అంబటి రాయుడు ‘3డీ గ్లాసెస్’ కామెంట్స్‌పై బీసీసీఐ స్పందన

Cricket World Cup 2019 | వరల్డ్ కప్‌కు ఎంపికైన భారత జట్టులో చోటు దక్కకపవడంతో తీవ్ర నిరాశతో అంబటి రాయుడు చేసిన ఈ వ్యాఖ్యలపై క్రమశిక్షణ చర్యలు ఉండబోవని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

news18-telugu
Updated: April 18, 2019, 12:44 PM IST
అంబటి రాయుడు ‘3డీ గ్లాసెస్’ కామెంట్స్‌పై బీసీసీఐ స్పందన
అంబటి రాయుడు (Image : Twitter)
news18-telugu
Updated: April 18, 2019, 12:44 PM IST
వరల్డ్ కప్‌కు ఎంపిక చేసిన 15 మందితో కూడిన భారత జట్టులో చోటు దక్కకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తంచేస్తూ భారత బ్యాట్స్‌మన్ అంబటి రాయుడు ట్విట్టర్‌లో వ్యంగ్యంగా చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదం కావడం తెలిసిందే. వరల్డ్ కప్ చూసేందుకు ‘3డీ గ్లాసెస్’ ఆర్డర్ చేశానని ట్వీట్ చేసిన అంబటి రాయుడు...సెలక్టర్లపై తన అసంతృప్తిని వ్యక్తంచేశాడు. మూడు కోణాల్లో(3 డైమెన్షన్స్) ఉపయోగపడే ఆటగాడైనందునే అంబటి రాయుడికి బదులు విజయ్ శంకర్‌ను జట్టులోకి తీసుకున్నట్లు చీఫ్ సెలక్టర్ ప్రసాద్ పేర్కొనడంపై స్పందిస్తూ అంబటి రాయుడు ఈ వ్యంగ్య ట్వీట్ చేశారు.  ఈ నేపథ్యంలో ఓ సీనియర్ బీసీసీఐ అధికారి అంబటి రాయుడు చేసిన వ్యంగ్య కామెంట్స్‌పై స్పందించారు. వరల్డ్ కప్‌కు ఎంపికైన జట్టులో చోటు దక్కకపోవడం పట్ల అసంతృప్తితో అంబటి రాయుడు చేసిన కామెంట్స్ తమ దృష్టికి వచ్చినట్లు చెప్పారు. అయితే ఈ కామెంట్స్ కారణంగా అంబటి రాయుడిపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు ఉండబోవని స్పష్టంచేశారు. తీవ్ర భావోద్రేకంతో అంబటి రాయుడు ఈ ట్వీట్ చేసినట్లు భావిస్తున్నట్లు చెప్పారు.

అంబటి రాయుడు చేసిన వివాదాస్పద ట్వీట్ ఇదీ...

వరల్డ్ కప్‌కు ఎంపికైన భారత జట్టులో చోటు దక్కకపోవడంతో అంబటి తీవ్ర అసంతృప్తితో ఇలాంటి కామెంట్స్ చేసినట్లు భావిస్తున్నట్లు ఆ సీనియర్ బీసీసీఐ అధికారి చెప్పారు. తీవ్ర అసంతృప్తి నుంచి త్వరలోనే అంబటి రాయుడు కోలుకుంటాడని ఆశాభావం వ్యక్తంచేశారు. అంబటి రాయుడు సోషల్ మీడియాలో చేసిన కామెంట్స్‌ ఆధారంగా అతనిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని సదరు సీనియర్ బీసీసీఐ అధికారి పేర్కొన్నారు.
First published: April 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...