అల్లు అర్జున్ స్థానంలో ఎంట్రీ ఇస్తున్న ధోనీ... బన్నీకి ఎసరు పెడుతున్న తలైవా...
‘బల్బీర్ సింగ్’ అనే సిక్కు యువకుడిలా మీసాలు, గెడ్డాలతో సరికొత్త గెటప్‌లో కనిపిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ... త్వరలోనే అన్ని భాషల్లో రానున్న మాహీ యాడ్...

అల్లు అర్జున్ స్థానంలో ఎంట్రీ ఇస్తున్న ధోనీ... బన్నీకి ఎసరు పెడుతున్న తలైవా...
- News18 Telugu
- Last Updated: April 19, 2019, 10:02 AM IST
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ టైమ్ ఇప్పుడు ఎలా నడుస్తుందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఎంతో కష్టపడి, ఇష్టపడి చేసిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా పరాజయం చెందడంతో సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న అల్లు అర్జున్... రెండు సినిమాలను పట్టాల మీదకు తెస్తున్నట్టు తన పుట్టినరోజున ప్రకటించాడు. ‘ఓ మై ఫ్రెండ్’, ‘ఎమ్.సీ.ఏ’ వంటి సినిమాలను తెరకెక్కించిన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్ - కనబడుట లేదు’ సినిమాతో పాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ వంటి హిట్స్ తర్వాత ఈ స్టైలిష్ కాంబోలో వస్తున్న మూడో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రతీ ఏడాది చేతినిండా సినిమాలతోనే కాకుండా వ్యాపార ప్రకటనలు కూడా చేస్తూ యమా బిజీగా ఉండేవాడు బన్నీ. అయితే ఈ సారి బాగా గ్యాప్ తీసుకున్నాడు. ఈ గ్యాప్‌లో ఆయన చేసిన యాడ్స్ కూడా చేతులు మారుతున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘ఫ్రూటీ’ తో పాటు ‘రెడ్‌బస్’ యాప్‌కు ప్రచారకర్తగా వ్యవహారిస్తున్న సంగతి తెలిసిందే. అయితే త్వరలోనే ఈ బ్రాండ్ అంబాసిడర్ మారబోతున్నాడు.
భారత క్రికెట్ మాజీ సారథి, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ... త్వరలో రెడ్‌బస్ యాప్ ప్రకటనల్లో కనిపించబోతున్నాడు. ఈ విషయాన్ని రెడ్‌బస్ సంస్థ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ‘బల్బీర్ సింగ్’ అనే సిక్కు యువకుడిలా మీసాలు, గెడ్డాలతో సరికొత్త గెటప్‌లో కనిపిస్తున్నాడు మహేంద్ర సింగ్ ధోనీ. క్రికెట్ కెప్టెన్‌గా కాకుండా హాకీ జట్టు కెప్టెన్‌గా ప్రకటనల్లో కనిపించబోతున్నాడు ధోనీ. ‘మహేంద్ర సింగ్ ధోనీ లాంటి గొప్ప క్రికెటర్, తమ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండడం చాలా గర్వంగా, గౌరవంగా ఉంది. అన్ని భాషల్లోనూ మాహీ కనిపించబోతున్నారు’ అంటూ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది రెడ్‌బస్.
అల్లు అర్జున్‌కు తెలుగుతో పాటు మలయాళ చిత్రసీమలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే అతని క్రేజ్ కేవలం రెండు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైంది. అదే మహేంద్ర సింగ్ ధోనీకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. తమిళనాడు రాష్ట్రంతో పాటు దేశంలో మాహీకి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మహేంద్ర సింగ్ ధోనీ లేకపోతే క్రికెట్ కూడా చూడం... అని భీష్మించుకు కూర్చుంటారు ఆయన వీరాభిమానులు. అలాంటి మాహీని బ్రాండ్ అంబాసిడర్‌గా తీసుకురావడం వల్ల, తన సంస్థకు పాపులారిటీ తీసుకురావాలని భావిస్తోంది రెడ్‌బస్. ఇప్పటికే 10కి పైగా యాడ్స్‌తో అత్యధిక పారితోషికం సంపాదిస్తున్న క్రికెటర్‌గా కొనసాగుతున్న మహేంద్ర సింగ్ ధోనీ ఖాతాలో మరో సంస్థ చేరింది. అయితే థియేటర్లో సినిమాలు వచ్చే దాకా, కనీసం యాడ్స్లోనైనా అల్లు అర్జున్ను చూసుకుందాం... అనుకున్న బన్నీ ఫ్యాన్స్‌కు కూడా ‘తలైవా’ ధోనీ రూపంలో చిన్న షాక్ తగిలినట్టైంది.

Here's our Iconic Cool Hockey Captain! Presenting Dhoni in an amazing new avatar as Balbir Singh #BalbirSingh #MSDhoni #redBus #MSD pic.twitter.com/6Bprv3QCGk
— redBus (@redBus_in) April 15, 2019
అజ్ఞాతవాసిగా మారుతున్న అల్లు అర్జున్.. అసలు కారణం అదే..
మహేశ్ బాబు అల్లు అర్జున్‌కు సైడ్ ఇచ్చాడా ? కాంప్రమైజ్ అయ్యారా ?
అలరిస్తోన్న అల్లు అర్జున్ అలవైకుంఠపురంలో టీజర్..
ఆ ఇద్దరు హీరోల ధాటిని తట్టుకోలేకపోతున్న రజినీకాంత్..
అలవైకుంఠపురంలో డిజిటల్, శాటిలైట్ రైట్స్ ఎవరికో తెలుసా..
అల్లు అర్జున్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. అల వైకుంఠపురములో టీజర్ వచ్చేస్తుంది..