షాద్‌ నగర్ నిర్భయ ఘటన : తీవ్రంగా స్పందించిన అంబటి రాయుడు

దేశవ్యాప్తంగా సంచలనం రేకేత్తించిన షాద్‌నగర్ హత్యాచార ఘటనపై క్రికెటర్ అంబటి రాయుడు ట్విట్టర్‌లో స్పందించాడు.

news18-telugu
Updated: December 1, 2019, 2:45 PM IST
షాద్‌ నగర్ నిర్భయ ఘటన : తీవ్రంగా స్పందించిన అంబటి రాయుడు
అంబటి రాయుడు (Image : Twitter)
  • Share this:
దేశవ్యాప్తంగా సంచలనం రేకేత్తించిన షాద్‌నగర్ హత్యాచార ఘటనపై క్రికెటర్ అంబటి రాయుడు ట్విట్టర్‌లో స్పందించాడు. 'ఎవరైనా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడాలంటే.. వారి మెడ చుట్టూ ఉరి బిగుసుకుంటుందన్న ఊహ కలగాలి. ఘటన గురించి ఎక్కువ ఆలోచించవద్దు. చేయాల్సిన పని
చేసేయాల్సిందే. రేపిస్టులను ఉరితీయండి.' అంటూ వ్యాఖ్యానించారు. అంబటి రాయుడు ట్వీట్‌కి నెటిజెన్స్‌ నుంచి కూడా మద్దతు లభిస్తోంది. నిందితులను ఉరితీయాల్సిందేనని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా,అంతకుముందు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా షాద్ నగర్ ఘటనపై ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో ఇలాంటి ఘటన జరగడం దారుణమని, సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన అని వాపోయాడు.


First published: December 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు