news18
Updated: November 13, 2020, 10:39 AM IST
ప్రతీకాత్మక చిత్రం
- News18
- Last Updated:
November 13, 2020, 10:39 AM IST
వరుసగా రెండోసారి, మొత్తంగా ఐదోసారి ఐపీఎల్ కప్ గెలిచి.. ఆనందంతో స్వదేశానికి తిరిగివస్తున్న భారత క్రికెట్ ఆటగాడు కృనాల్ పాండ్యా (ముంబయి ఇండియన్స్) కు ఊహించని చేదు అనుభవం ఎదురైంది. ముంబయి విమానాశ్రయంలో కృనాల్ ను సుమారు నాలుగు గంటల పాటు నిలిపేశారు. దుబాయ్ నుంచి వస్తున్న అతడు తీసుకొస్తున్న పలు వస్తువులకు అనుమతుల్లేవనే ఆరోపణతో విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులు పాండ్యాను అక్కడే నిలిపి ఉంచారు. పాండ్యాతో అతడి భార్య కూడా ఉంది. అసలేం జరిగింది..? పాండ్యా దుబాయ్ నుంచి ఏం తీసుకొచ్చారు.
ఐపీఎల్ ముగిసిన వెంటనే హర్థిక్ పాండ్యా ఆస్ట్రేలియా సిరీస్ కోసం సిడ్నీ వెళ్లగా.. కృనాల్ మాత్రం ఇంటికే తిరిగివచ్చాడు. ప్రత్యేక విమానంలో ముంబయి ఎయిర్ పోర్టుకు చేరుకున్న అతడిని డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు అడ్డగించారు. కృనాల్ వెంట ఆయన బార్య కూడా ఉన్నారు. కృనాల్.. దుబాయ్ నుంచి అత్యంత విలువైన నాలుగు వాచ్ లు తీసుకొస్తున్నాడనే సమచారంతో డీఆర్ఐ అధికారులు పాండ్యాను అడ్డగించారు. వాటికి అనుమతులు చూపించాలని అతడిని విచారించారు.
అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. పాండ్యా దుబాయ్ లో రెండు రోలెక్స్, రెండు అడెమర్ పైగట్ వాచ్ లు కొన్నాడట. వాటి విలువ రూ. 75 లక్షల పైమాటే అని సమాచారం. వాటితో పాటు కొంత బంగారం కూడా తీసుకొస్తున్నట్టు తెలిసింది. అయితే ఈ వస్తువులను ఇండియాకు తీసుకురావడానికి అనుమతులు చూపించాలని అధికారులు పాండ్యాను కోరారు.
కాగా.. ప్రస్తుతానికైతే పాండ్యా దంపతులను ఇంటికి పంపించామని.. కానీ తాము స్వాధీనం చేసుకున్న వస్తువులను మాత్రం తమ దగ్గరే ఉంచుకున్నామని తెలిపారు. ఇందుకు సంబంధించి షోకాజ్ నోటీసులు జారీ చేశామని.. వీటికి సరైన ధ్రువ పత్రాలు లేకుంటే వాటిని సీజ్ చేస్తామని హెచ్చరించారు. పాండ్యా ఆ వస్తువులకు సంబంధించిన ఆధారాలు చూపకుంటే.. వాటిని కోల్పోవడమే గాక.. జరిమానా కూడా కట్టవలసి ఉంటుందని సమాచారం. ఐపీఎల్ 2020 నెగ్గిన ముంబయి ఇండియన్స్ టీంలో కృనాల్ కూడా సభ్యుడు.
Published by:
Srinivas Munigala
First published:
November 13, 2020, 10:39 AM IST