Home /News /sports /

CRISTIANO RONALDO SLAPPED IRELAND PLAYER BUT ESCAPED RED CARD CHECK DETAILS HERE JNK

Cristiano Ronaldo: ఐర్లాండ్ ఆటగాడిని కొట్టిన క్రిస్టియానో రొనాల్డో.. రెడ్ కార్డ్ నుంచి ఎలా తప్పించుకున్నాడంటే..

ఐర్లాండ్ ఆటగాడిని కొట్టిన క్రిస్టియానో రొనాల్డో (PC: FIFA/Twitter)

ఐర్లాండ్ ఆటగాడిని కొట్టిన క్రిస్టియానో రొనాల్డో (PC: FIFA/Twitter)

Cristiano Ronaldo: ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో డిఫెంటర్ ఓషియాను పోర్చుగల్ స్ట్రైకర్ క్రిస్టియానో రొనాల్డో కొట్టాడు. కానీ అతడు రెడ్ కార్డు నుంచి తప్పించుకున్నాడు.

    దిగ్గజ ఫుట్‌బాల్ (Football) ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) అంతర్జాతీయ మ్యాచ్‌లలో 111 గోల్స్ చేసి అగ్రస్థానానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఫిఫా (FIFA) వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో (World Cup) భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ చివరి నిమిషంలో రొనాల్డో రెండు గోల్స్ చేసి పోర్చుగల్ టీమ్‌ను గెలిపించాడు. ఈ రెండు గోల్స్‌తో రొనాల్డో అంతర్జాతీయ గోల్స్ సంఖ్య 111కు చేరింది. దీంతో ఇరాన్ దిగ్గజ ఆటగాడు అలీ దాయ్ (109)ను దాటి అగ్రస్థానంలో నిలిచాడు. దీంతో మీడియాలో రొనాల్డో ఘనతకు సంబంధించి వార్తలు పుంఖానుపుంఖాలుగా వెలువడ్డాయి. ఈ కాలంలో మేటి ఆటగాడిగా రొనాల్డోను కీర్తించాయి. క్రీడా విశ్లేషకులు కూడా రొనాల్డో ప్రతిభను పొగిడారు. మరోవైపు ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. ఇటీవలే జువెంటస్‌ను వదిలి మాంచెస్టర్ యునైటెడ్‌కు వచ్చిన రొనాల్డో.. లీగ్స్ మొదలు కాక ముందే అద్భుతమైన ఘనతను సాధించడం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది.

    ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి నుంచి తన జట్టును గెలిపించిన రోనాల్డో.. అదే మ్యాచ్‌లో అంతకు ముందు చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆట ప్రారంభమైన 15వ నిమిషంలోనే పోర్చుగల్‌కు పెనాల్టీ లభించింది. ఈ పెనాల్టీ కిక్‌ను రొనాల్డో తీసుకున్నాడు. అయితే బంతిని కిక్ చేయడానికి రొనాల్డో పొజిషన్‌లోపెట్టుకోగా.. ఐర్లాండ్ డిఫెండర్ ఓషియా దాన్ని కాలితో తన్నాడు. దీంతో ఆగ్రహానికి గురైన రొనాల్డో అతడి భుజంపై బలంగా కొట్టాడు. రొనాల్డో కొట్టడంతో వెంటనే గ్రౌండ్‌పై పడిన ఓషియా కాసేపు రిఫరీ కోసం చూశాడు. అక్కడ తప్పు ఓషియాదే అయినా.. ప్రత్యర్థి ఆటగాడిపై చేయి చేసుకోవడం పెద్ద నేరం. దీంతో రొనాల్డోకు రెడ్ కార్డు వస్తుందని ఓషియా కాసేపు నేలపై పడిపోయాడు. కానీ రిఫరీ ఇదేమీ గమనించలేదు. దీంతో రొనాల్డో రెడ్ కార్డు నుంచి తప్పించుకున్నాడు. ఒక వేళ రొనాల్డోకి రెడ్ కార్డు చూపించి ఉంటే.. మైదానం వీడి బయటకు వెళ్లాల్సి వచ్చేది. అప్పుడు చివర్లో రెండు గోల్స్ కొట్టే అవకాశామే ఉండేది కాదు.







    కాగా, రొనాల్డో ఆ పెనాల్టీ కిక్‌ను వృధా చేశాడు. రొనాల్డో కొట్టిన బంతిని గోల్ కీపర్ గావిన్ బజ్ను విజయవంతంగా అడ్డుకున్నాడు. అలా పోర్చుగల్ జట్టుకు తొలి హాఫ్‌లోనే రావల్సిన గోల్‌ను రొనాల్డో మిస్ చేశాడు. అయితే చివరి నిమిషంలో రెండు గోల్స్ కొట్టి జట్టకు విజయాన్ని అందించాడు.

    US Open: తొలి రౌండ్‌లోనే ఓడిన సానియా-కోకో జోడి.. యూఎస్ ఓపెన్‌లో జకోవిచ్, బార్టీ జోరు..


     

    Published by:John Naveen Kora
    First published:

    Tags: Cristiano Ronaldo, Football, World cup

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు