ఆ హీరోయిన్‌తో డేటింగ్‌ చేస్తున్న టీమిండియా క్రికెటర్..

అథియా గానీ,రాహుల్ గానీ ఇప్పటివరకు తమ మధ్య అలాంటిదేమీ లేదని చెప్పలేదు. దీంతో ఇద్దరి మధ్య 'సమ్‌థింగ్ సమ్‌థింగ్' అన్న ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.

news18-telugu
Updated: October 5, 2019, 5:53 PM IST
ఆ హీరోయిన్‌తో డేటింగ్‌ చేస్తున్న టీమిండియా క్రికెటర్..
కేఎల్ రాహుల్,అథియా శెట్టి
news18-telugu
Updated: October 5, 2019, 5:53 PM IST
టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ బాలీవుడ్ నటి అథియా శెట్టితో డేటింగ్‌లో ఉన్నాడని చాలాకాలంగా రూమర్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఆ రూమర్స్‌పై వీరిద్దరు ఎప్పుడూ స్పందించలేదు.కానీ తాజాగా వీరిద్దరు 'డిన్నర్ డేట్' కోసం వెళ్లి మీడియా కెమెరాలకు చిక్కారు. దీంతో ఈ ఇద్దరి ప్రేమాయణం నిజమేనన్న చర్చ జరుగుతోంది.ముంబైలోని ఓ ప్రముఖ హోటల్లో డిన్నర్ చేసేందుకు వెళ్లిన అథియా,రాహుల్.. హోటల్ నుంచి బయటకు వస్తుండగా కెమెరాలకు చిక్కారు. అయితే వీరితో పాటు అథియా స్నేహితురాలు ఆకాంక్ష, బాలీవుడ్ నటుడు పంచోలీ కూడా ఉన్నారు. వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారని బాలీవుడ్ నిర్మాత విక్రమ్ ఫడ్నీస్ గతంలో అథియా శెట్టీ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. అప్పటినుంచి ఈ జంట ప్రేమాయణం వార్తలు షికారు చేస్తూనే ఉన్నాయి.అయితే అథియా గానీ,రాహుల్ గానీ ఇప్పటివరకు తమ మధ్య అలాంటిదేమీ లేదని చెప్పలేదు. దీంతో ఇద్దరి మధ్య 'సమ్‌థింగ్ సమ్‌థింగ్' అన్న ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.

First published: October 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...