Home /News /sports /

CRICKETERS IN POLITICS ACCORDING REPORTS AMBATI RAYUDU AND VENU GOPAL RAO ARE READY TO ACTIVE AP POLITICS SRD

Cricketers in Politics : ఏపీ నుంచి పొలిటికల్ గేమ్ ఆడటానికి సై అంటోన్న ఇద్దరు తెలుగు క్రికెటర్లు.. ఎవరంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Cricketers in Politics : ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉన్నా.. మన తెలుగు రాష్ట్రాల్లో తక్కువనే చెప్పాలి. టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ తప్ప.. మిగతావారు రాజకీయాలపై అంతగా ఆసక్తి చూపలేదు. . టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కాంగ్రెస్ పార్టీలో పని చేశారు. ఎంపీగా కూడా ఎన్నికయ్యారు.

ఇంకా చదవండి ...
    ఈ మధ్యకాలంలో సినిమా ప్రముఖులు, క్రికెటర్లు (Cricket) రావడం అనేది కామన్ గా మారిపోయింది. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా క్రికెటర్లు రాజకీయాల మీద ఆసక్తి చూపిస్తున్నారు అనేది ఉత్తరాది రాష్ట్రాలు చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్న పలువురు మాజీ క్రికెటర్లు ఇప్పుడు వివిధ పార్టీల తీర్దాలు పుచ్చుకున్న సంగతి తెలిసిందే. మాజీ క్రికెటర్ సిద్ధూ, మనోజ్ తివారి, గౌతమ్ గంభీర్.. లేటెస్ట్ గా హర్భజన్ సింగే (Harbhajan Singh) ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యాలు. హర్భజన్ సింగ్ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నాడు. ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా ఆయన రాజకీయాల్లోకి వస్తాడు. రాజ్యసభకు ఆయన్ని పంపించబోతోంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉన్నా.. మన తెలుగు రాష్ట్రాల్లో తక్కువనే చెప్పాలి. టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ తప్ప.. మిగతావారు రాజకీయాలపై అంతగా ఆసక్తి చూపలేదు. . టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కాంగ్రెస్ పార్టీలో పని చేశారు. ఎంపీగా కూడా ఎన్నికయ్యారు. ఇప్పుడాయన రాజకీయాలకు ఒకింత దూరంగా వున్నారనుకోండి. అది వేరే సంగతి.

    ఇక, లేటెస్ట్ గా ఓ హాట్ టాపిక్ తెలుగు రాజకీయాల్లో నడుస్తోంది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలుగు క్రికెటర్లు పొలిటికల్ గేమ్ ఆడటానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో టీమిండియా మాజీ క్రికెటర్ వేణుగోపాల రావు రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. జనసేన పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి కొన్నాళ్ళపాటు యాక్టివ్‌గానే వున్నాడాయన. అయితే, ఈ మధ్య మళ్ళీ రాజకీయాల్లో ఎక్కడా ఆయన కనిపించలేదు.

    Hambati rayudu,priyanka reddy murder,priyanka reddy rape,shadnagar rape,అంబటి రాయుడు,ప్రియాంక రెడ్డి,ప్రియాంక రెడ్డి రేప్,ప్రియాంక రెడ్డి హత్యాచారం,షాద్ నగర్ హత్యాచార ఘటన
    అంబటి రాయుడు (Image : Twitter)


    వేణు గోపాల రావు తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అవుతారనీ, జనసేన నుంచే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వుందని తాజాగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆంధ్రాకే చెందిన మరో క్రికెటర్ అంబటి రాయుడిని రాజకీయాల్లోకి తెచ్చేందుకు ఏపీలోని రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

    వేణుగోపాల రావు


    అంబటి రాయుడు కూడా వేణు గోపాలరావులానే టీమిండియాకి ప్రాతినిథ్యం వహించాడు. దురదృష్టవశాత్తూ అంబటి రాయుడికి కూడా వేణుగోపాలరావులాగానే సరైన అవకాశాలు రాలేదన్నది అయితే, ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడిన రాయుడు అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇక, లేటెస్ట్ గా ఐపీఎల్‌ మెగా వేలంలో రాయుడుని చెన్నై రూ.6.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ మరో రెండు నెలలు పాటు అభిమానులకు కిక్ ఇవ్వనుంది. దీంతో, అంబటి రాయుడు పొలిటికల్ ఎంట్రీపై ఈ మెగా లీగ్ తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Ambati rayudu, Andhra Pradesh, AP Politics, Chennai Super Kings, Cricket, IPL 2022

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు