CRISTIANO RONALDO IS FIRST PERSON TO TOP 200 MILLION FOLLOWERS ON INSTAGRAM
Cristiano Ronaldo: సరిలేరు నీకెవ్వరు..సాకర్ దిగ్గజం సరికొత్త రికార్డు
క్రిస్టియానో రొనాల్డో(ఫైల్ ఫోటో)
ప్రపంచంలో అత్యధిక ఇన్‌స్టా ఫాలోవర్స్ కలిగిన వ్యక్తిగా సాకర్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో రికార్డు సృష్టించాడు. క్రిస్టియానో రొనాల్డోను 200 మిల్లియన్ల మంది ఇన్‌స్టాలో ఫాలో అవుతున్నారు. ఇన్‌స్టాలో పెయిడ్ పోస్టింగ్స్‌తో అత్యధిక ఆదాయం పొందుతున్న వ్యక్తికూడా రొనాల్డే.
పోర్చుగల్ సాకర్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ఫుట్‌బాల్ గ్రౌండ్‌కి బయట ఓ భారీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఇన్‌స్టాగ్రమ్‌లో 200 మిల్లియన్లకు పైగా ఫాలోవర్స్ కలిగిన తొలి వ్యక్తిగా అరుదైన ఘనత సాధించాడు. ప్రస్తుతం ఇన్‌స్టాలో ఇన్‌స్టాగ్రమ్ అధికారిక ఖాతా (330.5 మిల్లియన్ల ఫాలోవర్స్)కు మాత్రం రొనాల్డో వెనుకున్నాడు. ఈ సందర్భంగా తన ఫ్యాన్స్‌కు థ్యాంక్స్ చెబుతూ రొనాల్డో ఓ వీడియోను పోస్ట్ చేశారు. రొనాల్డో ప్రత్యర్థి లియోనల్ మెస్సీ 141.8 మిల్లియన్ల ఫాలోవర్లతో ఏడో స్థానంలో ఉన్నాడు. హాలీవుడ్ సింగర్ అరియానా గ్రాండే 173.1 మిల్లియన్ల ఫాలోవర్లతో రొనాల్డో తర్వాతటి స్థానంలో ఉన్నారు.
ఇన్‌స్టాగ్రమ్‌లో పెయిడ్ పోస్టింగ్స్ ద్వారా ప్రపంచంలో అత్యధిక సంపాదన పొందుతున్న వ్యక్తి కూడా క్రిస్టియానో రొనాల్డోనే. సాకర్ పోటీల్లో పాల్గొనడం ద్వారా వచ్చే ఆదాయం కంటే ఇన్‌స్టాలో పోస్టింగ్స్ ద్వారా వచ్చే ఆదాయమే ఎక్కువేనట. ప్రతియేటా సాకర్ పోటీల ద్వారా 34 మిల్లియన్ డాలర్లు ఆర్జిస్తుండగా...ఇన్‌స్టా ద్వారా రొనాల్డో 47.8 మిల్లియన్ డాలర్లు ఆర్జిస్తున్నట్లు సమాచారం. తన ఇన్‌స్టా ఖాతాలో చేసే ప్రతి పోస్టింగ్‌కు రొనాల్డోకు 1 మిల్లియన్ డాలర్లు ఆదాయం వస్తుందని ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. లియోనల్ మెస్సీ ప్రతియేటా ఇన్‌స్టాలో పెయిడ్ పోస్టింగ్స్ ద్వారా 23.3 మిల్లియన్ డాలర్లు సంపాదిస్తున్నట్లు ఫోర్స్బ్ తెలిపింది.
క్రిస్టియానో రొనాల్డొ (File Photo)
ఫేస్బుక్లో అత్యధిక లైక్స్ కలిగిన ప్రపంచ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డోనే కావడం విశేషం. రొనాల్డో ఫేస్బుక్ పేజీని 122.3 మిల్లియన్ల మంది లైక్ చేయగా...124.4 మిల్లియన్ల మంది ఫాలో అవుతున్నారు.
Published by:Janardhan V
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.