Virat Kohli: సరిలేరు కోహ్లీకి ఎవ్వరు...వైరల్ అవుతున్న మెరుపు రనౌట్

Ind vs NZ| తొలి మ్యాచ్‌లో కోహ్లి (Virat Kohli) ఫీల్డింగ్‌ తనకు ఎవరూ సరిలేరు అని నిరూపించుకున్నాడు. టీమిండియా నిర్దేశించిన 348 పరుగుల భారీ టార్గెట్‌ ఛేదనలో న్యూజిలాండ్‌ దీటుగా బదులిస్తున్న సమయంలో కోహ్లి ఓపెనర్‌ హెన్రీ నికోలస్‌(78)ను అద్భుతమైన తీరులో రనౌట్‌ చేసి తన సత్తా చాటాడు.

news18-telugu
Updated: February 5, 2020, 4:48 PM IST
Virat Kohli: సరిలేరు కోహ్లీకి ఎవ్వరు...వైరల్ అవుతున్న మెరుపు రనౌట్
(Image : BCCI)
  • Share this:
హామిల్టన్ తొలి వన్డేలో కివీస్ చేతిలో భారత్ పరాజయం మూటగట్టుకున్నప్పటికీ, కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) చేసిన రనౌట్ మాత్రం సర్వత్రా వైరల్ అవుతోంది. తొలి మ్యాచ్‌లో కోహ్లి ఫీల్డింగ్‌ తనకు ఎవరూ సరిలేరు అని నిరూపించుకున్నాడు. టీమిండియా (Ind vs NZ) నిర్దేశించిన 348 పరుగుల భారీ టార్గెట్‌ ఛేదనలో న్యూజిలాండ్‌ దీటుగా బదులిస్తున్న సమయంలో కోహ్లి ఓపెనర్‌ హెన్రీ నికోలస్‌(78)ను అద్భుతమైన తీరులో రనౌట్‌ చేసి తన సత్తా చాటాడు. 29 ఓవర్‌ లో రాస్‌ టేలర్‌ సింగిల్‌ తీసే ప్రయత్నం చేయగా, నాన్‌ స్ట్రైకింగ్‌ ఎండ్‌లో ఉన్న నికోలస్‌‌ను రన్ కు రమ్మని సైగ చేశాడు. అయితే కవర్స్‌ లో ఫీల్డింగ్‌ చేస్తున్న కోహ్లి బంతిని పట్టుకున్న మరుక్షణమే బ్యాట్స్‌మన్‌ కంటే వేగంగా పరిగెత్తి వికెట్లపై విసిరాడు దీంతో ఫామ్‌లో ఉన్న నికోలస్‌ మూడో వికెట్‌గా ఔటయ్యడు. ఇదిలా ఉంటే తొలి వన్డే మ్యాచ్ లో న్యూజిలాండ్ విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 348 పరుగుల టార్గెట్‌ను న్యూజిలాండ్ ఛేదించింది. న్యూజిలాండ్ ఓపెనర్లు మార్టిన్ గుప్తిల్(32), హెన్రీ నికోలస్(72) శుభారంభం ఇవ్వడంతో భారీ లక్ష్య ఛేదన సులువు అయ్యింది. అనంతరం వచ్చిన రాస్ టేలర్ సెంచరీతో అదరగొట్టగా, టామ్ లాథం (69) పరుగులతో రాణించాడు. అయితే భారత బౌలర్లలో బుమ్రా వికెట్లు తీయడంలో విఫలం చెందాడు. కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టాడు.





కాగా న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో టీ20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన ఊపుమీద ఉన్న టీమిండియా.. తొలి వన్డేలో సైతం అద్భుతంగా రాణించింది. న్యూజిలాండ్‌ బౌలింగ్‌ను చీల్చిచెండాడి 348 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. శ్రేయస్‌ అయ్యర్‌(103), కేఎల్‌ రాహుల్‌(88 నాటౌట్‌), విరాట్‌ కోహ్లి(51)లు రాణించడంతో భారత్‌ భారీ స్కోరును నమోదు చేసింది. టాస్‌ గెలిచిన కివీస్‌ ముందుగా ఫీల్డింగ్‌ తీసుకోవడంతో టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది. భారత్‌ ఇన్నింగ్స్‌ను పృథ్వీషా, మయాంక్‌ అగర్వాల్‌లు ఆరంభించారు. తొలి వికెట్‌కు 50 పరుగులు జత చేసిన తర్వాత పృథ్వీ షా(20) ఔట్‌ కాగా, మరో నాలుగు పరుగుల వ్యవధిలో మయాంక్‌ అగర్వాల్‌ (32) పెవిలియన్‌ చేరాడు. ఓపెనర్‌ పృథ్వీషా(20) ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లి సమయోచితంగా బ్యాటింగ్‌ చేసి అర్థ శతకం నమోదు చేశాడు. 61 బంతుల్లో 6 ఫోర్లతో హాఫ్‌ సెంచరీ చేశాడు. శ్రేయస్‌ అయ్యర్‌తో కలిసి 102 పరుగుల భాగస్వామ్యాన్ని కోహ్లి నెలకొల్పాడు. ఈ క్రమంలోనే అర్థ శతకంతో మెరిశాడు. కాగా, హాఫ్‌ సెంచరీ చేసిన వెంటనే కోహ్లి పెవిలియన్‌ చేరాడు. అయ్యర్‌- కేఎల్‌ రాహుల్‌ల జోడి అత్యంత సమన్వయంగా బ్యాటింగ్‌ చేస్తూ.. మంచి బంతులను సమర్ధవంతంగా ఎదుర్కొంటూనే చెత్త బంతులను బౌండరీలు దాటించారు. అయ్యర్‌ తన వన్డే కెరీర్‌లో మెయిడిన్‌ సెంచరీతో మెరిశాడు.రాహుల్‌-శ్రేయస్‌ అ‍య్యర్‌ల జోడి 136 పరుగులి భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత అయ్యర్‌ నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు. రాహుల్‌కు కేదార్‌ జాదవ్‌ జత కలిసి స్కోరు బోర్డును మరింత ముందుకు తీసుకెళ్లాడు. జాదవ్‌ 15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో అజేయంగా 26 పరుగులు చేయడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. న్యూజిలాండ్‌ బౌలర్లలో సౌతీ రెండు వికెట్లు సాధించగా,గ్రాండ్‌ హోమ్‌, ఇష్‌ సోథీలకు తలో వికెట్‌ లభించింది.
First published: February 5, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు