WorldCup Final : ఆ 'ఓవర్ త్రో'కి ఐదు పరుగులే.. ఎంపైర్స్ బ్లండర్ మిస్టెక్..
ఎంపైరింగ్ తప్పిదం వల్లే ఆ బంతికి ఆరు పరుగులు వచ్చాయని అంతర్జాతీయ మాజీ ఎంపైర్లు సైమన్ టౌఫెల్, హరిహరన్ అభిప్రాయపడ్డారు.నిజానికి ఆ ఓవర్ త్రోకు ఇంగ్లాండ్‌కు ఇవ్వాల్సింది ఐదు పరుగులేనని అన్నారు.
news18-telugu
Updated: July 16, 2019, 9:23 AM IST

ప్రతీకాత్మక చిత్రం
- News18 Telugu
- Last Updated: July 16, 2019, 9:23 AM IST
ఇంగ్లాండ్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో విజేతను నిర్ణయించిన తీరుపై క్రికెట్ అభిమానులతో పాటు, మాజీ అంతర్జాతీయ క్రికెటర్లు కూడా పెదవి విరుస్తున్న సంగతి తెలిసిందే. ఫైనల్ మ్యాచ్ సూపర్ ఓవర్లో రెండు జట్లు సమ స్కోర్లతో సమవుజ్జీలుగా నిలిచినప్పటికీ.. సంయుక్త విజేతను ప్రకటించే ఆనవాయితీని పక్కనపెట్టి.. బౌండరీల ఆధారంగా ఇంగ్లాండ్‌ను విజేతగా ప్రకటించడం చాలామందికి నచ్చలేదు. దానికి తోడు ఎంపైరింగ్ తప్పిదాలు కూడా న్యూజిలాండ్‌కు ప్రతికూలంగా మారాయి. అసలు ఎంపైర్స్ సరిగ్గా వ్యవహరించి ఉంటే..మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు రాకుండానే కివీస్ విజేతగా నిలిచి ఉండేదేమో అంటున్నారు.
మ్యాచ్ ఆఖరి ఓవర్లో ఇంగ్లాండ్ విజయానికి 15 పరుగులు అవసరమైన దశలో.. బెన్‌స్టోక్స్, జోఫ్రా ఆర్చర్ క్రీజులో ఉన్నారు. మొదటి రెండు బంతులు డాట్ బాల్స్. మూడో బంతిని స్టోక్స్ సిక్సర్‌గా మలిచాడు. నాలుగో బంతిని మిడ్ వికెట్ మీదుగా ఆడి రెండు పరుగుల కోసం ప్రయత్నించాడు.అయితే కివీస్ ఫీల్డర్ బంతిని కీపర్ వైపు విసరగా.. అది స్టోన్స్ బ్యాట్‌కు తగిలి బౌండరీ వెళ్లింది. దీంతో బ్యాట్స్‌మెన్ తీసిన రెండు పరుగులతో పాటు, బౌండరీ కలిపి ఆరు పరుగులు లభించాయి. ఈ ఒక్క ఓవర్ త్రో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. చివరగా మ్యాచ్ టై అయింది.అయితే ఎంపైరింగ్ తప్పిదం వల్లే ఆ బంతికి ఆరు పరుగులు వచ్చాయని అంతర్జాతీయ మాజీ ఎంపైర్లు సైమన్ టౌఫెల్, హరిహరన్ అభిప్రాయపడ్డారు.నిజానికి ఆ ఓవర్ త్రోకు ఇంగ్లాండ్‌కు ఇవ్వాల్సింది ఐదు పరుగులేనని అన్నారు.
ఐసీసీ నిబంధన ప్రకారం.. బ్యాట్స్‌మెన్ పూర్తి చేసిన పరుగులనే ఓవర్ త్రోకి కలుపుతారు. ఒకవేళ అప్పటికీ పరుగు పూర్తి కాకపోతే.. బ్యాట్స్‌మెన్ ఒకరిని ఒకరు దాటి ఉంటే దాన్ని ఒక పరుగుగా లెక్కించి బౌండరీకి కలుపుతారు. కానీ ఫైనల్ మ్యాచ్‌లో నాలుగో బంతికి రెండో పరుగు కోసం పరిగెత్తినప్పుడు.. గప్టిల్ ఓవర్ త్రో విసిరిన సమయంలో.. బ్యాట్స్‌మెన్ స్టోక్స్,రషీద్ ఇంకా పరుగు పూర్తి చేయలేదు. రన్నింగ్‌లో ఇద్దరు ఒకరిని ఒకరు దాటలేదు. కాబట్టి దాన్ని పరుగుగా లెక్కించకూడదు అని ఐసీసీ నిబంధన చెబుతోంది.ఇదేమి పట్టించుకోకుండా.. కనీసం టీవీ ఎంపైర్‌ను కూడా సంప్రదించకుండా ఆరు పరుగులు ఇచ్చి కివీస్‌కు అన్యాయం చేశారని వారు వాపోయారు. నాలుగో బంతికి ఐదు పరుగులే ఇచ్చి ఉంటే.. బ్యాటింగ్ స్టోక్స్ కాకుండా రషీద్ చేయాల్సి వచ్చేదన్నారు. అప్పుడు మ్యాచ్ స్వరూపం మరోలా ఉండేదేమో..!

Loading...