CRISTIANO RONALDO FOOT BALL LEGEND CRISTIANO RONALDO BREAKS JOSEF BICAN ALL TIME FIFA GOALS RECORD SJN
Cristiano Ronaldo: రొనాల్డో ఖాతాలో ఆల్ టైమ్ రికార్డు... 37 ఏళ్ల వయసులోనూ తగ్గేదే లే అంటోన్న స్టార్ ప్లేయర్
క్రిస్టియానో రొనాల్డో (ఫైల్)
Cristiano Ronaldo: దశాబ్దానికిపైగా ఫుట్ బాల్ ఆడుతూ తన కెరీర్ లో క్రిస్టియానో రొనాల్డో అనేక రికార్డులను అందుకున్నాడు. పీలే, మారిడోనా, రొనాల్డో (బ్రెజిల్)ల తర్వాత తన ఆటతో ఫుట్ బాల్ ఫ్యాన్స్ ను క్రిస్టియానో ఉర్రూతలు ఊగించాడనేది వాస్తవం. ఇప్పటికే అత్యధిక హ్యాట్రిక్స్, అత్యధిక అంతర్జాతీయ గోల్స్ తో పాటు మరెన్నో రికార్డులను సొంతం చేసుకున్న రొనాల్డో. తాజాగా అతడి ఖాతాలో మరో సూపర్ రికార్డు చేరింది.
Cristiano Ronaldo: ఫుట్ బాల్ గురించి మనకు ఏం తెలియక పోయినా... క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) పేరు మాత్రం చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే మనోడు ఫుట్ బాల్ (Foot Ball) కు మించి క్రేజ్ ను సంపాదించుకోవడమే. దశాబ్దానికిపైగా ఫుట్ బాల్ ఆడుతూ తన కెరీర్ లో అనేక రికార్డులను అందుకున్నాడు. పీలే, మారిడోనా, రొనాల్డో (బ్రెజిల్)ల తర్వాత తన ఆటతో ఫుట్ బాల్ ఫ్యాన్స్ ను క్రిస్టియానో ఉర్రూతలు ఊగించాడనేది వాస్తవం. ఇప్పటికే అత్యధిక హ్యాట్రిక్స్, అత్యధిక అంతర్జాతీయ గోల్స్ తో పాటు మరెన్నో రికార్డులను సొంతం చేసుకున్న రొనాల్డో. తాజాగా అతడి ఖాతాలో మరో సూపర్ రికార్డు చేరింది. ఇది అలాంటి ఇలాంటి రికార్డు కాదు ఆల్ టైమ్ రికార్డు
ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (EPL)లో భాగంగా శనివారం టొటెన్ హామ్ జట్టుతో మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్ బాల్ క్లబ్ తలపడింది. ఈ మ్యాచ్ లో మాంచెస్టర్ యునైటెడ్ టీంకు ప్రాతినిధ్యం వహిస్తోన్న రొనాల్డో హ్యాట్రిక్ గోల్స్ తో జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో మూడు గోల్స్ చేసిన రొనాల్డో ఫిఫా (FIFA) ఆల్ టైమ్ గోల్ స్కోరర్ గా నిలిచాడు. రొనాల్డో తన ఫుట్ బాల్ కెరీర్ (అంతర్జాతీయం+ లీగ్)లో 807 గోల్స్ తో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్ గా నిలిచాడు. గతంలో ఈ రికార్డు చెక్ రిపబ్లిక్ ప్లేయర్ జోసెఫ్ బికాన్ (805 గోల్స్) పేరిట ఉండేది. రొనాల్డో హ్యాట్రిక్ గోల్స్ తో క్రిస్టియానో రొనాల్డో కొత్త రికార్డును నెలకొల్పాడు. బికాన్ 1937 నుంచి 1948 మధ్య 805 గోల్స్ వేశాడు.
గత 10 మ్యాచ్ ల్లో ఒక్క గోల్ కూడా చేయని క్రిస్టియానో రొనాల్డో టొటెన్ హామ్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం అదరగొట్టాడు. ఏకంగా మూడు గోల్స్ తో హ్యాట్రిక్ చేశాడు. క్రిస్టియానో రొనాల్డో ఆట 12వ, 38వ, 81వ నిమిషాల్లో గోల్స్ చేసి హ్యాట్రిక్ ను పూర్తి చేశాడు. టొటెన్ హామ్ తరఫున హ్యారీ కేన్ 35వ నిమిషంలో ఓ గోల్ చేయగా... 72వ నిమిషంలో హ్యారీ మెగ్వైర్ సెల్ఫ్ గోల్ తో టొటెన్ హామ్ కు రెండో గోల్ ను చేశాడు. 81వ నిమిషం వరకు కూడా రెండు జట్లు 2 2 గోల్స్ తో సమంగా నిలిచాయి. అయితే ఆట మరో 9 నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా రొనాల్డో... తన మ్యాజిక్ ను ప్రదర్శించాడు. సూపర్ గోల్ తో మాంచెస్టర్ యునైటెడ్ కు గోల్ ను అందించి సూపర్ విక్టరీని అందించాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.