మాజీ క్రికెటర్ యువరాజ్ సంచలన ఆరోపణలు

Yuvraj Singh | తాను హఠాత్తుగా ఎందుకు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాననే విషయంపై యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

news18-telugu
Updated: September 27, 2019, 11:49 AM IST
మాజీ క్రికెటర్ యువరాజ్ సంచలన ఆరోపణలు
యువరాజ్ సింగ్ (BCCI / twitter )
news18-telugu
Updated: September 27, 2019, 11:49 AM IST
ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేని మాజీ క్రికెటర్ యువరాజ్ కొద్ది నెలల క్రితమే రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏజ్ పెరగడంతో పాటు జట్టు తరపున ఆడే అవకాశాలు రాకపోవడంతో యువరాజ్ సడన్‌గా తన రిటైర్మెంట్‌ను అనౌన్స్‌ చేశాడు. కనీసం వీడ్కోలు మ్యాచ్ కూడా ఆడకుండానే యువరాజ్ రిటైర్మెంట్ ప్రకటించడంపై ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే తన క్రికెట్ కెరీర్ సంతృప్తికరంగా సాగిందంటూ రిటైర్మెంట్ సందర్భంగా యువీ ప్రకటించడంతో... యువీ మనస్పూర్తిగానే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడని అంతా భావించారు. తాజాగా యువరాజ్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ ఫ్యాన్స్‌లో కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

ఛాంపియన్స్ ట్రోఫీ, వెస్టిండీస్ పర్యటనలో దాదాపు 8-9 మ్యాచ్‌లాడిన నేను రెండు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌ అవార్డులు అందుకున్నానని... అయినప్పటికీ తనపై వేటు పడుతుందని ఊహించలేదని యువీ కామెంట్ చేశారు. గాయం తర్వాత శ్రీలంకతో సిరీస్‌కి సిద్ధమవుతున్నానని టీమిండియా మేనేజ్‌మెంట్‌కి సమాచారం ఇచ్చారని వివరించాడు. అయితే హఠాత్తుగా తన విషయంలో యో-యో ఫిట్‌నెస్ టెస్టు తెరపైకి రావడం ఆశ్చర్యం కలిగించిందని... 36 ఏళ్ల వయసులోనూ శ్రమించి ఈ టెస్ట్ పాసయ్యానని అన్నాడు. అయితే తాను పాసవుతానని ఊహించని టీమిండియా మేనేజ్‌మెంట్.. తనను పక్కన పెట్టారని యువీ అన్నాడు.


First published: September 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...