Cricket Viral : క్రికెట్ (Cricket) లో క్యాచ్ లను డ్రాప్ చేయడం సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. అదే విధంగా రనౌట్ చాన్స్ లను కూడా మిస్ చేయడం చూస్తు ఉంటాం. వీటితో పాటు బౌండరీ లైన్ దగ్గర కొన్ని సార్లు ఈజీగా ఆపే ఫోర్లను కూడా ఫీల్డర్లు వదిలి బౌండరీ చేరేలా చేస్తుంటారు. కానీ, ఇవన్నీ ఒక్క బంతికి జరిగితే ఎలా ఉంటుంది. చాలా విచిత్రంగా.. అదో వింతలా అనిపిస్తుంది కదూ. మొన్నటి వరకు ఇటువంటిది ఒకటి జరుగుతుందా అనే ఆలోచన కూడా సగటు క్రికెట్ అభిమానిలో మెదిలి ఉండదు. కానీ తాజాగా యూరోపియన్ (European cricket) క్రికెట్ లో ఇటువంటి సంఘటన ఒకటి జరిగింది.
ఒకే బంతికి క్యాచ్ మిస్ చేయడం.. రనౌట్ చాన్స్ ను వదిలి పెట్టడం. చివరకు బంతి బౌండరీ చేరడం.. కలలో కూడా జరగనటువంటి ఈ విషయం యూరోపియన్ క్రికెట్ లో చోటు చేసుకుంది. ఈ విచిత్రమై సంఘటన ఈసీఎస్ పోర్చుగల్ టి20 లీగ్‌లో చోటుచేసుకుంది. టోర్నీలో భాగంగా కోయింబ్రా నైట్స్, ఫ్రెండ్‌షిప్ సీసీ మధ్య 21వ లీగ్ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన కోయింబ్రా నైట్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఫ్రెండ్ షిప్ సీసీ జట్టు బ్యాటింగ్ కు దిగింది. మ్యాచ్ మొత్తం ఆ జట్టు చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేసింది. ఇక చివరి ఓవర్లో అయితే పెద్ద డ్రామానే జరిగింది. ఆ ఓవర్ లో క్రీజులో ఉన్న ఫ్రెండ్ షిప్ బ్యాటర్ మిడి వికెట్ దిశగా భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బ్యాట్ అంచుకు తగిలిన బంతి మిడాన్ లో గాల్లోకి లేచింది. అక్కడే ఉన్న కొయింబ్రా నైట్స్ ఫీల్డర్ క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు. అయితే బంతి అంచనాను పూర్తిగా తప్పిన అతడు క్యాచ్ ను మిస్ చేశాడు. అయితే షాట్ ఆడిన బ్యాటర్ పరుగు కోసం ప్రయత్నించి పిచ్ మధ్య వరకు వచ్చాడు. క్యాచ్ డ్రాప్ చేసిన ఫీల్డర్ దీనిని గమనించి కీపర్ కు త్రో చేశాడు. అయితే ఆ త్రో కాస్తా కీపర్ నెత్తి మీద నుంచి వెళ్లడంతో రనౌట్ చాన్స్ మిస్ అయ్యింది. ఇక ఓవర్ త్రో కాస్తా థర్డ్ మ్యాన్ దిశగా బౌండరీ దగ్గరకు వెళ్లగా అక్కడ ఫీల్డింగ్ చేసే క్రమంలో బంతిని కాలితో తన్ని ఫోర్ పోయేలా చేశాడు కొయింబ్రా ఫీల్డర్. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Just when you think you've seen it all... 😂
via @EuropeanCricket pic.twitter.com/6qAQ6q8dH0
— That’s so Village (@ThatsSoVillage) May 2, 2022
దాంతో ఒక్క బంతికే సిక్సర్ రూపంలో కాకుండా ఆటగాళ్ల తప్పిదంతో ఆరు పరుగులు వచ్చాయి. దాంతో ఒక్క బంతికే మనం క్యాచ్ మిస్, రనౌట్ చాన్స్ మిస్ లతో పాటు బౌండరీ దగ్గర ఫీల్డింగ్ మిస్ ను కూడా చూశాం అన్నమాట.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chennai Super Kings, Cricket, IPL, IPL 2022, Kane Williamson, MS Dhoni, Mumbai Indians, Rohit sharma, Royal Challengers Bangalore, Sunrisers Hyderabad, Virat kohli