హోమ్ /వార్తలు /క్రీడలు /

Chris Gayle : క్రిస్ గేల్ కు విండీస్ బోర్డు దిమ్మదిరిగే షాక్.. మరీ ఇంతటి అవమానమా..!

Chris Gayle : క్రిస్ గేల్ కు విండీస్ బోర్డు దిమ్మదిరిగే షాక్.. మరీ ఇంతటి అవమానమా..!

క్రిస్ గేల్

క్రిస్ గేల్

Chris Gayle : టీ-20 క్రికెట్ కు బ్రాండ్ అంబాసిడర్ లాంటి క్రిస్ గేల్ ను మరీ ఇంతలా అవమానించడం తగదంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అసలు ఇంతకీ ఏం జరిగిదంటే..

సిక్సర్ల వీరుడు, యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌(Chris Gayle)కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. భారీ షాట్లకు పెట్టింది పేరు. బలంగా బంతిని బాదితే అది స్టేడియం బయటపడ్డం ఖాయం. ధనాధన్ క్రికెట్ లో ఓ లెజెండ్. ఇప్పటికే వన్డే, టెస్టు కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన గేల్‌కు టి20ల్లో ఘనమైన రికార్డు ఉంది. త్వరలోనే తన సొంత మైదానం Sabina Park in Kingston లో చివరి మ్యాచ్ ఆడి టీ-20 లతో పాటు అన్ని రకాల క్రికెట్ గుడ్ బై చెప్పాలని భావించాడు. ఇదే తన కోరికంటూ గతేడాది జరిగిన టీ-20 వరల్డ్ కప్ లో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, లేటెస్ట్ గా క్రిస్ గేల్ కు దిమ్మదిరిగే షాకిచ్చింది విండీస్ క్రికెట్ బోర్డు. మనోడి కోరికను అస్సలు పట్టించుకోలేదు. లేటెస్ట్ గా ఐర్లాండ్, ఇంగ్లండ్ లతో జరిగే టీ-20 ల కోసం ప్రకటించిన జట్టులో క్రిస్ గేల్ కు చోటు కల్పించలేదు.

దీంతో, తన సొంత ప్రేక్షుకుల మధ్య ఫేర్ వెల్ మ్యాచ్ ఆడాలనుకున్న గేల్ కోరిక ఇప్పట్లో తీరేలా లేదు. విండీస్ ఈ జనవరిలో తొమ్మిది మ్యాచులు ఆడనుంది. అందులో మూడు వన్డేలు, ఆరు టీ-20 లు ఉన్నాయ్. అయితే, ఈ ఆరు టీ-20ల్లో ఒకదాంట్లో కూడా క్రిస్ గేల్ కు చోటు కల్పించలేదు. దీంతో క్రిస్ గేల్ ఫ్యాన్స్ నిరాశపడుతున్నారు. విండీస్ బోర్డును టార్గెట్ చేసుకుని మండిపడుతున్నారు.

టీ-20 క్రికెట్ కు బ్రాండ్ అంబాసిడర్ లాంటి క్రిస్ గేల్ ను మరీ ఇంతలా అవమానించడం తగదంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే, విండీస్ క్రికెట్ బోర్డు దీనిపై స్పందించింది. క్రిస్ గేల్ ఫేర్ వేల్ కు ఇది సరియైన సమయం కాదు.. త్వరలోనే అతని రిటైర్మెంట్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామంటూ తెలిపింది. అయితే, వయస్సు పై బడుతున్న క్రిస్ గేల్ కు ఐర్లాండ్ తో Sabina Park in Kingston జరిగే టీ-20 మ్యాచ్ లో చోటు కల్పించి ఉంటే మంచిదని అభిప్రాయపడుతున్నారు క్రీడా విశ్లేషకులు.

క్రిస్ గేల్ తన కెరీర్‌లో 452 టి20 మ్యాచ్‌లాడిన గేల్‌ 145.4 స్ట్రైక్‌రేట్‌తో 14,321 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అందులో 87 హాఫ్‌ సెంచరీలు.. 22 సెంచరీలు ఉన్నాయి. ఇక వెస్టిండీస్‌ తరపున గేల్‌ 79 మ్యాచ్‌ల్లో 1884 పరుగులు సాధించాడు. టి20 ప్రపంచకప్‌ల్లో రెండు సెంచరీలు సాధించిన ఏకైక బ్యాటర్ గా గేల్‌ చరిత్రలో నిలిచిపోయాడు.

ఇది కూడా చదవండి : రాజ్.. పుష్ప రాజ్.. నీ అవ్వ వార్నర్ తగ్గేదే లే.. డేవిడ్ బాయ్ వీడియోకి అల్లు అర్జున్ క్రేజీ రిప్లై..

2012, 2016 టి20 ప్రపంచకప్‌లను విండీస్‌ గెలవడంలో గేల్‌ కీలకపాత్ర పోషించాడు.టి20 ప్రపంచకప్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన లిస్ట్ లో గేల్‌(35 మ్యాచ్‌ల్లో 950 పరుగులు) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. టి20ల్లో వెయ్యికి పైగా సిక్స్‌లు కొట్టిన తొలి బ్యాటర్‌గా గేల్‌ చరిత్ర సృష్టించాడు.

విండీస్ స్క్వాడ్స్ :

ఐర్లాండ్ వన్డేలకు జట్టు :

కీరన్ పొలార్డ్ (c), షై హోప్ (vc), షమ్రా బ్రూక్స్, రోస్టన్ ఛేజ్, జస్టిన్ గ్రీవ్స్, జాసన్ హోల్డర్, అకీలా హోస్సెన్, అల్జారీ జోసెఫ్, గుడ్ కేష్ మోతి, జేడెన్ సీల్స్, నికోలస్ పూరన్, రొమారియో షెపర్డ్, ఓడియన్ స్మిత్, డేవాన్ థామస్

COVID-19 Reserves: కీసీ కార్టీ, షెల్డెన్ కాట్రెల్

ఐర్లాండ్- ఇంగ్లండ్ తో టీ-20లకు విండీస్ జట్టు :

కీరన్ పొలార్డ్ (c), నికోలస్ పూరన్ (vc), ఫాబియెన్ అలెన్ (England T20Is only), డారెన్ బ్రావో (England T20Is only), రోస్టన్ ఛేజ్, షెల్డెన్ కాట్రెల్, డామినిక్ డ్రేక్స్, షై హోప్ , అకీలా హోస్సెన్, జాసన్ హోల్డర్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, రావ్మెన్ పావెల్, రొమారియో షెపర్డ్, ఓడియన్ స్మిత్, హేడెన్ వాల్ష్ జూనియర్.

First published:

Tags: Chris gayle, Cricket, West Indies

ఉత్తమ కథలు