నా కుమారులు ధోనీలా మరాలి.. సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

సెహ్వాగ్ తన కుమారులు తనలా మారొద్దని అంటున్నాడు. తన కుమారులు ఆర్యవీర్, వేదాంత్‌లు భవిష్యత్తులో మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీలా, విరాట్ కోహ్లీలా, హార్దిక్ పాండ్యాలా మారాలని తాను కోరుకుంటున్నానని చెప్పి ఆశ్చర్యపరిచాడు.

news18-telugu
Updated: November 29, 2019, 11:25 AM IST
నా కుమారులు ధోనీలా మరాలి.. సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
సెహ్వాగ్, ధోని
  • Share this:
వీరేంద్ర సెహ్వాగ్.. టీమిండియా మాజీ ఓపెనర్, డేర్ అండ్ డ్యాషింగ్ బ్యాట్స్‌మన్. అతడు క్రీజులోకి వచ్చాడంటే.. బంతులు విసిరేది ఎంత పెద్ద బౌలర్ అయినా లెక్క చేయకుండా వీరబాదుడు బాదుతాడు. తొలి బంతినే స్టాండ్స్‌లోకి పంపించే అంతటి ధైర్యవంతుడు. సెహ్వాగ్ క్రీజులో ఉన్నంతసేపు బౌండరీలు చిన్నబోతాయి. బౌలర్ ఎంత వేగంగా బంతిని విసురుతాడో అంతే వేగంగా బంతిని బౌండరీ దాటిస్తాడు. తక్కువ ఓవర్ల పాటు క్రీజులో ఉన్నా స్కోరు బోర్డును వేగంగా పరుగెత్తిస్తాడు. ఆట అంటే సెహ్వాగ్‌లా ఆడాలిరా! అనే వారెందరో ఉంటారు. బౌలర్లకు చుక్కలు చూపిస్తాడంటూ ప్రశంసలు కురిపిస్తారు. కానీ.. సెహ్వాగ్ మాత్రం తన కుమారులు తనలా మారొద్దని అంటున్నాడు. తన కుమారులు ఆర్యవీర్, వేదాంత్‌లు భవిష్యత్తులో మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీలా, విరాట్ కోహ్లీలా, హార్దిక్ పాండ్యాలా మారాలని తాను కోరుకుంటున్నానని చెప్పి ఆశ్చర్యపరిచాడు.

అయితే, వాళ్లు క్రికెటర్లుగానే మారాల్సిన అవసరం లేదని, వారికి ఇష్టమైన కెరీర్ ఎంచుకోవచ్చని సెహ్వాగ్ తెలిపాడు. చివరికి మంచి మనుషులుగా మారితే అదే పదివేలు అని అన్నాడు. స్కూల్ నిర్మించాలనడం తన తండ్రి కోరిక అని.. ఆయన కోరిక మేరకే తాను స్కూల్, అకాడమీ ఏర్పాటు చేశానని వెల్లడించాడు. క్రికెట్ తనకు రొట్టెముక్క, వెన్నె ఇచ్చిందని, ఇస్తూనే ఉందని చెప్పి, క్రికెట్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.

First published: November 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>