బిగ్‌బాస్ విజేత దీపికపై శ్రీశాంత్ ఫైర్.. సోషల్ మీడియా వేదికగా వార్

బిగ్‌బాస్‌ సీజన్ 12 విజేత దీపిక కక్కర్, క్రికెటర్ శ్రీశాంత్‌ల మధ్య వివాదం చెలరేగింది. సోషల్ మీడియా వేదికగా సోషల్ మీడియానే ప్రధానాంశంగా వీరి గొడవ ముదిరింది. తాజాగా, దీపికపై అగ్గిమీద గుగ్గిలమయ్యాడు శ్రీశాంత్.

news18-telugu
Updated: February 13, 2019, 7:20 PM IST
బిగ్‌బాస్ విజేత దీపికపై శ్రీశాంత్ ఫైర్..  సోషల్ మీడియా వేదికగా వార్
దీపిక కక్కర్, శ్రీశాంత్ ఫైల్
  • Share this:
బిగ్‌బాస్ సీజన్ 12లో పాల్గొన్న వీరిద్దరూ ఒకరికొకరు అండగా నిలిచారు. అనంతరం ఈ షోలో దీపిక విజేతగా నిలవడగా, శ్రీశాంత్ రన్నరప్‌గా నిలిచాడు. అప్పట్నుంచీ వీరిద్దరి మధ్య వివాదం చెలరేగింది. అయితే, వీరిద్దరి మధ్యా వివాదానికి తెరలేచింది సోషల్ మీడియాలోనే. బిగ్‌బాస్ సీజన్ 12 ముగిసిన తర్వాత సోషల్ మీడియాలో శ్రీవాంత్‌పైనా, అతని భార్య భువనేశ్వరిపైనా అసభ్యకర కామెంట్లు వచ్చాయి. దీంతో కోపం తెచ్చుకున్న శ్రీశాంత్ సోషల్‌మీడియాలో అన్‌ఫాలో కావడం ద్వారా దీపికను దూరం పెట్టాడు. ఇదే అంశంపై తాజాగా మీడియాతో మాట్లాడిన శ్రీశాంత్.. తాను దీపికను సోషల్ మీడియాలో అన్‌ఫాలో అయ్యానని చెప్పారు. అయితే, అందుకు కారణం దీపిక తన భార్య భువనేశ్వరిని ఫాలో కావడమేనని చెప్పారు. తన భార్య భువనేశ్వరే తన శక్తి అని.. దీపిక అభిమానులు తనను, తన భార్యను నోటికొచ్చినట్లు దుర్భాషలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్యను ఎవరైనా తిడితే సహించలేనని, అందుకే దీపికను అన్‌ఫాలో అయ్యానని స్పష్టం చేశారు.

‘‘గతంలో నా అభిమానులు దీపికపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినప్పుడు.. నేను వారిని హెచ్చరించాను. అయితే, దీపిక మాత్రం నా భార్యను సోషల్ మీడియాలో కొందరు తిడుతుంటే ఒక్కమాటైనా మాట్లాడలేదు. వారికి చెప్పలేదు. ఈ విషయంపై దీపికతో చర్చించాలనుకోవట్లేదు. నా తప్పేం లేదని చెప్పేందుకే అసలు విషయం బయటపెడుతున్నా‘‘ నని శ్రీశాంత్ చెప్పారు.

ఇది కూడా చూడండి:



Published by: Santhosh Kumar Pyata
First published: February 13, 2019, 7:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading