హోమ్ /వార్తలు /క్రీడలు /

Irfan Pathan: పతంగి కోసం పఠాన్ పాట్లు.. తుర్రున ఎగిరి.. గిర్రున పడింది..

Irfan Pathan: పతంగి కోసం పఠాన్ పాట్లు.. తుర్రున ఎగిరి.. గిర్రున పడింది..

పతంగి ఎగురవేసిన పఠాన్

పతంగి ఎగురవేసిన పఠాన్

Irfan Pathan: గుజరాత్ వడోదరాలోని తన ఇంటి డాబాపై నిల్చొని.. కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి గాలిపటాల వేడుకను జరపుకున్నాడు. ఐతే పఠాన్ ఎగురవేసిన గాలిపటం తుర్రున ఎగిరి.. గిర్రుమని కింద పడింది

సంక్రాంతి సందర్భంగా దేశమంతటా పతంగుల సందడి నెలకొంది. ఆకాశంలో ఎక్కడ చూసినా గాలి పటాల విహారమే కనిపిస్తోంది. గిర్రుగిర్రుమంటూ విమానాలతో పోటీపడి మరీ ఎగురుతున్నాయి. పల్లెలు, పట్నాలనే తేడా లేకుండా అందరూ పతంగుల సంబరాలు చేసుకుంటున్నారు. మతాలతో సంబంధం లేకుండా గాలిపటాలు ఎగురవేస్తున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా సంక్రాంతి పండగ వేళ పతంగి ఎగురవేశాడు. గుజరాత్ వడోదరాలోని తన ఇంటి డాబాపై నిల్చొని.. కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి గాలిపటాల వేడుకను జరుపుకున్నాడు. ఐతే పఠాన్ ఎగురవేసిన గాలిపటం తుర్రున ఎగిరి.. గిర్రుమని కింద పడింది.

పతంగి గాల్లో కాసేపు ఎగిరిన తర్వాత.. కింద పడిపోయింది. గాలి పటం పడిపోతుందని.. కింద ఉన్న పిల్లలకు చెప్పాడు పఠాన్. దాని కోసం పిల్లలు పరుగులు పెట్టారు. నేను కూడా చిన్నప్పుడు అలానే చేశానని.. ఆ వీడియోను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు ఇర్ఫాన్ పఠాన్. కాగ, గుజరాత్‌లో ఉత్తరాయణ్ పేరిట సంక్రాంతి పండుగను జరుపుకుంటారు.


టీమిండియాలో ఎన్నో సంచనాలు సృష్టించిన ఇర్ఫాన్ పఠాన్.. తన కెరీర్‌లో సెకండ్ ఇన్సింగ్స్ మొదలుపెట్టాడు. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఈ ఆల్‌రౌండర్..కోలీవుడ్ ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. సౌత్ స్టార్ విక్రమ్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అజయ్‌ జ్ఞానముతు దర్శకత్వంలో వస్తున్న కోబ్రా మూవీలో విలన్ రోల్ పోషించాడు. అస్లాన్ ఇల్మాజ్ పాత్ర ఇర్ఫాన్ పఠాన్ కనిపించనున్నాడు. కోబ్రా చిత్రంలో విక్రమ్ హీరోగా‌, ఇర్ఫాన్‌ ఖాన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. కేఎస్‌ రవికుమార్‌, శ్రీనిధి శెట్టి, మృణాలిని, కనికా, పద్మప్రియ, బాబు ఆంటోనీ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సెవన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై ఎస్.ఎస్. లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన విక్రమ్, పఠాన్ లుక్స్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. 90 శాతం చిత్రీకరణ పూర్తవడంతో త్వరలోనే కోబ్రాను విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

First published:

Tags: Cricket, Sankranti 2021

ఉత్తమ కథలు