Home /News /sports /

CRISTIANO RONALDO FOOT BALL LEGEND CRISTIANO RONALDO STUNNING GOAL AGAINST TOTTENHAM AT EPL LATEST SEASON SJN

cristiano ronaldo: 75 అడుగుల దూరం నుంచి క్రిస్టియానో రొనాల్డో కళ్లు చెదిరే గోల్

క్రిస్టియానో రొనాల్డో (PC: MCU)

క్రిస్టియానో రొనాల్డో (PC: MCU)

cristiano ronaldo: ఫుట్ బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో శనివారం రెచ్చిపోయాడు. తనకే సాధ్యమయ్యే ఆటతో గోల్ ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో 37 ఏళ్ల వయసులో రొనాల్డో కొట్టిన ఓ గోల్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.

cristiano ronaldo: ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (EPL)లో పోర్చుగల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో రెచ్చిపోయాడు. పాత క్రిస్టియానో రొనాల్డోను గుర్తుకు తెచ్చేలా హ్యాట్రిక్ గోల్స్ తో సత్తా చాటాడు. గత పది మ్యాచ్ ల్లో ఒక్క గోల్ కూడా చేయలేకపోయిన 37 ఏళ్ల రొనాల్డో శనివారం టొటెన్ హామ్ (tottenham)తో జరిగిన మ్యాచ్ లో అదరగొట్టాడు.  ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ లో మాంచెస్టర్ యునైటెడ్ (Manchester United) టీం తరఫున ఆడుతోన్న రొనాల్డో మూడు గోల్స్ చేశాడు.  ఈ క్రమంలో 12వ నిమిషంలో చేసిన గోల్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. గోల్ పోస్ట్ కు దాదాపు 75 అడుగుల దూరం నుంచి క్రిస్టియానో రొనాల్డో సూపర్ స్ట్రయిక్ తో గోల్ చేసి అబ్బురపరిచాడు.

ఆట 12వ నిమిషంలో ఫ్రెడ్ ఇచ్చిన పాస్ ను అందుకున్న రొనాల్డో ప్రత్యర్థి డిఫెండర్లను తప్పిస్తూ గోల్ పోస్టుకు దాదాపు 75 అడుగుల దూరం నుంచి గోల్ చేసి పాత రొనాల్డోను గుర్తుకు తెప్పించాడు. గత కొంత కాలంగా రొనాల్డో ఫామ్ తో ఇబ్బంది పడుతున్నాడు. గతంలో లాగా గోల్స్ చేయలేకపోతున్నాడు. మైదానంలో వేగంగా కదులుతున్నా బంతిని గోల్ పోస్ట్ లోకి పంపలేకపోతున్నాడు. అయితే టొటెన్ హామ్ తో జరిగిన మ్యాచ్ లో కొత్త రొనాల్డోని పరిచయం చేశాడు. ఏకంగా మూడు గోల్స్ తో జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. రొనాల్డో గోల్ ను మీరూ చేసేయండి.



ఈ క్రమంలో మూడు గోల్స్ చేసిన రొనాల్డో ఫిఫా (FIFA) ఆల్ టైమ్ గోల్ స్కోరర్ గా నిలిచాడు. రొనాల్డో తన ఫుట్ బాల్ కెరీర్ (అంతర్జాతీయం+ లీగ్)లో 807 గోల్స్ తో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్ గా నిలిచాడు. గతంలో ఈ రికార్డు చెక్ రిపబ్లిక్ ప్లేయర్ జోసెఫ్ బికాన్ (805 గోల్స్) పేరిట ఉండేది. రొనాల్డో హ్యాట్రిక్ గోల్స్ తో క్రిస్టియానో రొనాల్డో కొత్త రికార్డును నెలకొల్పాడు. బికాన్ 1937 నుంచి 1948 మధ్య 805 గోల్స్ వేశాడు.

గత 10 మ్యాచ్ ల్లో ఒక్క గోల్ కూడా చేయని క్రిస్టియానో రొనాల్డో టొటెన్ హామ్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం అదరగొట్టాడు. ఏకంగా మూడు గోల్స్ తో హ్యాట్రిక్ చేశాడు.  క్రిస్టియానో రొనాల్డో ఆట 12వ, 38వ, 81వ నిమిషాల్లో గోల్స్ చేసి హ్యాట్రిక్ ను పూర్తి చేశాడు. టొటెన్ హామ్ తరఫున హ్యారీ కేన్ 35వ నిమిషంలో ఓ గోల్ చేయగా... 72వ నిమిషంలో హ్యారీ మెగ్వైర్ సెల్ఫ్ గోల్ తో టొటెన్ హామ్ కు రెండో గోల్ ను చేశాడు. 81వ నిమిషం వరకు కూడా రెండు జట్లు 2 2 గోల్స్ తో సమంగా నిలిచాయి. అయితే ఆట మరో 9 నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా రొనాల్డో... తన మ్యాజిక్ ను ప్రదర్శించాడు. సూపర్ గోల్ తో మాంచెస్టర్ యునైటెడ్ కు గోల్ ను అందించి సూపర్ విక్టరీని అందించాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Cristiano Ronaldo, FIFA, Football

తదుపరి వార్తలు