వేణు మాధవ్ మృతితో దిగ్భ్రాంతికి గురైన టీమిండియా క్రికెటర్..

Yusuf Pathan on Venu Madhav Demise : క్రికెటర్ యూసుఫ్ పఠాన్ వేణు మాధవ్ మృతి గురించి ట్వీట్ చేయడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది.వేణు మీకు తెలుసా..? అంటూ చాలామంది నెటిజెన్స్ ట్విట్టర్‌లో ఆయన్ను ప్రశ్నిస్తున్నారు.

news18-telugu
Updated: September 27, 2019, 10:15 AM IST
వేణు మాధవ్ మృతితో దిగ్భ్రాంతికి గురైన టీమిండియా క్రికెటర్..
వేణు మాధవ్,యూసుఫ్ పఠాన్
news18-telugu
Updated: September 27, 2019, 10:15 AM IST
ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ మృతిపై టీమిండియా క్రికెటర్ యూసుఫ్ పఠాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వేణు మాధవ్ మృతి వార్త షాకింగ్‌గా అనిపించిందన్నారు. వెండి తెరపై వేణు లాంటి హాస్య నటుడిని ఇంకెవరూ భర్తీ చేయలేరని.. తాను చూసినవాళ్లలో వేణు ఉత్తమ కమెడియన్ అని ప్రశంసించారు.వేణు కుటుంబ సభ్యులకు,స్నేహితులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.క్రికెటర్ యూసుఫ్ పఠాన్ వేణు మాధవ్ మృతి గురించి ట్వీట్ చేయడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది.వేణు మీకు తెలుసా..? అంటూ చాలామంది నెటిజెన్స్ ట్విట్టర్‌లో ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. బహుశా వేణు నటించిన డబ్బింగ్ సినిమాలను పఠాన్ చూసి ఉండవచ్చునని కొంతమంది భావిస్తున్నారు. తెలుగు డబ్బింగ్ సినిమాలకు హిందీలో చాలా పాపులారిటీ ఉండటంతో.. అలా వేణు ఉత్తరాదివాళ్లకు కూడా దగ్గరై ఉంటాడని అంటున్నారు.

కాగా,హైదరాబాద్ మౌలాలి స్మశాన వాటికలో కుటుంబ సభ్యులు,అభిమానుల అశ్రునయనాల మధ్య వేణుమాధవ్ అంత్యక్రియలు ముగిశాయి.అంతకుముందు అభిమానుల సందర్శనార్థం మా అసోసియేషన్ ఆధ్వర్యంలో వేణుమాధవ్ భౌతికకాయాన్ని ఫిల్మ్ ఛాంబర్‌లో ఉంచారు. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు వేణుమాధవ్‌కు నివాళులర్పించారు.
First published: September 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...