kedhar jadhav father missing: టీమిండియా (Team India) ప్లేయర్ కేదార్ జాదవ్ (kedar jadhav) తండ్రి కనిపించకుండా పోయారు. సోమవారం ఉదయం గం. 11.30 ల నుంచి కేదార్ జాదవ్ తండ్రి అదృశ్యమయ్యారు. మార్నింగ్ వాక్ కోసం బయటకు వెళ్లిన అతడు మళ్లీ ఇంటికి తిరిగి రాలేదని కేదార్ జాదవ్ పేర్కొన్నాడు. దాంతో పుణేలోని అలంకార్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాడు. దీనిని కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం కేదార్ జాదవ్ తండ్రి ఆచూకి కోసం గాలిస్తున్నారు. తన తండ్రి జ్ఞాపకశక్తి సరిగ్గా లేదని కూడా కేదార్ జాదవ్ స్పష్టం చేశాడు. అతడి కథనం ప్రకారం సోమవారం ఉదయం మార్నింగ్ వాక్ కోసం కోత్రూడ్ ప్రాంతానికి వెళ్లినట్లు.. తిరిగి ఇంటికి రాలేదంటూ కేదార్ జాదవ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
వెంటనే కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు కేదార్ జాదవ్ తండ్రి ఆచూకీ కోసం గాలింపు మొదలు పెట్టారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం అతడి కదలికలను తెలుసుకోవడం కోసం సీసీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. చివరిసారిగా కేదార్ జాదవ్ తండ్రి కార్వీ నగర్ లోని సీసీ కెమెరాల్లో కనిపించారు. పోలీసుల కథనం ప్రకారం జాదవ్ తండ్రి డిమెంటియా (dementia)తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. డిమెంటియా అంటే ఆలోచన శక్తి తగ్గిపోవడం. అంతేకాకుండా జాదవ్ తండ్రి మానసిక పరిస్థితి కూడా బాగాలేదని తెలుస్తోంది. కేదార్ జాదవ్ తన కుటుంబంతో పుణేలో నివసిస్తున్నాడు.
38 ఏళ్ల కేదార్ జాదవ్ 2014లో వన్డేల్లో.. 2015లో టి20ల్లో భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. తన వన్డే కెరీర్ లో 73 మ్యాచ్ ల్లో 1,389 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 6 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 27 వికెట్లు కూడా తీశాడు. ఇక 9 టి20ల్లో 122 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక అర్ధ సెంచరీ ఉంది. కేదార్ జాదవ్ చివరిసారిగా 2020లో టీమిండియా తరఫున వన్డే మ్యాచ్ ఆడాడు. ప్రస్తుతానికి అతడు ఫస్ట్ క్లాస్ క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు.
ఇక ఐపీఎల్ లో 2010లో డెబ్యూ చేసిన కేదార్ జాదవ్.. 2021 వరకు వివిధ ఫ్రాంచైజీలకు ఆడాడు. హైదరాబాద్ , చెన్నై సూపర్ కింగ్స్ ల తరఫున ఆడాడు. ఓవరాల్ గా తన ఐపీఎల్ కెరీర్ లో 93 మ్యాచ్ ల్లో 1,196 పరుగులు చేశాడు. 2022లో జరిగిన మెగా వేలంలో అన్ సోల్డ్ ప్లేయర్ గా నిలిచాడు. ఇక గతేడాది డిసెంబర్ లో జరిగిన మినీ వేలంలో కూడా జాదవ్ ను ఎవరూ కొనుగోలు చేయలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.