Home /News /sports /

CRICKET VIRAL VIDEO LANCASHIRE PLAYER DANE VILAS LOST HIS TROUSER WHILE ATTEMPT DIVING FOR CATCH IN T20 BLAST VIRAL SJN

T20 Blast : ప్యాంట్ జారే.. పరువు పాయె.. పాపం ఆ క్రికెటర్ పరిస్థితి.. (వీడియో)

విలా (PC : TWITTER)

విలా (PC : TWITTER)

T20 Blast : ఇంగ్లండ్ (Engaland) వేదికగా జరగుతోన్న టి20 బ్లాస్ట్ క్రికెట్ లీగ్ లో నవ్వు తెప్పించే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఈ లీగ్ లో భాగంగా లంకషైర్, యార్క్ షైర్ జట్ల మధ్య మ్యాచ్ జరగ్గా.. తొలుత బ్యాటింగ్ చేసిన లంకషైర్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 183 పరుగులు చేసింది.

ఇంకా చదవండి ...
T20 Blast : ఇంగ్లండ్ (Engaland) వేదికగా జరగుతోన్న టి20 బ్లాస్ట్ క్రికెట్ లీగ్ లో నవ్వు తెప్పించే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఈ లీగ్ లో భాగంగా లంకషైర్, యార్క్ షైర్ జట్ల మధ్య మ్యాచ్ జరగ్గా.. తొలుత బ్యాటింగ్ చేసిన లంకషైర్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 183 పరుగులు చేసింది. అనంతరం యార్క్ షైర్ బ్యాటింగ్ కు దిగగా.. 19 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు 4 వికెట్లకు 170 పరుగులు చేసింది. దాంతో యార్క్ షైర్ జట్టు విజయం సాధించాలంటే ఆఖరి ఓవర్లో 13 పరుగులు చేయాల్సి వచ్చింది. ఆ ఓవర్ తొలి నాలుగు బంతులకు 7 పరుగులు రావడంతో చివరి రెండు బంతులకు యార్క్ షైర్ కు ఆరు పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో లంక షైర్‌ బౌలర్‌ ఫుల్‌టాస్‌ వేయగా.. క్రీజులో ఉన్న షాదాబ్‌ సిక్స్‌ కొట్టబోయే ప్రయత్నం చేశాడు.

అయితే బ్యాట్ ఎడ్జ్‌ కు తాకిన బంతి నాన్ స్ట్రయికింగ్ ఎండ్ లో వికెట్ల వెనకగా గాల్లోకి లేచింది. మిడాఫ్‌ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన డేన్‌ విలా క్యాచ్‌ అందుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో డైవ్ కూడా చేశాడు. అయినప్పటికీ క్యాచ్ మిస్‌ అయింది. అనంతరం బంతిని తీసుకోవడానికి విలా పైకి లేవగా అతడి ప్యాంట్‌ ఒక్కసారిగా కిందకు జారింది. షాక్‌ తిన్న డేన్‌ విలా..వెంటనే తేరుకుని పైకి లేచి ప్యాంటును సర్దుకొని బంతిని విసిరేశాడు. ఈ వీడియోను టి20 లీగ్ ట్విటర్‌లో షేర్‌ చేసింది.


ఇక ఇరు జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ చివరకు డ్రాగా ముగిసింది. ఆఖరి బంతికి ఒక్క పరుగు చేస్తే గెలుస్తామన్న స్థితిలో యార్క్ షైర్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (72) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. దాంతో యార్క్ షైర్ జట్టు త్రుటిలో విజయాన్ని దూరం చేసుకుంది. ఫలితంగా మ్యాచ్ డ్రాగా ముగిసింది. యార్క్ షైర్ జట్టు సరిగ్గా 20 ఓవర్లలో 5 వికెట్లకు 183 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో లంకషైర్ తరఫున బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ప్లేయర్ టిమ్ డేవిడ్ 18 బంతుల్లో 35 పరుగులు చేశాడు. ఇందులో ఒక ఫోర్ మూడు సిక్సర్లు ఉండటం విశేషం. ఫిబ్రవరి నెలలో జరిగిన వేలంలో టిమ్ డేవిడ్ ను రూ. 8.25 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ ఐపీఎల్ ఆరంభంలో టిమ్ డేవిడ్ పెద్దగా రాణించలేదు. దాంతో రెండు మ్యాచ్ ల తర్వాత టిమ్ డేవిడ్ పై వేటు వేసిన ముంబై సగం సీజన్ వరకు అతడిని బెంచ్ కే పరిమితం చేసింది. అయితే చివర్లో మళ్లీ అవకాశం ఇవ్వగా పవర్ హిట్టింగ్ తో రెచ్చిపోయాడు. దాంతో వచ్చే సీజన్ లో ముంబై జట్టులో టిమ్ డేవిడ్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని టీం ఫ్యాన్స్ భావిస్తున్నారు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: England, Gujarat Titans, Hardik Pandya, IPL, IPL 2022, Mumbai Indians, T20

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు