హోమ్ /వార్తలు /క్రీడలు /

రషీద్ ఖాన్ ఇల్లు చూసి అవాక్కవుతున్న క్రికెటర్లు.. ఆ ప్యాలెస్ చూసి మహిళా క్రికెటర్ బుగ్గలు ఎర్రబడ్డాయి..

రషీద్ ఖాన్ ఇల్లు చూసి అవాక్కవుతున్న క్రికెటర్లు.. ఆ ప్యాలెస్ చూసి మహిళా క్రికెటర్ బుగ్గలు ఎర్రబడ్డాయి..

వావ్.. వాటే ప్యాలెస్

వావ్.. వాటే ప్యాలెస్

  ఆఫ్గానిస్తాన్ (Afghanisthan) మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్ (Rashid Khan) అత్యంత బిజీగా ఉండే అంతర్జాతీయ క్రికెటర్. ఒక వైపు జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తుంటూనే పలు దేశాల్లో జరిగే క్రికెట్ లీగ్స్‌లో పాల్గొంటుంటాడు. ఐపీఎల్‌తో (IPL 2021) పాటు కరేబియన్ ప్రీమియర్ లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగ్, బిగ్‌బాష్ లీగ్, ఆఫ్గనిస్తాన్ ప్రీమియర్ లీగ్ వంటి టోర్నీలో రెగ్యులర్‌గా ఆడుతుంటాడు. ఐపీఎల్‌లో 2017 నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న రషీద్ ఖాన్ ఈ ఏడాది కూడా లీగ్ కోసం ఇండియా వచ్చాడు. అయితే అర్దాంతరంగా ఐపీఎల్ వాయిదా పడటంతో రషీద్ ఖాన్ దుబాయ్ మీదుగా ఆప్గానిస్తాన్ వెళ్లిపోయాడు. తాజాగా తన ఇంటికి చేరుకున్న రషీద్ ఖాన్ తన ఇంటిలో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఒక రాజగారి ప్యాలెస్‌లా (Palace) ఉన్న ఆ ఇంటిని చూసి అభిమానులే కాకుండా క్రికెటర్లు కూడా అవాక్కయ్యారు. ఒక పెద్ద ప్యాలెస్‌లా కనిపిస్తున్న ఆ ఇంటిని చూసి ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ డానియల్ వ్యాట్ అయితే ఆర్చర్యపోయింది. వాటే ప్యాలెస్ అంటూ బ్లషింగ్ (ఎర్రని బుగ్గలు) ఎమోజీ ఇచ్చింది. అంతే కాకుండా సన్‌రైజర్స్‌లో సహచర ఆటగాడు ఖలీల్ అహ్మద్ కూడా మాషా అల్లా అంటూ రిప్లై ఇచ్చాడు. ఇక వెటరన్ స్పిన్నర్ హర్బజన్ సింగ్ అయితే ఆ ఇంటికి సంబంధించి మరిన్ని ఫొటోలు పెట్టాలని కోరాడు. ప్రస్తుతం రషీద్ ఖాన్ ప్యాలెస్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నది.

  ఇక ఆఫ్గానిస్తాన్ చేరుకున్న రషీద్ ఖాన్.. 'ఈ విపత్కర పరిస్థితుల్లో అందరూ ఇంట్లోనే సురక్షితంగా ఉండాలి.. అందరూ మాస్కు ధరించి భౌతిక దూరం పాటించాలి' అని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. ప్రస్తుతం రంజాన్ నెల కావడంతో అందరికీ శుభాకాంక్షలు తెలిపాడు.


  View this post on Instagram


  A post shared by Rashid Khan (@rashid.khan19)  రషీద్ ఖాన్ ఈ ఏడాది ఐపీఎల్‌లో మొత్తం 7 మ్యాచ్‌లు ఆడి 10 వికెట్లు తీశాడు. టాప్ ఫైవ్ వికెట్ టేకర్లలో ఒకడిగా ఉన్న రషీద్ ఖాన్ సగటు అందరి కంటే మెరుగుగా 6.14 ఉంది. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏడు మ్యాచ్‌లలో ఆరు మ్యాచ్‌లు ఓడిపోయి టేబుల్‌లో అట్టడుగున నిలిచింది. రషీద్ ఖాన్ బౌలింగ్ ప్రదర్శన బాగానే ఉన్నా.. అతడికి తోడుగా వికెట్లు తీసే మరో బౌలర్ కరువయ్యాడు. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓటములు కొని తెచ్చుకున్నది. ఐపీఎల్‌లో మిగిలిన సీజన్ పూర్తి చేయాలని బీసీసీఐ భావిస్తుండటంతో రషీద్ ఖాన్‌ను మరోసారి సన్‌రైజర్స్ జెర్సీలో చూసే అవకాశం ఉన్నది. యూఏఈ లేదా ఇంగ్లాండ్ వేదికల్లో సెప్టెంబర్ నెలలో ఐపీఎల్ నిర్వహించే అవకాశం ఉన్నది.

  Published by:John Kora
  First published:

  Tags: Afghanistan, Cricket, IPL 2021, Rashid Khan, Sunrisers Hyderabad

  ఉత్తమ కథలు