Home /News /sports /

CRISTIANO RONALDO BREAKS INTERNATIONAL SCORING RECORD WITH 111 GOALS CROSSED ALI DAEI JNK

Ronaldo Goals Record: ఫుట్‌బాల్ చరిత్రలో అత్యధిక గోల్స్ రికార్డు సొంతం చేసుకున్న క్రిస్టియానో రొనాల్డో

అత్యధిక అంతర్జాతీయ గోల్స్ చేసిన ఫుట్‌బాలర్‌గా రొనాల్డో రికార్డు (PC: AP)

అత్యధిక అంతర్జాతీయ గోల్స్ చేసిన ఫుట్‌బాలర్‌గా రొనాల్డో రికార్డు (PC: AP)

అంతర్జాతీయ గోల్స్‌లో దిగ్గజ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో రికార్డు సృష్టించాడు. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రొనాల్డో 2 గోల్స్ చేయడంతో మొత్తం గోల్స్ సంఖ్య 111కు చేరింది. ఇరాన్ ఆటగాడు అలీ దాయ్ 109 గోల్స్ చేయగా.. ఇప్పుడు అత్యధిక గోల్స్ చేసిన ఫుట్‌బాలర్‌గా రొనాల్డో రికార్డులకు ఎక్కాడు.

ఇంకా చదవండి ...
    ఫుట్‌బాల్ (Football) చరిత్రలో ఒక దేశం తరపున ఆడి అత్యధిక అంతర్జాతీయ గోల్స్ (International Goals) చేసిన ఆటగాడిగా క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) రికార్డు సృష్టించాడు. ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup) క్వాలిఫయింగ్ మ్యాచ్ బుధవారం రాత్రి (భారత కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున) రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పోర్చుగల్ (Portugal) కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో రెండు గోల్స్ కొట్టాడు. ఇది అతడి అంతర్జాతీయ కెరీర్‌లో 110, 111వ గోల్ కావడం గమనార్హం. ఈ రెండు గోల్స్‌తో పోర్చుగల్‌ను 2-1తో గెలిపించడమే కాకుండా.. చరిత్రలో అత్యధిక అంతర్జాతీయ గోల్స్ సాధించిన ఫుట్‌బాల్‌గా రికార్డు సృష్టించాడు. 1993 నుంచి 2006 వరకు ఇరాన్ తరపున ఆడిన అలీ దాయ్ 109 గోల్స్ చేశాడు. ఇటీవల యూరో కప్ 2020లో ఫ్రాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసిన క్రిస్టియానో రొనాల్డో.. అలీ దాయ్ రికార్డును సమం చేశాడు. తాజాగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు గోల్స్ చేయడం ద్వారా అలీదాయ్‌ను దాటేసి ఏకైక ఫుట్‌బాలర్‌గా నిలిచాడు.

    ఇలా కొట్టాడు..

    పోర్చుగల్‌లోని అల్‌గర్వే స్టేడియంలో ఐర్లాండ్-పోర్చుగల్ మధ్య వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ 15వ నిమిషంలో వచ్చిన పెనాల్టీని రొనాల్డో గోల్‌గా మలచలేకపోయాడు. అయితే 45వ నిమిషంలో ఐర్లాండ్ ఆటగాడు ఇగాన్ గోల్ చేసి జట్టుకు ఆధిక్యత తీసుకొని వచ్చాడు. రెండో అర్ద భాగంలో ఐర్లాండ్ గట్టి పోటీని ఇచ్చింది. పోర్చుగల్ జట్టు గోల్స్ కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మ్యాచ్ మరో నిమిషంలో ముగుస్తుందనగా 89వ నిమిషంలో క్రిస్టియానో రొనాల్డో హెడర్‌తో గోల్ కొట్టాడు. అదననపు సమయం 90+6 నిమిషంలో మరో హెడర్‌తో ఇంకో గోల్ చేశాడు. దీంతో ఆఖరి నిమిషాల్లో రెండు గోల్స్ చేసి 2-1తో పోర్చుగల్ విజయం సాధించింది. తన కెరీర్‌లో ఆఖరు 15 నిమిషాల్లో రొనాల్డో 33 గోల్స్ చేశాడు. ఐర్లాండ్ మీదే రెండు సార్లు ఇలా గోల్స్ సాధించాడు. ఇక 61 నుంచి 75 నిమిషాల మధ్య 22 గోల్స్ కొట్టాడు. మరోవైపు ఇదే మ్యాచ్ ద్వారా పోర్చుగల్ తరపున అత్యధిక మ్యాచ్‌లు (180) ఆడిన సెర్జియో రామోస్ రికార్డును రొనాల్డో సమం చేశాడు.





    రొనాల్డోనే రారాజు..

    అంతర్జాతీయ గోల్స్ విషయంలో గతంలో కొంత గందరగోళం ఉన్నది. అయితే వాటిని ఫిఫా ఈ ఎండాకాలంలోనే సర్దుబాటు చేసింది. గత రికార్డులు అన్నీ పరిశీలించి అందరి గోల్స్‌ను లెక్కించింది. ప్రస్తుతం ఫిఫా రికార్డుల ప్రకారం రొనాల్డో 180 మ్యాచ్‌లలో 111 గోల్స్‌తో టాపర్‌గా ఉన్నాడు. ఇరాన్‌కు చెందిన అలీ దాయ్ 149 మ్యాచ్‌లలోనే 109 గోల్స్ సాధించి రెండో స్థానంలో, మలేషియాకు చెందిన మొక్తర్ దహరి 142 మ్యాచ్‌లలో 89 గోల్స్ చేశాడు. మరోవైపు క్లబ్ మ్యాచ్‌లలో కూడా అత్యధిక గోల్స్ రికార్డు రొనాల్డో పేరుతోనే ఉన్నది. ఇటీవలే జువెంటస్ నుంచి మాంచెస్టర్ యునైటెడ్‌కు మారిన రొనాల్డో యూరోపియన్ చాంపియన్‌షిప్‌లో 14, యూరో కప్ 21, వరల్డ్ కప్‌లో 21 గోల్స్‌తో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. రొనాల్డో మొత్తం అంతర్జాతీయ గోల్స్ ఇలా వచ్చాయి.

    వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ - 33 గోల్స్
    యూరోపియన్ చాంపియన్‌షిప్ క్వాలిఫయర్స్ - 31
    అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్‌లు - 19
    యూరోపియన్ చాంపియన్‌షిప్ - 14
    వరల్డ్ కప్ - 7
    యూఈఎఫ్ఏ నేషన్స్ లీగ్ - 5
    కాన్ఫెడరేషన్ కప్ - 2

    Ravi Shastri Vs Ganguly: హెడ్ కోచ్ రవిశాస్త్రి, బీసీసీఐ చీఫ్ గంగూలీ మధ్య విభేదాలు..? ఇద్దరి మధ్య ఏం జరిగింది?


     

    Published by:John Naveen Kora
    First published:

    Tags: Cristiano Ronaldo, FIFA, Football

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు