గోల్ కన్నా ఆమెతో శృంగారమే మిన్న.. సాకర్ స్టార్ సంచలన వ్యాఖ్యలు

ప్రేయసి జార్జినా రోడ్రిగ్జ్‌తో గడిపే ఆ అద్భుత క్షణాలు జీవితంలో మరచిపోలేవని అంటూ చెప్పుకొచ్చారు.

news18-telugu
Updated: September 18, 2019, 5:09 PM IST
గోల్ కన్నా ఆమెతో శృంగారమే మిన్న.. సాకర్ స్టార్ సంచలన వ్యాఖ్యలు
రొనాల్డో, రోడ్రిగ్జ్
news18-telugu
Updated: September 18, 2019, 5:09 PM IST
సాకర్ ప్లేయర్లకు గోల్ సాధించడం కన్నా మించిన ఆనందం ఇంకేముంటుంది. కానీ ఈ సాకర్ స్టార్ రూటే సెపరేటు. ఈయనకు గోల్ కన్నా శృంగారమే ఉన్నతమైనదట. పోర్చుగీస్ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫుట్‌బాల్ కెరీర్‌లో చేసిన అత్యుత్తమ గోల్ కన్నా.. తన లవర్‌తో చేసే సెక్సే బెస్ట్ అని చెప్పారు. ప్రేయసి జార్జినా రోడ్రిగ్జ్‌తో గడిపే ఆ అద్భుత క్షణాలు జీవితంలో మరచిపోలేవని అంటూ చెప్పుకొచ్చారు. ఐటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు రొనాల్డో.
క్రిస్టియానో రొనాల్డో

2018 ఏప్రిల్ రియల్ మాడ్రిడ్ జట్టు తరపున ఆడిన రొనాల్డో.. జువెంటస్ టీమ్‌పై అత్భుతమైన గోల్ సాధించాడు. రొనాల్డో కొట్టిన ఆ ఓవర్‌హెడ్ కిక్ గోల్ అతడి కెరీర్‌లోనే ది బెస్ట్ గోల్‌గా భావిస్తుంటారు. ఆ గోల్‌పై ఇంటర్వ్యూలో వ్యాఖ్యాతలు ప్రశ్నించగా ఆసక్తికరమైన సమాధానం చెప్పారు రొనాల్డో. తన గర్ల్‌ఫ్రెండ్‌తో పోల్చితే ఆ గోల్ అంత గొప్పదేమీ కాదని స్పష్టం చేశారు. కాగా, తన సాకర్ కెరీర్‌లో రొనాల్డో దాదాపు 800 గోల్స్ సాధించారు.

First published: September 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...