హోమ్ /వార్తలు /క్రీడలు /

Cristiano Ronaldo: మ్యాచ్ ముగియగానే రొనాల్డో ఆ బాత్ టబ్‌లోనే స్నానం చేస్తాడంటా.. దాని ఖరీదు, ప్రత్యేకతలు తెలుసా?

Cristiano Ronaldo: మ్యాచ్ ముగియగానే రొనాల్డో ఆ బాత్ టబ్‌లోనే స్నానం చేస్తాడంటా.. దాని ఖరీదు, ప్రత్యేకతలు తెలుసా?

రొనాల్డో స్నానం చేసే బాత్ టబ్ ప్రత్యేకత ఏంటో తెలుసా? (PC: Instagram)

రొనాల్డో స్నానం చేసే బాత్ టబ్ ప్రత్యేకత ఏంటో తెలుసా? (PC: Instagram)

Cristiano Ronaldo: క్రిస్టియానో రొనాల్డో మ్యాచ్ ముగిసిన వెంటనే తన ఇంటిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాత్ టబ్‌లో ఐదు నిమిషాల పాటు స్నానం చేస్తాడంటా. ఆ బాత్ టబ్ ఆషామాషీది కాదు. దాని వివరాలు ఏంటో తెలుసుకుందాం.

ఫుట్‌బాల్ దిగ్గజ ఆటగాడు, పొర్చుగల్‌కు చెందిన క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన (Richest Footballers) ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. గత సీజన్ వరకు జువెంటస్ క్లబ్ (Juventus Club) తరపున ఆడిన క్రిస్టియానో రొనాల్డో ప్రస్తుతం మాంచెస్టర్ యునైటెడ్‌కు (Manchester United) మారిపోయాడు. ఫుట్‌బాల్ ప్రపంచంలో అత్యంత మంది ఫ్యాన్స్ ఉన్న ఆటగాడు కూడా రొనాల్డోనే. యునైటెడ్ తరపునే క్లబ్ కెరీర్ ప్రారంభించిన రొనాల్డో.. తిరిగి సొంత గూటికి చేరుకున్నాడు. దీంతో తన మకాంను ఇటలీ నుంచి మాంచెస్టర్ శివారులో ఉన్న చెషైర్‌కు మార్చాడు. చెషైర్ కౌంటీలో రొనాల్డోకు ఒక మాన్షన్ ఉన్నది. అక్కడి నుంచే మ్యాచ్‌లకు హాజరవుతున్నాడు. గతంలో జువెంటస్‌కు ఆడినప్పుడు ఇటలీలో ఇంటి నుంచే వెళ్లేవాడు. అయితే 36 ఏళ్ల రొనాల్డో.. ఇప్పటికీ ఎంతో ఫిట్‌గా కనపడుతున్నాడు. రోజు రోజుకూ అతడి ఫిట్‌నెస్ లెవెల్స్ ఏమాత్రం తగ్గడం లేదు. దీని వెనుక సీక్రెట్ ఏంటో బయటపడింది.

రొనాల్డో ప్రతీ మ్యాచ్ ముగిసిన తర్వాత క్రయోథెరపీ చేయించుకున్నాడు. ఇందుకోసం ఏకంగా 50 వేల పౌండ్లు ( దాదాపు రూ. 51 లక్షలు) పెట్టి ఒక క్రయోథెరపీ చాంబర్‌ను కొనుగోలు చేశాడు. దీన్నే ఐస్ బాత్ టబ్ అని కూడా పిలుస్తారు. మ్యాచ్ ముగిసి ఇంటికి వెళ్లిన తర్వాత రొనాల్డో.. ఆ చాంబర్‌లో 5 నిమిషాల పాటు స్నానం చేస్తాడు. స్నానం అంటే మనం మామూలుగా చేసే నీళ్ల టబ్ స్నానం కాదు. ఈ క్రయో థెరపీ చాంబర్‌లో ఉస్ణోగ్రతం -200 డిగ్రీల సెంటీగ్రేడ్ అంత చల్లగా ఉంటుంది. అంతే కాకుండా ఈ చాంబర్‌లోకి బట్టలు విప్పేసి నేనుగా వెళ్లకూడదు. అందుకు ప్రత్యేకమైన కవచ రక్షణ ఉంటుంది.

KS Bharat: ఆఖరి బంతికి సిక్స్ కొట్టి ఆర్సీబీని గెలిపించిన తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ గురించి పూర్తి వివరాలు తెలుసా?బాస్కెట్ బాల్ తయారీలో వాడే చర్మంలాంటి కోటును ధరించి ఈ క్రయోచాంబర్‌లోకి ప్రవేశిస్తారు. అది లిక్విడ్ నైట్రోజన్‌ను పంప్ చేస్తుంది. వెంటనే మన శరీరం అత్యంత చల్లనైన స్థితికి వెళ్లిపోతుంది. ఇలా చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. అంతే కాకుండా మన రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. చిన్నపాటి గాయాలు ఉన్నా.. అలసటగా ఉన్నా.. వెంటనే ఫ్రెష్ అయిపోతారు. అయితే ఇందులో 5 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉండకూడదు. అలా ఉంటే శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎంతో నిపుణులైన వారి పర్యవేక్షణలో మాత్రమే ఈ క్రయోచాంబర్ (ఐట్ బాత్ టబ్)లోకి ప్రవేశించాలి.

SRH vs MI: ముంబై ఇండియన్స్ గెలిచింది కానీ.. ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కలేదు.. దెబ్బేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు..రొనాల్డో గత ఏడేళ్లుగా ఈ చాంబర్‌ను ఉపయోగిస్తున్నాడు. గతంలో ఇటలీలోని తన ఇంటి ఉన్న ఈ చాంబర్‌ను ఇటీవలే మాంచెస్టర్ శివారులోని తన మాన్షన్‌కు తెప్పించుకున్నాడు. ప్రతీ మ్యాచ్ అనంతరం రొనాల్డో అందులో ఐదు నిమిషాలు ఉన్న తర్వాత తిరిగి మామూలు రొటీన్‌లో పడిపోతాడని సన్నిహతులు చెబుతున్నారు. మార్కస్ రష్‌ఫోర్డ్, గెరెత్ బాలే వంటి ఫుట్‌బాలర్స్ కూడా ఇలాంటి క్రయో చాంబర్లను వినియోగిస్తున్నారు.

First published:

Tags: Cristiano Ronaldo, Football

ఉత్తమ కథలు