రేప్ కేసు నుంచి సాకర్ స్టార్ క్రిస్టియానో రోనాల్డోకు విముక్తి

Cristiano Ronaldo | పదేళ్ల క్రితంనాటి రేప్ కేసులో సాకర్ దిగ్గజం క్రిస్టియానో రోనాల్డోపై నేరాభియోగాలు నమోదు చేయలేమని లాస్ వెగాస్ కోర్టు స్పష్టంచేసింది.

news18-telugu
Updated: July 23, 2019, 10:59 AM IST
రేప్ కేసు నుంచి సాకర్ స్టార్ క్రిస్టియానో రోనాల్డోకు విముక్తి
క్రిస్టియానో రొనాల్డో(ఫైల్ ఫోటో)
  • Share this:
పదేళ్ల క్రితంనాటి రేప్ కేసు నుంచి సాకర్ దిగ్గజం క్రిస్టియానో రోనాల్డోకు విముక్తి లభించింది. 2009లో లాస్ వెగాస్ రిసార్టులోని తన సూట్‌లో క్రిస్టియానో రోనాల్డో తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఓ మహిళ ఆరోపించింది. దీనిపై దర్యాప్తు జరిపిన లాస్ వెగాస్ పోలీసులు...బాధితురాలు మయోర్గా రేప్ ఆరోపణలను నిరూపించే ఆధారాలేవీ కోర్టుకు సమర్పించలేకపోయారు. దీంతో ఈ కేసును కొనసాగించలేమని స్థానిక కోర్టు స్పష్టంచేసింది. నిందితుడిపై ఆరోపణలను నిరూపించేందుకు అవసరమైన ఆధారాలను పోలీసులు కోర్టుకు సమర్పించలేనందున... నిందితుడిపై నేరాభియోగాలు నమోదుచేయలేమని కోర్టు స్పష్టంచేసింది. కోర్టు తాజా రూలింగ్‌పై మాజీ మోడల్, స్కూల్ టీజర్ మయోర్గా లేదా ఆమె తరఫు న్యాయవాదులు స్పందించలేదు.

 

ప్రపంచ క్రీడాకారుల్లో అత్యధిక సంపాదనగడిస్తున్న ఆటగాళ్లలో ఒక్కడైన క్రిస్టియానో రోనాల్డోపై అప్పట్లో అత్యాచార ఆరోపణలు రావడం సంచలనం సృష్టించింది. 2009 జూన్‌లో పరస్పర ఆమోదంతో మయోర్గాతో రోనాల్డో లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు అంగీకరించిన ఆయన తరఫు న్యాయవాదులు..అయితే ఇది అత్యాచారం కాదని స్పష్టంచేశారు. ఈ కేసులో మయోర్గా నోరు మూయించేందుకు క్రిస్టియానో రోనాల్డో కోట్లాది రూపాయలు ఇవ్వజూపినట్లు గతంలో కథనాలు వెలువడ్డాయి.

First published: July 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>