Home /News /sports /

CRISTIANO RONALDO TRANSFER FEE EMERGES AS MANCHESTER UNITED AND JUVENTUS REACH AGREEMENT CHECK TRANSFER DETAILS HERE JNK

Cristiano Ronaldo: జువెంటస్‌ను వదిలి మాంచెస్టర్ యునైటెడ్‌కు మారిన క్రిస్టియానో రొనాల్డో.. ట్రాన్స్‌ఫర్ కోసం ఎంత చెల్లించారో తెలుసా?

క్రిస్టియానో రొనాల్డోకు మాంచెస్టర్ యునైటెడ్ ఎంత చెల్లిస్తున్నదో తెలుసా? (PC: Man Utd/Twitter)

క్రిస్టియానో రొనాల్డోకు మాంచెస్టర్ యునైటెడ్ ఎంత చెల్లిస్తున్నదో తెలుసా? (PC: Man Utd/Twitter)

దిగ్గజ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో జువెంటస్ క్లబ్ నుంచి మాంచెస్టర్ యునైటెడ్‌కు ట్రాన్స్‌ఫర్ అయ్యాడు. గత మూడు సీజన్లుగా జువెంటస్ తరపున ఆడిన రొనాల్డో తన హోమ్ టీమ్ మాంచెస్టర్ యునైటెడ్‌కు తరలిపోయాడు.

    దిగ్గజ ఫుట్‌బాల్ ప్లేయర్, పోర్చుగల్ జాతీయ జట్టు కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) మరోసారి క్లబ్ మారాడు. యూరోపియన్ ఫుట్‌బాల్ లీగ్‌లో (European football League) ఇటాలియన్ క్లబ్ జువెంటస్ (Jeventas) తరపున 2018 నుంచి ఆడుతున్న క్రిస్టియానో రొనాల్డో చివరకు తన హోమ్ టీమ్ మాంచెస్టర్ యునైటెడ్‌కు (Manchester United) తరలి వెళ్లాడు. మాంచెస్టర్ యునైటెడ్ తరపున రొనాల్డో రెండేళ్ల కాలపరిమితికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. రోనాల్డోకు మాంచెస్టర్ యునైటెడ్ వారానికి 4,80,000 పౌండ్లు (దాదాపు రూ. 4.9 కోట్లు) చెల్లించనున్నది. మొత్తానికి ఏడాదికి మాంచెస్టర్ యునైటెడ్ జట్టు రూ. 252 కోట్లు రొనాల్డోకు చెల్లించనున్నది. అంతే కాకుండా రొనాల్డోను తమ క్లబ్ నుంచి విడుదల చేసినందుకు గాను జువెంటస్ క్లబ్‌కు మాంచెస్టర్ యునైటెడ్ భారీగానే చెల్లించనున్నది. ట్రాన్స్‌ఫర్ ఫీజ్‌తో పాటు అంతకు ముందు రియల్ మాడ్రిడ్ నుంచి రొనాల్డోను తెచ్చుకున్నందుకు జవెంటస్ చెల్లించాల్సిన బకాయిలను కూడా మాంచెస్టర్ యునైటెడ్ చెల్లించనున్నట్లు తెలుస్తున్నది. క్రిస్టియానో రొనాల్డోకు ప్రస్తుతం మాంచెస్టర్ యునైటెడ్ చెల్లించబోతున్న రూ. 252 కోట్లు ఆ క్లబ్‌లో మరే ఇతర ఆటగాడు అందుకోవడం లేదు. మాంచెస్టర్ యునైటెడ్‌లో ఇప్పటి వరకు డేవిడ్ డి గియా అత్యధికంగా వారానికి 3,75,000 పౌండ్లు (రూ. 3.9 కోట్లు) అందుకుంటున్నాడు. ఆ తర్వాతి స్థానంలో పాల్ పోబా వారానికి 2,90,000 పౌండ్లు తీసుకుంటున్నాడు. ఇప్పుడు రొనాల్డో రాకతో అతడి జీతమే నెంబర్ వన్ పొజిషన్‌కు మారింది. గతంలో రియల్ మాడ్రిడ్ నుంచి జువెంటస్‌కు రొనాల్డో ట్రాన్స్‌ఫర్ కోసం 100 మిలియన్ పౌండ్లు (దాదాపు రూ. 1000 కోట్లు) చెల్లించింది. అయితే అప్పట్లో పూర్తిగా ట్రాన్స్‌ఫర్ ఫీజు చెల్లించకపోవడంతో ఆ బకాయిలను ఇప్పుడు జవెంటస్ క్లబ్ తరపున మాంచెస్టర్ యునైటెడ్ చెల్లించనున్నది. అయితే ఏ మేరకు బకాయిలు ఉన్నారనే విషయం ఇంకా స్పష్టంగా తెలియలేదు.

    యూరోపియన్ క్లబ్స్ తరపున 2002 నుంచి రొనాల్డో ఆడుతున్నాడు. 2003 నుంచి 2009 వరకు మాంచెస్టర్ యునైటెడ్ తరపున ఆడిన రొనాల్డో 196 మ్యాచ్‌లలో 84 గోల్స్ చేశాడు. ఆ తర్వాత 2009 నుంచి 2018 వరకు సుదీర్ఘ కాలం రియల్ మాడ్రిడ్ క్లబ్ తరపున ఆడాడు. 292 మ్యాచ్‌లలో 311 గోల్స్ చేసి రియల్ మాడ్రిడ్ తరపున అద్భుత ప్రదర్శన చేశాడు. 2018లో ఇటలీకి చెందిన జువెంటస్ క్లబ్ భారీ మొత్తానికి రొనాల్డోను ట్రాన్స్‌ఫర్ చేసుకున్నది. మూడు సీజన్ల పాటు రొనాల్డో ఆ క్లబ్ తరపున ఆడాడు. అయితే జువెంటస్ క్లబ్ రొనాల్డోకు భారీగా చెల్లింపులు చేస్తుండటంతో ఆర్థికంగా భారం అవుతున్నది. దీంతో పాటు రొనాల్డో వయసును కూడా పరిగణలోకి తీసుకున్న జువెంటస్ అతడిని విడుదల చేయడానికి సిద్దపడింది. వాస్తవానికి మరో సీజన్ పాటు రొనాల్డోను తమతో ఉంచుకునేందుకు ఒప్పందం ఉన్నా.. జువెంటస్ మాత్రం విడుదల చేసింది.

    Jarvo 69: 'ప్రతీసారి వీడి ఎంట్రీ ఏంట్రా?'.. జర్వో 69 ఫొటోతో ఒక ఆట ఆడుకుంటున్న మీమర్స్.. ఈ వైరల్ మీమ్స్ చూడండి








    రాబోయే సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల ట్రాన్స్‌ఫర్‌కు మంగళవారం వరకు సమయం ఉన్నది. మొదట్లో క్రిస్టియానో రొనాల్డోనే తమ క్లబ్‌కు తిరిగి తెచ్చుకునేందుకు మాంచెస్టర్ యునైటెడ్ ఏ మాత్రం ప్రయత్నాలు చేయలేదు. కానీ రొనాల్డో క్లబ్ మారేందుకు సిద్దపడి పోర్చుగల్ వెళ్లిపోయాడు. దీంతో అప్పటికప్పుడు మాంచెస్టర్ యునైటెడ్ యాజమాన్యం రొనాల్డోకు సంబంధించి నిర్ణయం తీసుకున్నది. ఓల్డ్ ట్రాఫోర్డ్‌కు తిరిగి రావడానికి రొనాల్డో కూడా ఒప్పుకోవడంతో అప్పటికప్పుడు ట్రాన్స్‌ఫర్ జరిగిపోయింది. క్రిస్టియానో రొనాల్డోకు వైద్యపరీక్షలు చేసిన అనంతరం అతడు ఇంగ్లాండ్ వెళ్లి క్లబ్‌తో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు సుదీర్ఘ కాలంగా బార్సిలోనా క్లబ్‌ తరపున ఆడుతున్న లియోనల్ మెస్సీ కూడా జట్టుకు గుడ్‌బై చెప్పాడు. అతడు ఏ క్లబ్‌లో చేరతాడనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

    Virat Kohli: 'మీరు మారిపోయారు కోహ్లీ సార్.. మీరు మారారు.. మీలో అహం తగ్గి సహనం పెరిగింది' అంటున్న పాక్ క్రికెటర్


     

    Published by:John Naveen Kora
    First published:

    Tags: Cristiano Ronaldo, Football

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు