్ చేస్తున్న సంస్థల నిబంధనలను ప్రతీ టీమ్ గౌరవించాల్సి ఉంటుందని ఫెడరేషన్ స్పష్టం చేసింది.

    యూరోప్ వ్యాప్తంగా పురుషులతో పాటు యూత్, విమెన్ ఫుట్‌బాల్ అభివృద్దికి ఈ సంస్థలు ఎంతగానో కృషి చేస్తున్నాయని ఫెడరేషన్ తెలిపింది. వారు స్పాన్సర్‌షిప్ రూపంలో చేస్తున్న సహాయంతోనే ఫుట్‌బాల్ ఆటను అభివృద్ది చేస్తున్నామని.. అతి తక్కువ ఖర్చుతో ప్రేక్షకులు వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నామని యూఈఎఫ్ఏ తెలిపింది. యూరో 2020 టోర్నమెంట్ డైరెక్టర్ మార్టిన్ కెలెన్ స్పందిస్తూ.. గత రెండు రోజులుగా జరిగిన ఘటనల్లో క్రిస్టియానో రొనాల్డో చేసిన దానిపైనే మాకు తీవ్ర అభ్యంతరం ఉన్నదని చెప్పారు. పాల్ పోబా తన మతానికి సంబంధించిన నిబంధనల కారణంగా బీర్ బాటిల్ పక్కన పెట్టాడు. కానీ క్రిస్టియానో రొనాల్డో కేవలం వ్యక్తిగత కారణాల వల్ల కోక్ బాటిల్స్ జరిపాడు. దీని వల్ల స్పాన్సర్ గౌరవానికి భంగం కలిగినట్లు భావిస్తున్నాము అందుకే దీనిపై తప్పకుండా చర్యలు ఉంటాయని ఆయన చెప్పారు.

    యూరో 2020లో పాల్గొనే ప్రతీ జట్టు కాంట్రాక్టు నిబంధనల ప్రకారం నడుచుకోవల్సిన బాధ్యత ఉంటుంది. ఈ టోర్నమెంట్‌లో పాల్గొనడానికి ముందే దీనికి సంబంధించిన నియమ నిబంధనలపై అన్ని దేశాల జాతీయ ఫెడరేషన్లు సంతకాలు చేశాయి. ఆ నిబంధనలు ఆ జట్టులోని అందరి ఆటగాళ్లు, కోచ్, మేనేజర్, ఇతర సిబ్బందికి కూడా వర్తిస్తాయని యూఈఎఫ్ఏ చెబుతున్నది. కోక్ ఘటనలో క్రిస్టియానో రొనాల్డోకి నేరుగా జరిమానా విధించే అవకాశం లేదు. కాకపోతే ఆ జాతీయ అసోసియేషన్‌కు కేటాయించే నిధుల్లో కోత ఉండొచ్చని తెలుస్తున్నది. ఎలాంటి క్రమశిక్షణ చర్య అయినా పోర్చుగల్ ఫెడరేషన్ మీద తీసుకునే హక్కు యూఈఎఫ్ఏకు ఉన్నది.
    Published by:John Naveen Kora
    First published:

    Tags: Cristiano Ronaldo, EURO 2020, Euro Cup 2021, Football

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు